Tuesday, October 15, 2024
spot_img

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం

తప్పక చదవండి
  • అమలు కోసం ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు
  • మంత్రులతో సిఎం రేవంత్‌ సచివాలయంలో సవిూక్ష సమావేశం
  • డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమీటీ ఏర్పాటు
  • వందరోజుల్లో హావిూల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు
  • ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని సూచన

హైదరాబాద్‌ :- ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు అయన సోమవారం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు సమీక్ష సమావేశంలోపాల్గొన్నారు. . సబ్‌ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు.అయితే ప్రజాపాలనపై సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సవిూక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రులతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు.ఇచ్చిన మాటకు కట్టుబడి లబ్ది దారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా పథకాల అమలు జరగాలని ఆయన మంత్రులను కోరారు.

నిజమైన లబ్దిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తాం..

- Advertisement -

గత అసెంబ్లీ ఎన్నికల్లో 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ హావిూ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ క్రమంలో వాటి అమలు కోసం సబ్‌ కమిటీ పనిచేస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నిజమైన లబ్దిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామన్నారు. ఎన్నికల హావిూకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. డిసెంబర్‌ 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలనలో రాష్ట్రవ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయని.. . ఇందులో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్‌ కార్డులు, తదితర అంశాలపై 19,92,747 దరఖాస్తులు వచ్చాయని మంత్రులు పేర్కొన్నారు.. 16,392 పంచాయతీలు, 710 మున్సిపల్‌ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలను నిర్వహించామని చెప్పుకొచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి హావిూల అమలులో ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు టైం పాస్‌ చెయ్యబోమని స్పష్టం చేశారు..

ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు..

అభయహస్తం హావిూలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి గ్రామం నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు చెప్పారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్‌ రెడ్డి సవిూక్ష ముగిసిన అనంతరం పొంగులేటి విూడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను 40 రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం 30వేల మంది ఆపరేటర్లతో డేటా ఎంట్రీ వేగంగా జరుగుతోందన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కమిటీ ఛైర్మన్‌గా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవహరించనున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యులుగా తాను, మంత్రి శ్రీధర్‌బాబు ఉంటామని వివరించారు. నిజమైన లబ్దిదారులకు అభయహస్తం పథకాలు అందజేస్తామని స్పష్టం చేశారు.

100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం ..

100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హావిూ ఇచ్చామని ఇచ్చినమాట ప్రకారంగానే అమలు చేసి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. జనవరి 25 వరకు డేటా ఎంట్రీ ప్రక్రియ జరుగుతుందన్నారు. నిజమైన అర్హులను గుర్తించి వారికీ లబ్ది చేకూర్చడమే తమ లక్ష్యమన్నారు. ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని.. కారుకూతలు కూస్తే సహించేది లేదన్నారు. ప్రతిపక్షాలవి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలను కాంగ్రెస్‌ సహించబోదన్నారు. ప్రజలకు ఆరు గ్యారంటీలను చేరువ చేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీడియాకు వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు