Monday, April 29, 2024

సమావేశానికి హాజరుకాని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు

తప్పక చదవండి
  • విద్యుత్ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
  • విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
  • సీఎం రేవంత్‌ నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు ! : సీఎండీ ప్రభాకర్ రావు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై గురువారం సచివాలయంలో సమీక్ష జరిపారు. అయితే ఈ సమీక్షా సమావేశానికి ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమీక్షా సమావేశంలోనే విద్యుత్ శాఖ పరిస్థితిపై అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో విద్యుత్ శాఖ పరిస్థితి, అప్పులు, తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. మరోవైపు గురువారం నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగానే తెలంగాణ విద్యుత్ శాఖకు 85 వేలకోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దన్న సీఎం.. విద్యుత్ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో శుక్రవారం సమావేశానికి రావాలని ఆదేశించారు. అయితే శుక్రవారం సచివాలయం వేదికగా సమీక్షా సమావేశం జరగ్గా.. ఈ భేటీకి ట్రాన్స్‌కో సీఎండీ గైర్హాజరయ్యారు. సీఎం ఆదేశించినప్పటికీ ట్రాన్స్‌కో సీఎండీ గైర్హాజరు కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

కాగా, సీఎం రేవంత్‌ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఈ రోజు సెక్రటేరియట్ లో విద్యుత్ శాఖ పై రివ్యూకు సంబంధించి నాకు సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్లకుండా ఎందుకు ఉంటానని ప్రశ్నించారు సీఎండీ ప్రభాకర్ రావు. విద్యుత్ శాఖ నుంచి కానీ, సీఎంవో నుంచి కానీ నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు.. నన్ను పిలిస్తే కచ్చితంగా సమావేశానికి హాజరవుతానని వెల్లడించారు సీఎండీ ప్రభాకర్ రావు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు