Monday, April 29, 2024

తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం

తప్పక చదవండి
  • ఉప్పల్‌ లో కాంగ్రెస్‌ గెలిపిస్తే యువతకు బంగారు భవిష్యత్తు
  • కేసీఆర్‌ రాక్షస పాలన పోవాలి కాంగ్రెస్‌ రావాలి…
  • మల్కాజ్‌ గిరి పార్లమెంటు సభ్యుడిగా హామీ ఇస్తున్న

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలోని కాప్రా సర్కిల్‌ ఈసీఐఎల్‌ చౌరస్తాలో పరమేశ్వర్‌ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కార్నర్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్‌ రాక్షస పాలన కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అంటూ భ్రమలో పడేవేసి భూములు, సహజ సంపదలను దోచుకున్నాడని దుయ్యబట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పదివేల ఎకరాల భూములను దోచుకున్న అనకుండా కేసీఆర్‌ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ రాక్షస పాలన పోయి ఇందిరమ్మ రాజ్యం రావడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కల్వకుంట్ల కుటుంబం చెయ్యని అవినీతి లేదని ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజానీకం మేల్కొంటున్నారని ధీమా వ్యక్తం చేశారు.

పరమేశ్వర్‌ రెడ్డిని మెజార్టీతో గెలిపించాలని యువతకు పిలుపు..
ఉప్పల్‌ నియోజకవర్గంలో యువకుడు, ప్రజా నాయకుడు పరమేశ్వర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని యువతకు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఉప్పల్‌ లో కాంగ్రెస్‌ గెలిస్తే యువతకు, సబండ వర్గాల ప్రజలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని భరోసానిచ్చారు. ఉప్పల్‌ పరమేశ్వర్‌ రెడ్డికి అన్ని వర్గాల నుండి సంపూర్ణ మద్దతు దొరుకుతుందని నవంబర్‌ 30న భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, భారీగా యువత పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు