Wednesday, May 15, 2024

కందనూలులో కాంగ్రెస్‌ సునామీ..!

తప్పక చదవండి
  • ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్తున్న రాజేష్‌రెడ్డి
  • గడపగడపలో రాజేష్‌ గెలుపుపై చర్చ
  • మార్పుకోరుకుంటున్న కందనూలు ఓటర్లు
  • ఎమ్మెల్యే మర్రి హామీలపై విసికిపోయిన ప్రజలు
  • పదేళ్లలో చేయలేని పనులను కొత్తగా చేసేదేంటూ ప్రశ్నిస్తున్న ప్రజానీకం

నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సునామీ కనిపిస్తోంది. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి గెలుపుపైనే గడప గడపనా చర్చ జరుగుతోంది. కొద్ది నెలల స్వల్ప వ్యవధిలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజేష్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డికి గెలుపుపై సందేహాలను తీసుకొచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి కంటే ఆత్మగౌరవ నినాదంపైన ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డి విధానాలతో చాలా మంది నాయకులు, ప్రజలు, మేధావులు అసంతృప్తిలో ఉన్నారు. వివిధ పనుల నిమిత్తం వెళ్లే క్రమంలో, ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో ఎమ్మెల్యే వ్యవహార తీరుపై చాలా మంది గుర్రుగా ఉన్నారు. ఇది బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయగా మందలింపులు ఎదుర్కొన్న సంఘటనలు కోకొల్లలు. దీంతో నియోజకవర్గంలో ఈ ఎన్నికలను ఆత్మగౌరవ సమస్యగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న మర్రి మంత్రిగా మారితే తమ పరిస్థితి ఏంటనే చర్చ రాజకీయ నాయకులు, ‘ప్రత్యర్థులతో పాటుగా సొంత పార్టీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మరిన నాయకులపై, ప్రశ్నించే సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ఎక్కడా ఈ అంశంపై పెదవి విప్పని నాయకులు కాంగ్రెస్‌ బలంగా మారడం, రాజేష్‌రెడ్డికి గెలుపు అవకాశాలు పెరగడంతో సైలెంట్‌గా ఉంటూనే కాంగ్రెస్‌కు సపోర్ట్‌ చేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ ఎన్నికల్లో ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పలు ఏజెన్సీల సర్వేల్లోనూ ఇదే అంశం ప్రధానంగా గుర్తించినట్లుగా సమాచారం. కాగా తాజాగా ఎమ్మెల్యే మర్రి చేస్తున్న హామీలు సైతం ఓటమిపై ఆందోళనలకు తావిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని హామీలను పూర్తి చేశానని, డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించలేదని, అధికారంలోకి వచ్చాక తమ ఆస్తులు అమ్మి అయినా ఇండ్లు కట్టిస్తామనడం, పేద ఆడ పిల్లలకు తాను మేనమామగా ఉంటూ చదువు, పెళ్లిళ్లు చేసే బాధ్యత తీసుకుంటానని ప్రకటిస్తడాన్ని ఉదహరిస్తున్నారు. ఈ పదేళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. గతంలో పాలెం పారిశ్రామిక వాడను పునరుద్ధరిస్తానన్న హామీ కూడా విస్మరించారు. ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు తీసుకొస్తానంటున్నారు. ఇంజనీరింగ్‌ కాలేజీ గత రెండు ఎన్నికల్లోనూ ప్రస్తావించి ఇప్పుడు కొత్తగా తెస్తానంటూ ప్రకటిస్తున్నారు. జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌కు జేఎన్‌టీయూ కాలేజీ మంజూరు చేయగా ఇప్పటికే వనపర్తిలో ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రారంభమైంది. సీఎంతో ఎంతో చనువు ఉందంటున్న, తనకు చదువంటే ఇష్టమంటున్న ఎమ్మెల్యే ఈ పదేళ్లలో ఇంజనీరింగ్‌ కాలేజీ ఎందుకు తీసుకురాలేదనే ప్రశ్నలకు సమాధానం లభించని పరిస్థితి. ఈ క్రమంలో ఐటీ హబ్‌ తీసుకురావడం సాధ్యమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగే మినీ ట్యాంక్‌బండ్‌లో బోటింగ్‌ చేస్తామన్న హామీ, మినీ స్టేడియం, పార్క్‌ రవీంద్రభారతిలా కళాభారతి నిర్మిస్తానన్న పలు హామీలు అటకెక్కాయి. ఈ ఎన్నికల్లో గట్టెక్కేదుకు తన అఫిడవిటీపై సుప్రీంకోర్టుకు వెళ్లిన, తనను తీవ్రంగా విమర్శించిన నాగంతో ప్రస్తుతం జతకట్టడం కూడా ప్రజలు గమనిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డితో కలిసి గెలిచారు. అప్పుడు నాగంను విమర్శించి, ఇప్పుడు కూచుకుళ్లను విమర్శిస్తూ ఎమ్మెల్యే పదవిని సాధించేందుకు చేస్తున్న ఎత్తులు కూడా ప్రజల్లో ముఖ్యంగా మేధావుల్లో అసహనాన్ని కలిగిస్తున్నాయి. అధికారం, డబ్బులతో షో రాజకీయాలు చేస్తుంటారన్న చర్చ కూడా కందనూలులో జరుగుతోంది. మొత్తం మీద ప్రస్తుత ఎన్నికల్లో కందనూలు ఓటర్లు మార్పు కోరుకుంటుండటంతో కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజేష్‌ రెడ్డిని గెలిపించేలా పరిస్థితులు మారడం గమనార్హం. ఇప్పటికే ముగిసిన ప్రచారంలో దాదాపుగా వివిధ ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలు సైతం రాజేష్‌రెడ్డి గెలుపుపై పక్కాగా తేల్చుతున్నాయి. దీంతో రాజేష్‌ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారనే అభిప్రాయం కాంగ్రెస్‌ వాదుల్లో, ప్రజల్లో విస్త్రృతంగా ప్రచారం జరుగుతోండటం విశేషం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు