Wednesday, May 8, 2024

హస్తినకు సీఎం రేవంత్..

తప్పక చదవండి
  • మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ!

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖలు, మరో ఆరుగురు మంత్రుల వివరాలపై పూర్తి స్పష్టత తీసుకుని తిరిగి రాత్రి మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్. డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి, మొత్తం 11 మంది.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లకు శాఖలు కేటాయించలేదు. అధిష్టానం నుంచి క్లారిటీ లేకపోవడంతో శాఖలు ఆలస్యం అయ్యింది. దీంతో ఇవాళ రేవంత్ ఢిల్లీ వెళ్లి మంత్రుల శాఖల కేటాయింపుపై క్లారిటీ తీసుకోనున్నారు. అలాగే మరో కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఆరు బెర్తులకు ముందుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి అంజన్ కుమార్, ఫిరోజ్ ఖాన్, మధుయాష్కి, షబ్బీర్ అలీ, భోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు