Tuesday, April 30, 2024

మోడల్ స్కూల్‌లోని అవినీతి అధికారిపై చ‌ర్య‌లెక్క‌డ‌..?

తప్పక చదవండి
  • పెద్ద‌ప‌ల్లి డీఈవో కార్యాల‌యంలోనే బ్లాక్ షీప్‌
  • ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను కాపాడే ప్ర‌య‌త్నం
  • స‌స్పెండ్ కాకుండా మేనేజ్ చేసిన ఓ అధికారి
  • రికార్డుల తారుమారుకు స‌హ‌క‌రిస్తున్న వైనం
  • ఆధారాలున్న చ‌ర్య‌లు తీసుకొని మోడ‌ల్ స్కూల్ డైరెక్ట‌ర్‌

పెద్దపల్లి జిల్లా ఓదెల తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జావేద, ఉపాధ్యాయులపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులు, వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తెలంగాణ మోడల్ స్కూల్స్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారిని విచారణకు ఆదేశించారు. కానీ ఇప్పటికీ వారం రోజులు గడిచినప్పటికీ విచారణ చేయకుండా డీఈఓ కార్యాలయంలోని ఒక ముఖ్యమైన అధికారి మానిటరింగ్ చేస్తు అవినీతి ప్రిన్సిపల్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పాఠశాలలో రికార్డులు తారుమారు చేసే కార్యక్రమానికి పాఠశాల అధికారులకు సమయం ఇస్తున్నట్లు సమాచారం.. పాత రికార్డులను మాయం చేసి వాటి స్థానంలో కొత్త రికార్డును సృష్టిస్తున్న ప్రిన్సిపల్ కు సహకరిస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్న సదరు అధికారి.. ఇదే స్కూల్లోని ప్రిన్సిపల్, ఉపాధ్యాయులపై గతంలో పత్రికల్లో వచ్చిన ఆరోపణల ఆధారంగా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ విచారణకాదేశించి ప్రిన్సిపల్ కు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇస్తే డీఈఓ ఆఫీస్ లో సస్పెండ్ కాకుండా మేనేజ్ చేసిన‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం వచ్చిన ఆరోపణలు అభియోగాలపై కూడా పాత ‌పద్ధతిలోనే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉన్న విచారణ అధికారిని మేనేజ్ చేయవచ్చు అనే ధీమాతో ప్రిన్సిపల్ ఉన్నట్టుతెలుస్తుంది. దీనిని బట్టి ప్రస్తుత విచారణ ఎంత సక్రమంగా జరగబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఈ విషయమై వివరణ కోసం పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదిస్తే ఫోన్‌లో స్పందించని పరిస్థితి ఏర్ప‌డింది. జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉండి కనీసం ఫోను తీయని పరిస్థితిలో ఉంటే జిల్లాలో ఏదైనా పాఠశాలలో సమస్యలు ఎదురైతే విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాలంటే ఏ విధంగా ఉంటుందో ఆ ప‌రిస్థ‌తిని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉంటూ కనీస బాధ్యతగా తీసుకోకుండా విచారణ ఆలస్యం చేస్తూ జర్నలిస్టుల ఫోన్లు స్పందించకుండా వివరణ ఇయ్యకుండా ఉన్నారంటే ఈ విషయంలో వారిపై కూడా అనేక అనుమానాలు రేకిస్తున్నాయి.

- Advertisement -

దీనిపై తెలంగాణ మోడల్ స్కూల్ హెడ్ ఆఫీస్ అధికారులను సంప్రదించి తెలియజేస్తే వారు కఠినమైన చర్యలు తీసుకుంటాం విచారణ చేయిస్తాం అని చెప్పిన పరిస్థితి. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాలయాల్లోని ఈ విధమైన అవినీతి అక్రమాలు, రికార్డుల తారుమారు, అవినీతిని మేనేజ్ చేయటం మానిటరింగ్ చేయటం జరుగుతుందంటే సమాజం నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఓదెలు మోడల్ స్కూల్ పై వచ్చిన ఆరోపణలు అభియోగాలపై నిజాయితీగల అధికారితో విచారణ జరిపించి ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కి, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శికి లిఖిత‌పూర్వకమైన ఫిర్యాదులు అందినట్లు సమాచారం. వీరి విచారణకు స్థానిక డీఈఓ కార్యాలయం విచారణకు ఏ విధమైన వ్యత్యాసం ఉంటుందో వేచి చూడాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు