Wednesday, October 9, 2024
spot_img

హైదారా’బాద్’షా ఎవరూ..!?

తప్పక చదవండి
  • పాత బస్తిపైనే అందరి దృష్టి
  • దశాబ్ధాలుగా ఎంఐఎంకు పట్టంకడుతున్న ఓటర్లు
  • ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఓల్డ్ సిటీ
  • ఫిరోజ్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ బీజేపీకి క‌లిసోచ్చేనా..
  • ఎంఐఎంతో చేతులు కలిపిన కాంగ్రెస్..!
  • ఈ సారి రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ
  • అసదుద్దీన్ ఓవైసీ హవా కొనసాగేనా
  • తెలంగాణ బీజేపీ వ్యూహం ఫలించేనా
  • ముస్లింలు మాధవీలత వెైపు నిలుస్తారా
  • హైదరాబాదీ జనం మళ్లీ పతంగికే ఓటేస్తారా

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వేడి రాజుకుంది. మొత్తం 543 స్థానాలకు 7దశల్లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నిక‌ల‌కు ఆయా పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జూన్ 1తో ఓట్లు ముగియనుండగా అదే నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇదంతా ఓ వైపు అయితే యావత్ దేశం చూపు హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. 40ఏళ్లుగా ఎంఐఎం పార్టీ అక్కడ విజయం సాధిస్తూ వస్తుంది. ఎదురులేని మనిషిగా ఓవైసీ హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని తమ కంచుకోటగా మార్చుకున్నారు. ఈ సారి భాగ్యనగరం ఎంపీ స్థానంపై గట్టిపోటీ నెలకొంది. ఇదీలా ఉండగా సడెన్ గా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎన్నడూ లేని విధంగా ఓల్డ్ సిటీపై కన్నేసిన భారతీయ జనతా పార్టీ ఓ సాధారణ (అనుభవం) రాజకీయాలతో సంబంధం లేని హిందూ మహిళ మాధ‌విల‌త‌ను రంగంలోకి దింపింది. కాగా కాంగ్రెస్ పార్టీ ఓవైసీకి (ఎంఐఎం) సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల‌ క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ ఎంఐఎంకే తమ మద్దతు అన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసదుద్దీన్ కు మద్దతు పలకాలని చెప్పినట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమలం పువ్వు, పతంగి గుర్తుల మధ్యే పోటీ నెలకొన్నది. మరోవైపు కాంగ్రెస్, ఎంఐఎం ఒప్పందంపై మాధవీలత కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ ఎంపీగా తన విజయం ఖాయమన్నారు. రజాకార్లకు తోడుగా ఉండేవాళ్లంతా నా ప్రత్యర్థులే.. అయినా పర్లేదు అసదుద్దీన్ పై లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలిచి తీరుతానంటూ ధీమా వ్యక్తం చేసింది.

- Advertisement -

దశాబ్ధాలుగా మారని రాతలు:
అసలైన హైదరాబాద్ గా చెప్పే ఓల్డ్ సిటీని ఓవైసీ కుటుంబమే దశాబ్ధాలుగా ఏలుతున్నప్పటికి అక్కడ డెవలప్ మెంట్ మాత్రం శూన్యం. కనీసం రోడ్లు, నాలాలు, మంచినీళ్లు, కరెంట్ సవలత్ లు లేవంటే నమ్మశక్యం కాదు. నాటి నుంచి నేటి వరకు అదే తోపుడు బండ్లు, ఫుట్ పాత్ వ్యాపారాలు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. వీళ్లు మాత్రం ఎవరూ రాష్ట్రంలో అధికారంలో ఉంటే వారితో అంటకాగుతూ వ్యాపారాలు, అనేక దందాలు చేసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు. కానీ దిగువ, మధ్య తరగతి ముస్లిం కుటుంబాల పరిస్థితి దుర్భరంగా ఉన్నాయి.

హైద‌రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లిం ప్ర‌జ‌లు అధిక శాతం వీధి వ్యాపారం చేసుకుంటు వారి జీవ‌నాన్ని కొన‌సాగిస్తున్నారు. వ్యాపారంలో భాగంగా రాత్రి కొంచెం లేటైతే పోలీసులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే ప‌రిస్థితి నెల‌కొంది. వీరి జీవితాల్లో ఆర్థికంగా అభివృద్ధి దిశ‌గా మార్పులు తీసుకొచ్చే విధంగా అస‌సుద్దీన్ ఓవైసీ ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డం శోచ‌నీయం. ఓల్డ్ సిటీ ప్ర‌జ‌లకు చ‌ట్టాల‌కు లోబ‌డి వ్య‌వ‌హ‌రించే విధంగా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి.. కానీ, నాయ‌కులు ఓట్ బ్యాంకు రాజ‌కీయాలు చేస్తూ.. వారికి చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు ప్రోత్స‌హించ‌డంతో అనేక మంది జైలు పాలు కావ‌డం, కోర్టుల చుట్టూ తిర‌గ‌డం జ‌రుగుతుంది. ఇక‌నైనా ముస్లీం ప్ర‌జ‌లు ఆలోచ‌న‌తో త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకొని అభివృద్ధి దిశ‌గా అడుగులు వేయాల‌ని సామాజిక వేత్త‌లు సూచిస్తున్నారు.

ఓవైసీకి చెక్ పెట్టేందుకే బీజేపీ స్కెచ్ :
ఫిబ్రవరి వరకు అసలు రాజకీయాలకు పరిచయం లేని వ్యక్తికీ బీజేపీ హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి షాక్ కు గురిచేసింది. ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలొచ్చిన కాషాయ పార్టీలో టికెట్ల కోసం పోటీ నెలకొంటుంది. హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నేతలకే హైకమాండ్ టికెట్ కేటాయిస్తుంది. కానీ ఈ సారి అందుకు భిన్నంగా కనీసం భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం లేని వారికి టికెట్ ఎలా ఇస్తారని టీబీజేపీలో అసంతృప్తి నెలకొన్నప్పటికీ అధిష్టానం పెద్దలు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. పాతబస్తీలో పలు కార్యక్రమాలు చేపడుతూ, ట్రిపుల్ తలాక్​ కు వ్యతిరేకంగా పోరాడిన కొంపల్లి మాధవీలతను బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రముఖ హాస్పిటల్ విరంచీ చైర్మన్​ గా ఉన్న కొన్నేండ్లుగా లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఆమె సేవా కార్యక్రమాలు చేస్తున్నది. లతామా ఫౌండేషన్, చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీగా నిరుపేద ముస్లిం మహిళల కోసం మాధవీలత పాటు పడుతున్నారు. అసదుద్దీన్ (ఎంఐఎం) కు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కమలదలం వ్యూహాలు రచించింది. మాధవీలత అయితేనే హైదరాబాద్ లోక్ స్థానం తమ ఖాతాలో పడడం ఖాయంగా భావించి బీజేపీ ఆమెకు టికెట్ కేటాయించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు