Thursday, May 16, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

పండుగలెనుక పండుగలెన్నో ఏటేటా..
దసరా, సంక్రాంతి, ఉగాది
పండుగలకు మించిన పండుగ
ఐదేళ్లకోపారి మత్తులో
ముంచేసే మహోత్సవం..
నోట్ల కట్టలతో ఐదేళ్లు పండుగ
చేసుకోమనే వేడుక..
అరచేతిలో వేపాకుతో ప్రమాణం
చేయించే జాతర..
నోట్లు, మందు మత్తులో
ఏలుకు బొట్టు పెట్టుకునే పండుగ..
ఐదేళ్లకోపారి బతుకులు
మార్చుకునే పండుగ..
సోయి తప్పితే ఐదేళ్లు బతుకులు
బజారుకీడ్చే పండుగ..
అదే ఐదేళ్లకోపారి వచ్చే ..
అసలైన ఓట్ల పండుగ..
బంగారు భవిష్యత్తుకు
బాటలు వేసుకునే వేడుక..
అవినీతిపై అస్త్రంగా
ఓటును వేసుకునే కానుక..
ఐదేండ్ల భవిష్యత్తును
నిర్ణయించే అరుదైన వేదిక..
బాధలు తీర్చే నేతలను
ఎన్నుకునే పండుగ
అదే ఐదేళ్లకోసారి వచ్చే
అసలైన ఎన్నికల పండుగ..

            -  రామస్వామి ప్రవీణ్‌ గౌడ్‌
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు