Saturday, May 18, 2024

పబ్లిక్ హెల్త్ లో ఓఎస్డీల‌ ‘లీలలు’

తప్పక చదవండి
  • ప్రైవేటు ఆస్పత్రుల్లో వసూళ్లు, కరోనా టైంలో వ్యాక్సిన్ల అమ్మకాలు.?
  • 2019 నవంబర్ లో వర్క్ ఆర్డర్ పై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కు ఓఎస్డీగా ర‌వితేజ నియామకం
  • అల్రెడీ ఓఎస్డీ ఉన్నప్పటికీ మరోవ్యక్తి అలాట్ చేయడంపై చర్చ
  • ఐదేళ్లుగా అక్రమంగా కొనసాగుతున్న రవితేజ
  • డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్
  • ఫిబ్రవరిలో డిప్యూటేషన్లు రద్దుచేసిన కొత్త ప్రభుత్వం
  • అయినా అదే కుర్చీ పట్టుకోని వేలాడుతున్న ఓఎస్డీ ర‌వితేజ‌
  • రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఇతగాడికి ఫుల్ సపోర్ట్
  • నాడు గడల శ్రీనివాస్, నేడు రవీందర్ నాయక్ అండదండలు
  • అక్రమ పద్దతిలో కొనసాగుతున్న ఓఎస్డీ రవితేజపై చర్యలకు డిమాండ్

తెలంగాణ వైద్యారోగ్యశాఖలో అక్రమలీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్యారోగ్యశాఖలో నెలకొన్న వర్క్ ఆర్డర్లు, డిప్యూటేషన్లపై అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత డిసెంబర్ లో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటేషన్ల ఆర్డ‌ర్ల‌ను రద్దు చేస్తూ మెమో నెం. 1500/ఎఫ్1/2024, తేదీ:07-02-2024నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ గవర్నమెంట్ ఆదేశాలను వైద్యశాఖలోని పెద్దలు తమకేమి పట్టనట్లు వ్యవహారిస్తున్నారు. సదరు ఉత్తర్వులను డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ మ‌రియు ఫ్యామిలీ వెల్ఫేర్ సంచాల‌కులు డాక్టర్ రవీంద్రనాయక్ తుంగలో తొక్కారు. అక్రమంగా ఐదు ఏళ్లుగా ఓఎస్డీగా కొనసాగుతున్న రవితేజపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సంచాల‌కులు రవీందర్ నాయక్ వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రవితేజపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ‘ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు’ అన్నట్టు హెల్త్ డిపార్ట్ మెంట్ లో కొలువుజేసే ఉద్యోగులు పనితీరు ఒక్కోరకంగా ఉంది. నిన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో సూపరిండెంట్ సల్లావుద్ధీన్ రాసలీలల గురించి బట్టబయలుకాగా నేడు దొంగదారిలో ఓఎస్డీగా కొనసాగుతున్న రవితేజ అక్రమదందాలు వెలుగుచూశాయి..

అప్పటి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ అండదండలతో ఎన్నో దందాలు చేసి కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శిక్షణ కేంద్రంలో లెక్చరర్ (అసిస్టెంట్ సివిల్ సర్జన్) గా ఉన్న డి.రవితేజ అప్పటి హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు దగ్గర ఓఎస్డీగా 2019 నవంబర్ లో అక్రమ మార్గంలో డిప్యూటేష‌న్‌పై నియామకం అయ్యాడు. అల్రెడీ హెల్త్ డైరెక్టర్ కు ఓఎస్డీ శంకర్ ఉన్నప్పటికీ మరొకరినీ ఓఎస్డీగా తీసుకోవడంపై చర్చనీయాంశం అయింది.

- Advertisement -

నాటి హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు నుంచి నేటి వైద్యారోగ్య సంచాలకులు రవీందర్ నాయక్ దాకా ఇతగాడి వసూళ్లు ‘మూడు పువ్వులు ఆరు కాయలుగా’ వర్ధిల్లుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత ప్రభుత్వం డిప్యూటేషన్లు రద్దు చేయడంతో నిబంధనలు భేఖాతర్ చేస్తూ కోరుకున్న చోటుకి వర్క్ ఆర్డర్లు, డిప్యూటేషన్లు చేయడం ద్వారా ముడుపులు తీసుకొని పంప‌కాలు చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతుంది. పై అధికారుల అండదండలతో మాముళ్లు వసూలు చేయడం కోసమే రవితేజను ఓఎస్డీగా కొనసాగిస్తున్నారని హెల్త్ డైరెక్టర్ సహా పలువురిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్ప‌టి ఓస్డీ శంక‌ర్ పై అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో అత‌న్ని అధికారులు బ‌దిలీ చేసి, అత‌ని స్థానంలో కామేశ్వ‌ర్ ని నియ‌మించింది. అయిన‌ప్ప‌టికి ఓస్డీగా విధులు నిర్విర్తిస్తున్న ర‌వితేజ‌పై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నప్ప‌టి ఎలాంటి చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌క‌పోవ‌డం, అదే స‌మ‌యంలో ఒక డైరెక్ట‌ర్‌కు ఇద్ద‌రు ఓస్డీలు ఉండ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. రేవంత్ సర్కార్ డిప్యూటేషన్లు అన్నింటినీ రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కూడా లెక్క చేయక పోవడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కొందరు డీఎంహెచ్ఓలను యధావిధిగా కొనసాగిస్తూ, డిప్యూటేషన్లు క్యాన్సల్ కావడంతో తిరిగి వారి మాతృస్థానంలోకి వచ్చిన వారికీ అక్కడి డీఎంహెచ్ఓలు సముచిత స్థానం కల్పించకపోవడం వెనుక హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ ప్రమేయం ఉందని బాహాటంగా చర్చించుకుంటున్నారు.

ఏళ్లుగా అక్రమంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న డి.రవితేజ ద్వారానే హెల్త్ డైరెక్టర్ కు వచ్చే లంచాల్లో వాటాలు ముడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల వద్ద వసూళ్లు, కరోనా టైంలో కోవిడ్ వ్యాక్సిన్లు, ఇతరత్రా మెడిసిన్స్ అధిక ధరలకు విక్రయించడం, ఉద్యోగుల ట్రాన్స్ ఫర్స్, పదోన్నతులు వంటి అనేక మార్గాల్లో లంచాలు తీసుకుంటూ కోట్లు వెనకేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల లోపాలను ఆసరాగా చేసుకొని డబ్బులు దండుకోవడం, హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో ఏ పని కావాలన్న తనను కలిస్తే అయిపోయేలా మారిపోయాడు. ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తూ ఏకచత్రాధిపత్యంగా డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్‌ హెల్త్ అంతా తాను చెప్పినట్టే నడుచుకుంటోంది. ఓఎస్డీగా చలామణి అవుతూ అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు, తన కుటుంబసభ్యులు, బంధువుల పేరు మీద కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. వైద్యారోగ్యశాఖలో రవితేజ అక్రమలీలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని ఆధారాల‌తో ర‌వితేజ అక్ర‌మాల చిట్టా మ‌రో క‌థ‌నం ద్వారా స‌మాజం దృష్టికి తీసుకురానుంది ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అస్త్రం.. అవినీతిపై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు