Wednesday, May 22, 2024

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

తప్పక చదవండి
 • అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
 • అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
 • కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
 • చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
 • అవినీతి మత్తులో జోగుతున్న అధికారులు..
 • చైర్మన్ పై చర్యలకు వెనుకడుగు వేసిన వైనం..
 • చైర్మన్ భార్య అయితే 2019 మున్సిపల్ చట్టం వర్తించదా..?
 • అమీన్పూర్ మున్సిపాలిటిలో అధికారం అడ్డు పెట్టుకొని అందిన కాడికి దోచుకొని కోట్లకు పడగలెత్తిన చైర్మన్..
 • నిర్మాణం పూర్తి అయ్యేవరకు చర్యలపేరుతో అధికారుల కాలయాపన..
 • అక్రమ నిర్మాణాన్ని సక్రమం చేసేందుకు హితోధికంగా సాయం..
 • అక్రమార్కుడు కోర్టుకు వెళ్లేందుకు పరోక్ష సహకారం అందించిన మున్సిపల్, రెవెన్యూ శాఖలు..
 • సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి స్పందించాలి..
 • అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలి..
 • అన్యాక్రాంతమవుతున్న చెరువును పరిరక్షించాలని స్థానికుల డిమాండ్..

ఒక మున్సిపల్ చైర్మన్ గా ప్రజల బాగోగులు చూడవలసిన వ్యక్తి.. ప్రజల జీవితాల మాట అటుంచి.. ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం ఎజెండాగా మార్చుకున్నాడు.. కోర్టులు, చట్టాలు, ప్రభుత్వం ఇవన్నీ ఇతగాడికి అనవసరం.. కబ్జా చేయడం అక్రమ నిర్మాణాలు సాగించడం ఇదే పనిగా పెట్టుకున్నాడు.. ఏకంగా చెరువు ఎఫ్ టి ఎల్ లో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ అక్రమ నిర్మాణం చేపట్టాడు.. వ్యవస్థలను మేనేజ్ చెయ్యడంలో అందెవేసిన చేయి అవడం వల్ల.. ప్రభుత్వాధికారులను లంచాలతో కొనేశాడు.. తాను అక్రమంగా నిర్మిస్తున్నది అసలు ఎఫ్ టి ఎల్ పరిధిలోకి రాదంటూ కట్టుకథలు చెబుతాడు.. చివరికి నిర్మాణం పూర్తి అయిపోవచ్చింది.. అంటే ఎంతగా ఈయనగారు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ వ్యవహారాలు నడిపిస్తున్నాడో అర్ధం అవుతోంది.. ఈయనగానే అమీన్ పూర్ మున్సిపల్చైర్మన్ పాండు రంగా రెడ్డి..

సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మండల పరిధిలోని శంభుని కుంట చెరువుకు మనిషి రూపంలో అక్రమ గ్రహణం పట్టింది.. రక్షించాల్సిన అధికారులే లంచాలకు మరిగి బక్షిస్తుండటంతో చెరువు ఎఫ్.టి.ఎల్. కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది.. అమీన్ పూర్ మున్సిపాలిటీ కేంద్రంగా యథేచ్ఛగా ఒక అక్రమ నిర్మాణం సాగుతోంది.. ఈ వ్యవహారానికి సంబంధించి శంబునికుంట సర్వే నెంబరుకు 765 కు చెందిన మొత్తం 22 ఎకరాల భూమి ఉండగా.. దానికి సంబంధించిన ఎఫ్టీఎల్ స్థలంలో మరో సర్వే నెంబర్ 706 సంబంధించిన పత్రాలు చూపిస్తూ స్థానిక ప్రజా ప్రతినిధి యదేచ్ఛగా నిర్మాణం కొనసాగిస్తుండటం జరుగుతోంది.. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధే తప్పుడు పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాజేస్తుండటం ముమ్మాటికీ అధికార దుర్వినియోగమే.. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతుండటం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది..శంభుని కుంట చెరువు ఎఫ్.టి.ఎల్. ను కోనుగోలు చేసానని బుకాయిస్తుండటం హాస్యాస్పదంగా ఉంది.. గతంలో చెరువులను కబ్జాలకు గురికాకుండా ఉన్నతాధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలసి జాయింట్ ఇన్స్ పెక్షన్ చేసి, చెరువుల యొక్క ఎఫ్.టి.ఎల్. బఫర్ జోన్లను గుర్తించి, ఒక స్పష్టమైన నివేదికను రూపొందించారు.. అట్టి నివేదికను పరిగణలోకి తీసుకున్న ఇరిగేషన్ అధికారులు విచారణ జరిపి.. అట్టి నిర్మాణం ఎఫ్.టి.ఎల్. లోనే నిర్మిస్తున్నారని.. నిర్మాణం అక్రమమని నిర్దారించారు.. వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు లేఖలు రాశారు.. అయినప్పటికీ నేటికీ స్థానిక మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. ప్రేక్షక పాత్ర వహిస్తుండటం దేనికి సంకేతం..? చెరువులను చెరబడుతున్న వ్యక్తులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి.. ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్లు అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని పలువురు సామజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.. కబ్జాకు గురౌతున్న చెరువు ఎఫ్.టి.ఎల్. స్థలాన్ని కాపాడాలంటూ స్థానికంగా నివాసం ఉంటున్న ఒక వ్యక్తి హైకోర్టును సైతం ఆశ్రయించాడు.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సదరు ప్రజా ప్రతినిధి కోర్టులో కేసు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.. ఇప్పటికైనా చెరువు కబ్జా విషయంలో అధికారులు చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తారా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే..? సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.. అమీన్ పూర్ మున్సి పాల్టీలో అక్రమ నిర్మాణాలపై, లేవుట్ లోని రోడ్ల కబ్జాల వెనుక దాగున్న లోగుట్టులను, మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి కథా, కమామీషును మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతి పై అస్రం’…

- Advertisement -

ఇక మున్సిపల్ శాఖ అధికారుల వ్యవహారం చూస్తే కోర్టు చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చిన.. ఆ దిశగా అడుగులు వేయకుండా అక్రమ నిర్మాణాన్ని సక్రమం చేయుట కొరకు అమీన్పూర్ చైర్మన్ భార్య పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణానికి నోటీసులు ఇచ్చి ఎలాంటి అనుమతులు లేని నిర్మాణం అని తెలిసిన చర్యలు తీసుకోకుండా..నోటీసులతో కాలయాపన చేసి కోర్టులకు వెళ్ళేటందుకు పరోక్ష సహకారం అందిస్తూ కాలయాపన చేస్తుండడం పై అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ దంపతులకు ప్రత్యేక చట్టం సామాన్య ప్రజలకు మరో చట్టం ఇదెక్కడి న్యాయమంటూ స్థానిక ప్రజలు మండిపడుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు