Monday, April 29, 2024

పొన్నం అను నేను హామీ ఇస్తున్నాను

తప్పక చదవండి
  • కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లను ఖచ్చితంగా అమలు చేస్తా
  • స్థానిక కాంగ్రెస్ పార్టీ స్థానిక మానిఫెస్టో విడుదల
  • 24 గంటలు నా ఇంటి తలుపులు తెరచి ఉంచుతాం
  • ప్రియాంక ప్రకటించిన మెడికల్ కాలేజీ హామీతో హుస్నాబాద్ అభివృద్ధికి నాంది
  • హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.

తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ గడువు దగ్గరపడుతుండటంతో.. అన్ని పార్టీల అభ్యర్థులు సభలు, సమావేశాలు, రోడ్‌ షోలతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీపడుతూ ప్రచారం సాగిస్తున్నారు. అదేబాటలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్థానిక కాంగ్రెస్ పార్టీ స్థానిక మానిఫెస్టో విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని మండలంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం పొట్లపల్లిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. పొట్లపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ అఫిడవిట్‌లపై సంతకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ … కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తానని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తో విసిగి పోయిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద వానికి మేలు జరుగుతుందని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు విశ్వాసం కలిగింది అని అన్నారు. 2004 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, రైతు ఋణ మాఫీ, ఫీ రీఎంబర్స్ మెంట్ లాంటి హామీలను, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నెరవేర్చిందని , 2014 లో మాయ మాటలు చెప్పి, ప్రజల్ని మభ్య పేట్టి అధికారం లోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవెర్చకుండా ప్రజల్ని మోసం చేశారని అన్నారు. 2009 లో ఎంపి గా గెలిపించి, ఈ ప్రాంతం నుండి ఇక్కడి ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చారని, తెలంగాణ ఉద్యమ పోరాటం లో భాగమై, పార్లమెంటు లో కొట్లాడాను అని , జాతీయ స్థాయి లో తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలియ జెప్ప డానికి తన వంతు కృషి చేశానని అన్నారు. తాను ఎంపిగా ఉన్నపుడు చిత్త శుద్ది తో పని చేసి, కేంద్రీయ విశ్వ విద్యాలయం, పాస్ పోర్ట్ ఆఫీసు సేవలు పార్లమెంటు పరిధి లోని ప్రజలకు అందుబాటు లోకి తీసుకు వచ్చి నట్లు పొన్నం పేర్కొన్నారు. ఇక్కడి ప్రాంత సమస్యలపై పూర్తిగా తనకు అవగాహన ఉందని, ప్రచార కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి తండాలో పర్యటించినట్లు పొన్నం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే నేరవేర్చెందుకు హుస్నాబాద్ నియోజక అభివృద్దే ధ్యేయంగా స్థానిక మానిఫెస్టో ను విడుదల చేసినట్లు పొన్నం తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్ వరదనీటి కాలువ ద్వారా, చిగురుమామిడి సైదాపూర్ మండలాల రైతాంగానికి,దేవాదుల ప్రాజెక్టు నుండి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల రైతాంగానికి, ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తామని అన్నారు. హుస్నాబాద్ లో సపోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయదారిత పరిశ్రమలు నెలకొల్పుతామని హామీనిచ్చారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి తగు చర్యలు చేపడతామన్నారు. పర్యాటకరంగ అభివృద్ధిలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ చెరువు, సర్దార్ సర్వాయి పాపన్న గుట్టను, మహాసముద్రం గండిని, రాయికల్ జలపాతాన్ని,శనిగరం ప్రాజెక్టు, పర్యాటకులను ఆకర్షించే విధంగా సుందరీకరించి నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. హుస్నాబాద్ బస్సు డిపోను పూర్తిగా ఆధునికరించి ప్రతి పల్లెకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై అధికారంలోకి రాగానే నెరవేర్చబోయే హామీలపై మేనిఫెస్టో రూపొందించినట్లు పొన్నం తెలిపారు. హుస్నాబాద్ సభలో ప్రియాంక గాంధీ ఇచ్చిన మెడికల్ కాలేజీ హామీతోనే హుస్నాబాద్ నియోజక వర్గ అభివృద్ధికి నాంది పడిందని పొన్నం అన్నారు. మెడికల్ కాలేజీ తో ఈ ప్రాంత వైద్య సేవలు మెరుగుపడతాయని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అవినీతికి తావు లేకుండా సేవలందిస్తానని చెప్పారు. 24 గంటలు తన ఇంటి తలుపులు తెరిచి ఉంచుతానని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో మార్పు జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలోని 34 బూతుల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి లతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ఏఐ సిసి సెక్రటరీ క్రిస్టోఫర్ తిలక్, అసెంబ్లీ పరిశీలకులు గోపీనాథ్ పలనియప్పన్, పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి, డిసిసి ప్రధాన కార్యదర్శి చిత్తారి రవి, వైస్ ఎంపిపి దేవసానీ నిర్మల – నరసింహారెడ్డి,సింగిల్ విండో చైర్మన్ బోలిషెట్టి శివయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కర్ర రవీందర్ రెడ్డి, కల్లేపల్లి కావ్య – వెంకట్ స్వామి, మాజీ సర్పంచ్ గుర్ట్టూరి చంద్రమౌళి, సింగిల్ విండో డైరెక్టర్ లు, వార్డు మెంబర్ లక్ష్మణాచారి, గాలి పెళ్లి శ్రీనివాస్, రామగిరి కుమార్, నాగరాజు, చంద్రయ్య గౌడ్, గాజుల చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు