Monday, April 29, 2024

ఏపీలో తుది ఓటర్ల జాబితా సిద్దం

తప్పక చదవండి
  • డిసెంబర్‌ 9 వరకు వచ్చిన దరఖాస్తుల పరిష్కారం
  • మిగతావి ఈనెల 12లోగా పరిష్కరిస్తాం
  • ఇంటింటి సర్వేతో అర్ముల గుర్తింపు
  • దురుద్దేశ్యపూర్వక దరఖాస్తుదారులపై కేసులు
  • ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ విూనా

అమరావతి : ఈ ఏడాది ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా డిసెంబర్‌ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ విూనా తెలిపారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను జనవరి 12లోపు పరిష్కరిస్తామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గందరగోళం లేకుండా ఓటరు జాబితాను సవరించేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్‌ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించాం. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 5,64,819 పేర్లను అనర్హులుగా తేల్చాం. కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. కాకినాడ నగరంలో ఫాం 7 ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మంది, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశ పూర్వకంగా దాఖలు చేసిన ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టాం. అక్కడ ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్‌వోలపై చర్యలు తీసుకున్నాం. పర్చూరులో 10 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశాం. జీరో డోర్‌ నంబర్లు, ఒకే ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల్లో 97 శాతం మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితాను సవరించాం. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు మారిపోయిన ఘటనలు విశాఖ, ఎన్టీఆర్‌ జిల్లాల్లో నమోదయ్యాయని ముకేశ్‌కుమార్‌ విూనా వివరించారు. ఓటర్‌ జాబితాలో అక్రమాలపై టీడీపీ ఇచ్చిన ప్రజెంటేషన్‌ లో ఉన్న వివరాల ఆధారంగా అక్రమాలపై చర్యలు తీసుకున్నామని ఏపీ సీఈవో టీడీపీకి లేఖ రాశారు. గత నెల 23వ తేదీన టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్‌పై తీసుకున్న చర్యలు లేఖలో వివరించారు. 2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబరు 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించాం. డిసెంబరు 9 తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12 తేదీలోగా పరిష్కరిస్తాం. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్‌ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించాం. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించాం. అందులో 5 లక్షల 64 వేల 819 పేర్లను అనర్హులుగా తేలిందని ఏపీ సీఈవో ముఖేష్‌ కుమార్‌ విూనా తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లూ ఆయా అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఓటర్లుగా ఆన్‌ లైన్‌ దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులూ వచ్చాయి. కాకినాడ నగరంలో ఫాం 7ల ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మంది ఎఫ్‌ఐఆర్‌ ను నమోదు చేశాం. ఈ వ్యవహారంలో పోలీసు స్టేషన్లలో అభియోగపత్రాలు కూడా దాఖలు అయ్యాయని లేఖలో పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశపూర్వకంగా ఫాం 7లు దాఖలు చేసిన 6గురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. పర్చూరులో 10 ఎఫ్‌ఆర్‌ లు నమోదు చేశాం. కావలి, గురజాల, బనగానప్లలె, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో ఫాం7 దరఖాస్తుల్లో వచ్చిన అభ్యంతరాలను తనిఖీ చేయించాం.చంద్రగిరి నియోజకవర్గంలో ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్‌ఓలపై చర్యలు తీసుకున్నాం.. జీరో డోర్‌ నెంబర్లు, ఒకే ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల్లో 97 శాతం మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితా సవరించాం అన్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు మారిపోయిన ఘటనలూ విశాఖ, ఎన్టీఆర్‌ జిల్లాల్లో నమోదు అయ్యాయి. విశాఖలో 26 వేల మంది ఓటర్లు, ఎన్టీఆర్‌ జిల్లాలో 2,27,906 ఓటర్లకు సంబంధించి ఓటర్లు ఇతర పోలింగ్‌ కేంద్రాలకు మారింది. గందరగోళం లేకుండా ఈ జాబితాలను సవరించేందుకు కార్యాచరణ చేపట్టామని అన్నారు. ఓకే చోట 3 ఏళ్లు సర్వీసు పూర్తయిన ప్రభుత్వ ఉద్యోగులు, క్రిమినల్‌ కేసులు నమోదైన వారు, ఈసీ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించిన అధికారుల ఎన్నికల విధుల్లో ఉండరు. ఓటర్ల జాబితా రూపకల్పనలో తప్పిదాలకు సంబంధించి ఇప్పటికే చర్యులు తీసుకున్నాం. ఉరవకొండ, ప్రొద్దుటూరు నియోజకవర్గాల ఈఆర్వోలు, పర్చూరు ఏఈఆర్వో, 1 సీఐ, 3 ఎస్‌ఐలు సస్పెండ్‌ అయ్యారని.. 50 మంది వరకూ బీఎల్వోలపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలిచ్చామని తెలిపారు. మరో వైపు ఏపీలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సవిూక్షించేందుకు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ఏపీకి రానున్నారు. మంగళవారం .. ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ కలిసి అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు. అంత కంటే ముందే.. సీఈవో విూనా లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు