Sunday, May 5, 2024

గెలుపు కాంగ్రెస్‌ దే

తప్పక చదవండి
  • బీఆర్‌ఎస్‌ పాలనలో వెనుక బడ్డ హుస్నాబాద్‌
  • నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
  • కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి
  • అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు
  • హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. వెంటనే 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. ప్రజలు ప్రభుత్వం పై విశ్వాసం కోల్పోయారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి నాది హామీ అంటూ, హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై, యువజన కాంగ్రెస్‌ లో ఉంటూ తెలంగాణ విభజనకై పోరాడానని గుర్తు చేశారు. హైకమాండ్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించిన, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న. చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఇచ్చినప్పటికీ, 2014 ఎన్నికల్లో కరీంనగర్‌ పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యాను. 2019 ఎన్నికల్లో నూ మరోసారి ఓటమి చవి చూశాను. అందుకే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు.

స్థానిక ఎమ్మెల్యే అసమర్ధత వల్ల హుస్నాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో తప్ప, రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. యావత్‌ తెలంగాణ ప్రజలు ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారన్నారు. పేదవాని కి గూడు కల్పించలేని పరిస్థితి లో ప్రభుత్వం ఉందని అన్నారు. మాయ మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టే బీఆర్‌ఎస్‌ పార్టీ నీ ఓడిరచాలని అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్‌ ప్రభుత్వం చెలగాటం ఆడిరదని అన్నారు. ఒక్క కేసీఆర్‌ ఉద్యోగము పోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అని అన్నారు.

- Advertisement -

చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే హుస్నాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్తాన్నని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే నేరీవర్చబోయే ఆరు గ్యారెంటీ పథకాలను పొన్నం ప్రజలకు వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ. 2500 ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. రూ. 500 కే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వబడుతుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా పథకం, గృహ జ్యోతి, యువ వికాసం పథకాల గూర్చి వివరించారు. పేద వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల సాయం చేస్తుందని తెలిపారు. వృద్ధులకు రూ. 4 వేల చేయూత ఫించన్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు లింగ మూర్తి, సీపీఐ జిల్లా పార్టీ కార్యదర్శి మంద పవన్‌, సామాజిక సేవకురాలు మంజులక్క, సింగిల్‌ విండో చైర్మన్‌ బోలిషెట్టీ శివయ్య, డిసిసి ప్రధాన కార్యదర్శి చిత్తారి రవి, వార్డు కౌన్సిలర్‌ లు వల్లపు రాజు, పున్న లావణ్య – సది, చిత్తారి పద్మ, భూక్య సరోజన, మ్యాదర బోయిన శ్రీనివాస్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ గుర్రాల లింగా రెడ్డి, నాయకులు బూర్గు కిష్ట స్వామి, ఎండి హసన్‌, వెన్న రాజు, అక్కు శ్రీనివాస్‌, భిక్యా నాయక్‌, మైదం శెట్టి వీరన్న, టౌన్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సాగర్‌, బ్లాండినా, గడిపే రమ, పచ్విమట్ల రాధ, కమలమ్మ, కేశవెన రమేష్‌, హరీష్‌, మ్యాదర బోయిన శ్రీకాంత్‌, నగేష్‌, పున్న రంజిత్‌, అజయ్‌,కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు