Saturday, July 27, 2024

బహుజనుల ఆరాధ్య దైవానికి కూడా అవమానాలేనా

తప్పక చదవండి
  • తెలంగాణ ఆత్మగౌరవానికి ఆంధ్రుల ఆధిపత్యానికి తెరపడేనా
  • బహుజనబిడ్డల బడిపంతులు పైన ఆంధ్ర విషపు పంజా పడిందా
  • బాపు జ్యోతిరావు పూలేని కూడా అవమానించిన ఆంధ్ర మేధావులు
  • దేశవ్యాప్తంగా ఆనాటి నుండి నేటి వరకు ఎవరు ఏ స్థానంలో ఉండాలో నిర్ణయించింది ఆంధ్రులే
  • స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు షాడో పాలకులు ఆంధ్రులే
  • ఉద్యమాలు జరిగి ఎన్నో బలిదానాలు అయినా ఇప్పటికి తెర వెనుక ఛీ ఆంధ్రపాలకు లేనా
  • కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో భైటోడు పెత్తనం ఏంటి
  • తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా మేల్కొనండి లేకుంటే మన మనగడ కష్టమే

భారతదేశ వ్యాప్తంగా స్త్రీలకు అందులో దళిత బహుజన బిడ్డలకు విద్య నందించాలని నినదించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆంద్రా విషపు కౌగిలిలో బలి అయ్యారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అని బొల్లం శివశంకర్ కో కన్వీనర్ యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన వాదం విస్తరించి పునాదుల్లోకి వెళ్లి ఆధిపత్య అహంకారానికి ప్రతీకగా నిలిచిన జ్యోతిరావు పూలే ను తెలుగు రాష్ట్రాలలో మరుగున పడేలా చెయ్యడంతో పాటు యావత్ భారతదేశంలోనే ఆన వాళ్ళు కనిపించకుండా జరిగిన కుట్ర ఆంద్రా ప్రాంతం నుండే మొదలు అయిందన్న వాస్తవాలు బహుజనంలో వళ్ళు గగుర్పాటు కు గురి చేస్తున్నాయి.అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండి విడిపోయిన ఆంధ్రప్రాంతం బ్రిటిష్ ఎలుబడిలో ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. బ్రిటిష్ ఎలుబడిలో ఉండడంతో ఇంగ్లీషు లాంటి భాష మీద గట్టి పట్టు సాధించిన ఆంధ్రప్రాంతీయులు అప్పటికే అందుబాటులో ఉన్న సాంకేతికతను అడ్డు పెట్టుకుని ఈ కుట్రలకు తెర లేపినట్లు స్పష్టంగా అర్థమౌతుంది.గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎవరెవరు ఏ ఏ రంగాలలో నిష్ణాతులన్న విషయం కనిపెట్టిన ఆంధ్రులు భవిష్యత్ లో తమకు ఎక్కడెక్కడ బ్రేక్ పడుతుందో నన్న నిజాన్ని గుర్తించిన మీదటనే అటువంటి వారి చరిత్రను తొక్కి పెట్టడమే కాకుండా అటువంటి చారిత్రాత్మక నేపధ్యం కలిగిన వ్యక్తులను పోలి ఉండే వారిని తెరమీదకు తెచ్చి అసలు వారిని తొక్కిపెట్టే కుతంత్రాలకు నాడే శ్రీకారం చుట్టారు.అప్పటికే ఆంద్ర ప్రాంతంలో ప్రచురణ సంస్థలు ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకోవడం…సినీ రంగం విస్తరించిన నేపధ్యంలో కవులు,కళాకారులు పుట్టుక రావడం ఒక ఎత్తు అయితే ఆనాటి కవులు సృష్టించిన పాత్రలతో వీరే నిజమైన హీరోలు అని ప్రజలు భ్రమించించేలా రాసిన కథలు వాడకంలోకి రావడంతో జ్యోతిరావు పూలే చరిత్ర వెలుగులోకి రాకుండా పోయింది అనేది ముమ్మాటికీ నిజం.అందుకు ఆధారాలు లేక కాదు…ఇప్పుడు ఇందులో అవి జోప్పిస్తే అసలు కథ డైవర్ట్ అవుతుందన్న మీ మాంస తోటే అందులోకి పోవడం లేదు.అటువంటి విషపు రాతల కారణంగానే విద్య యొక్క విశ్వకరణను సమర్దించిన మొట్టమొదటి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే లాంటి మహనీయులకు తెలుగు గడ్డ మీదనే కాదు యావత్ భారతదేశంలోనే సముచిత గౌరవం లభించ లేదుఅన్నది బహుజనులను వెంటాడుతుంది.సామాజిక సంస్కరణలకు కేంద్ర బిందువుగా మారాడమే కాకుండా నాడున్న అధిపత్య వర్గాల అణిచివేతలను ప్రతిఘటిస్తూ బ్రహ్మణీయవాదాన్ని ఎదుర్కొన్న ధీశాలి మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వారికి ఈ పరిస్థితి ఎదురు అయ్యింది అంటే చరిత్రను పెకిలిస్తే ఇంకెన్ని నిజాలు ఆ తవ్వకాలలో బయట పడతాయో అన్న సందేహం ప్రతీ బహుజనుడిని తొలిచి వేస్తుంది…చతుర్వర్ణ (కుల వ్యవస్థ) ను కూకటి వెళ్లతో సహా పెకిలించడంతో పాటు దిగువ కులాలకు విద్య తో పాటు సమాన హక్కులను కల్పించేందుకు గాను 1873 సెప్టెంబర్ 24 న సత్యశోధక్ సమాజ్( సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) సంస్థను ప్రారంభించారు. అంతటితో ఆగని ఆయన 1882 ప్రాంతంలో బ్రిటిష్ వలస వాదులకు బహుజనులు విద్యకు దూరంగా ఉండడంతో ఎదుర్కొంటున్న అసమానతలను ఏకరువు పెడుతూ నివేదికల రూపంలో నివేదించి ప్రత్యేక పాఠశాలల ఏర్పాటు గావించారు.అంతటితో కుడా సంతృప్తి చెందక విద్యావంతురాలైన తన సతీమణి సావిత్రి బాయి తో కలసి ఆడపిల్లలకు అందులో బహుజనులకు చెందిన ఆడ పిల్లల కోసమై 1848 లో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన పూలే 1851 నాటికి మరో రెండు పాఠశాలలు ప్రారంభించి ఆకాశం లో సగభాగమైన,జనాభాలో మెజారిటీ కి చెందిన బహుజన ఆడబిడ్డలకై ప్రారంభించిన సంస్కర్త గా జ్యోతిరావు పూలే చరిత్రలోనే శాశ్వతంగా నిలిచి పోయారు.అంతే కాదండోయ్ 1855 రాత్రి బడి ప్రారంభించి సమాజంలో సగానికి మించి ఉన్న జనాభాను విద్యా వంతులుగా తీర్చి దిద్దేందుకు శ్రీకారం చుడితే తట్టుకోలేక ఆధిపత్య వర్గాలు 1849 లో పూలేను కుటుంబం నుండి బహిష్కరించి మానసిక ఆనందాన్ని పొందారు అయినా బడుగులు బానిసలుగా ఉండడానికి వీలు లేదంటూ అందుకు ఆయా వర్గాలలో చైతన్యం పెంపిందించేందుకు గాను ధీనబంధు పత్రికను స్థాపించి భవిష్యత్ భారత దేశంలో బడుగుల పాత్రపై అనేక రకాల వ్యాసాలు అందించారు.దానికి తోడు భావజాల ప్రచారానికై తాను రాసిన గులాంగిరి సేద్యం గాని చర్మకోలా గ్రంధాలు వర్త మానానికి స్ఫూర్తి దాయకంగా నిలిచాయి.దానికి తోడు అణిచివేత ను వ్యతిరేకిస్తూ 1870 లో సార్వ జనిక్ సభ,1873 సెప్టెంబర్ 24 న ప్రారంభించిన సత్య శోధక్ సమాజం నాడు ఉన్న పరిస్థితుల నుండి బహుజనులను పునారలోచన వైపు నడిపించాయి.అంతకు ముందు అణగారిన కులాల నుండి వచ్చిన జ్యోతిరావు పూలే 1834-38 ప్రాంతంలో మరాఠీ పాఠశాలలో విద్యను ప్రారంభిస్తే ఆధిపత్య బ్రహ్మానియా వర్గాలు అడ్డుకుని బలవంతంగా విద్యను మానిపించేందుకు బెదిరింపులకు దిగినారు. పిల్లిని బందీస్తే పులి అవుతుందో లేదో తెలియదు కానీ స్వాతంత్ర్యానికి పూర్వమే బహుజనులు అందులో బహుజన అడబిడ్డలకు విద్యానందించాలన్న తాపత్రయంతో వీరోచితంగా పోరాడి సాధించిన పూలేకు చరిత్రలో సంఘ సంస్కర్త గా రావాల్సిన ప్రాచుర్యం అంద కుండా ఆంధ్రప్రాంతం లో పుట్టి పెరిగిన వారిని సంఘ సంస్కర్త గా ముద్రించి పూలెను మళ్ళీ వెనుక బాటు తనానికే గురి చేశారు అన్నది ఇట్టే తేట తెల్లం అవుతుంది. కేవలము సమాన హక్కులు బహుజన ఆడ పిల్లలకు విద్యను అందించడం వరకే ఆయన పరిమితము కాలేదు….ఆంద్ర ప్రాంతంలో ఎవరినైతే వితంతు వివాహాలకు ఆరాద్యుడు అంటూ చేతిలో ఉన్న ప్రచురణ సంస్థలతో కాకమ్మ కబుర్లు ప్రచురించి ఉదర కొడుతున్నారో…అందుకు భిన్నంగా 1848 ప్రాంతంలోనే వితంతు వుల కోసం ప్రత్యేక గృహాన్ని కట్టించి ఇవ్వడమే కాకుండా వితంతువుల పిల్లలకు విద్యను అందించి వారిని సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం చేసిన సంఘ సంస్కర్త కుడా మహాత్మా జ్యోతిరావు పూలే ఒక్కరే అని సవినయంగా మనవి చేస్తున్న.నాడు ఆధిపత్య వర్గాల అణిచివేతకు బహుజనులు బందీగా మారితే …నేడు ఆధిపత్య పాలకుల చేతిలో అటువంటి చరిత్రను సృష్టించిన చరిత్ర కారులు కనుమరుగు అవుతున్నారనే బహుజనుల బాధ.చివరిగా జరిగిన భారత రత్న ఎంపికలోను ఇదే విషయం తేట తెల్లం అయ్యింది. ఆధిపత్య పాలకులు అనుకున్న వారికే భారత రత్న ను ప్రకటించడం వెనుక వారి ఆధిపత్య ధోరణిని కనిపెట్ట లేనంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరు… అక్కడ మజీద్ ఉందొ మందిరం ఉందొ ఎవరికైతే తెలియదు కానీ మజిద్-మందిర్ వివాదంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కాషాయ దళం పునాదుల నిర్మాణానికి పూనూకున్నందుకే కాబోలు అద్వానీకి ఇచ్చిన భారతరత్న …అణగారిన వర్గాల అణిచివేత ను ప్రతిఘటిస్తూ బ్రిటిష్ ఎలుబడిలో తిరుగు బావుటా ఎగుర వేసిన పూలే లాంటి మహానుభావులందరికి ఎందుకు ఇవ్వలేదు అన్నదే ఇక్కడ ప్రశ్న….భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం లో ఆర్టికల్ 3-A లో ఉన్న రాష్ట్రాల పునర్విభజన ప్రకారం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిందన్న సద్భావంతో 125 అడుగుల ఎత్తులో ఆ మహానియుడి విగ్రహాన్ని ఆవిష్కరించి గౌరవించుకున్న తెలంగాణా నేల అదే అంబెడ్కర్ మహాశయుడికి స్ఫూర్తి నిచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కుడా రాష్ట్ర అసెంబ్లీ లో ఏర్పాటు చేసుకుంటే ఆ మహానియుడికి అంతకు మించి అందించే నివాళులు ఏముంటాయి. నాటి నుండి నేటి వరకు ఆంధ్ర పెత్తనమే కొనసాగుతుందని సాధించుకున్న తెలంగాణలో కూడా నేడు ఆంధ్ర షాడోయిజమే కనపడుతోందని ఎవరు ముఖ్యమంత్రి ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రుల పెత్తనం మాత్రం నాటి నుండి నేటి వరకు తగ్గడం లేదు. వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు, వ్యాపారాలు ఆంధ్ర పెత్తందారులే చేస్తున్నారు. మరి తెలంగాణ వచ్చి తెలంగాణ ప్రజలకు ఒరిగిందేందో అర్థం కావడం లేదు అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు