- అధికారం పోయిన తగ్గని దొర అహంకారం
- అధికారంతో విర్రవీగితే బుద్ధి చెప్పిన ప్రజలు
- నైజాం పైజామాను ఊడగొట్టిన చరిత్ర తెలంగాణది
- తెలంగాణ బిడ్డల పౌరుషం ముందు ఈ రావులు ఒక లెక్కా?
- వ్యవస్థకు బాధ్యులుగా ఉన్నవారు వ్యక్తి పూజ చేయరాదు
- ప్రభుత్వ వ్యవస్థలు అధికారులు ప్రజల కోసం పనిచేయాలి.. కాదని పాలకుల కోసం పనిచేస్తే జైలు జీవితం తప్పదు
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు రాక్షస పాలన చేసిన రావులను ఇప్పుడు రాహు గ్రహం మింగేసింది. అధికారం పోయిన అహంకారం తగ్గలేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త నేను నాది అనే విర్రవిగే రావులను ప్రజలు కాలగర్భంలో కలిపేస్తారు. ఇప్పటికే ఒక్కొక్కరుగా రావులు కవితా రావు, రాధా కిషన్ రావు, భుజంగరావు, ప్రణీతరావు, తిరుపతి రావు, కన్నారావు ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే పదుల సంఖ్యలో రావులు జైలు పాలయ్యారు. రావుల కాలం రాహుకాలంగా మారిపోయినట్లు కనిపిస్తోంది. నడిచే దారిలో పువ్వులు జల్లే రోజులు పోయి.. రాళ్ళ దెబ్బలు ఎదుర్కోవాల్సిన దీనావస్థకు పడిపోయింది పరిస్థితి. అధికారం కోల్పోయింది మొదలు కేసీఆర్ సహా రావులందరూ కింద నుండి పై వరకు కేసుల సమస్యల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న చిత్రమైన పరిస్థితి నెలకొంది. కనుసైగతో వ్యవస్థలను శాసించిన రాజసం కాళ్ళు పట్టుకుని యాచించే స్థాయికి దిగజారిపోయినట్లుంది ప్రస్తుతం! అధికారంలో ఉన్న రావులు తమ పోలీస్ రావులను ఒక చోట చేర్చి ఇష్టంవచ్చినట్లు అధికారాలు కట్టబెట్టి ప్రత్యర్థి పార్టీలు సహా అందరి గుట్టూ తమకు తెలిసిపోయేలా అక్రమ పద్దతిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపారు! ప్రత్యర్థులను దశాబ్ద కాలంపాటు నానా ఇబ్బందులకు గురిచేసిన రాజ్యాధికారులు..ఇపుడు పీఠం కూలిపోయి ప్రత్యర్థుల చేతిలో చావు దెబ్బలు తినాల్సిన దుర్భర పరిస్థితిలోకి దిగజారిపోయారు. అధికారం శాశ్వతం కాదని తెలిసినా తామేదో చక్రవర్తులం… తమ అనుంగ మంత్రులు.. కులముఖ్యులు రాజులు అన్నట్లుగా దశాబ్ద కాలం పాటు ఇష్టా రీతిలో నియంతలా రాష్ట్రాన్ని శాసించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ప్రాపకం కోసం వ్యవస్థలను గుప్పిట పట్టిన వైనం ఇపుడిపుడే ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. తిలా పాపం తల పిడికెడు అన్నట్లు.. కేసీఆర్, అయన కుటుంబం అండ చూసుకుని రెచ్చిపోయిన అధికార రావులు తమ పాపాలకు ప్రాయశ్చితంగా వరుసబెట్టి కారాగారాలకు వెళ్లిపోతున్నారు. ఇంకా కొందరు తమ సమయం ఎప్పుడొస్తుందో అని ఆందోళనతో కంటికి కునుకులేకుండా బిక్కు బిక్కు మంటూ రోజులు లెక్కబెట్టుకుంటున్నారు! ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ లో రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, అక్రమ అరెస్టుల వ్యవహారంలో సందీప్ రావు, కబ్జా కేసుల్లో సంతోష్ రావు, కన్నారావు, ఉద్యోగాల్లో అవకతవకల కేసులో ప్రభాకర్ రావు, అవినీతి వ్యవహారాల్లో కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు, అంతిమంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేసులు విచారణలు కొందరి అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి, కవితా రావు ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు.
కొంతమంది అధికారులు కులగజ్జితో రావులము అనే అహంకారంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, లాంటి వారి కనుసన్నల్లో పనిచేశారు ప్రభుత్వ అధికారులుగా ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు జవాబు దారితనంగా ఉండకుండా వారి ఇష్టానుసారంగా వివరించడంతో వారికి కూడా జైలు జీవితం తప్పలేదు. వ్యక్తులను నమ్మి ఒక వ్యక్తి పూజ చేసేవారు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే.
నిజానికి ఇంత తొందరగా తమ నుండి అధికారం దూరమవుతుందని, ఇంత తొందరగా తమ పాపాలు పండుతాయని అధికార రావులు ఊహించి ఉండరు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే తత్వం బోధపడటంతో కీలక ఆనవాళ్ల ధ్వంసంపై వ్యూహ రచన మొదలెట్టారు. ఎన్నికల ఫలితాలు మొదలవ్వగానే కాస్తో కూస్తో ఉన్న ఆశ కూడా చచ్చిపోవడంతో ఇక తమ కార్యాచరణ మొదలెట్టి కంప్యూటర్లు, ఫైళ్లలో నిక్షిప్తమై ఉన్న తమ అక్రమాల గుట్టలను తగలెట్టడం కానించేసారు. కానీ చేసిన పాపాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ఎదో విధంగా ఆధారాలు లభిస్తూనే ఉన్నాయి. కీలక రావులందరూ ఇప్పటికే కేసులు జైళ్ల చుట్టూ తిరుగుతుండగా.. ఇంకొంతమంది పాపాల రావులు కూడా చిక్కుల్లో పడే అవకాశం స్పష్టానంగా కనిపిస్తోంది.
అధికారంలో ఉన్నన్నాళ్ళు తమది రాజకుటుంబం అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్… అటు అధికారం కోల్పోయి.. ఇటు పరువు ప్రతిష్టలు కోల్పోయి సొంత బిడ్డ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయి తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే ఏమీ చేయలేని దయనీయ పరిస్థితుల్లో బయటకు గంభీరత్వం నటిస్తూ లోలోన గుక్క పట్టి ఏడవల్సిన దీనావస్థను చవిచూస్తున్నారు. మొత్తంగా చూస్తే రావు కాలం రాహు కాలంలా మారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.