Saturday, May 18, 2024

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

తప్పక చదవండి
  • స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్!
  • ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…!
  • ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన!
  • తలక్రిందులైతే తిప్పలే!
  • సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే!
  • తెలంగాణాలో జాతీయ పార్టీల హవా!
  • బీఆర్ఎస్ జీరో.. ఒక్క సీటు రాదంటూ రిపోర్ట్!

రవిప్రకాష్..!! తెలుగునాట ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ట్రెండ్ సెట్టర్…! ఇన్ ఫుట్ నుండి అవుట్ లుక్ వరకు నేషనల్ మీడియా కు ధీటుగా స్టైలిష్ గా తెలుగు మీడియా ను ఆవిష్కరించిన క్రియేటర్! న్యూస్ ప్రెజెంటేషన్ లో కూడా ట్రెండ్ కు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఒకటిన్నర దశాబ్దాలపాటు టీవీ 9 ను సాటిలేని న్యూస్ ఛానెల్ గా వెలుగువెలిగించారు. కొత్తగా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రవేశించేవారికి రవిప్రకాష్ ఒక ఐకాన్ గా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రవిప్రకాష్ కు కష్టాలు మొదలయ్యాయి. రవి ని చూసి అసూయపడ్డ వాళ్లంతా ఒక్కటయ్యారు. రాజకీయంగా ఇబ్బంది పడ్డ నేతలు కూడా వారికి తోడయ్యారు. మొత్తంగా రవిప్రకాష్ అవమానకర రీతిలో 2019 లో టీవీ 9 నుండి బయటకిరావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయనను కష్టాలు వెంటాడుతూ వచ్చాయి. సొంతంగా మీడియా ను స్థాపించడానికి చేసిన ప్రయత్నాలు ప్రత్యర్థుల అడ్డంకుల వల్ల విఫలమయ్యాయి! దింతో కొన్నేళ్లపాటు అయన అజ్ఞాతంలో ఉండిపోవాల్సి వచ్చింది! ఎట్టకేలకు ఆర్ టీవీ డిజిటల్ ఛానల్ ను స్థాపించి ప్రజలముందుకు తెచ్చారు! ఆర్ టీవీ వచ్చి చాల రోజులవుతున్నా.. ఆన్ స్క్రీన్ లో రవిప్రకాష్ కనిపించకపోవడం అందరిని నిరాశపరిచింది. అయితే రవిప్రకాష్ మాత్రం పక్కా ప్లాన్ తోనే సంచలనాత్మకంగా ఆన్ స్క్రీన్ ముందు కు వచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది! మే డే రోజు సంచలనాత్మక సర్వే అంచనాలతో రవిప్రకాష్ ప్రజలముందుకు వచ్చారు. రెండు రోజులపాటు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే ఫలితాలను తలదైనా శైలిలో ఆవిష్కరించారు! ఇప్పుడు రవిప్రకాష్ సర్వే రిపోర్ట్ సోషల్ మీడియా లో ట్రేండింగ్ గా మారింది! రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది!

స్వీయ అగ్నిపరీక్షతో రంగప్రవేశం!
రవిప్రకాష్ స్వతహాగా ఏది చేసినా సంచలనంగా ఉండాలని చూస్తారు! ఇప్పుడూ అదే చేశారు. తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికలు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల సర్వే రిపోర్టులతో రంగంలోకి దిగారు. ఇది తన ఆర్ టీవీ లోతైన సర్వే అంచనా.. అంటూ సూటిగా ఆర్ టీవీ వేదిక నుండి ప్రకటించేశారు! ఒకవిధంగా అత్యంత దైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రవిప్రకాష్ విసిరిన సవాల్ గా దీన్ని భావించవచ్చు! ఎందుకంటే ఆర్ఫీ ఇప్పుడు ఒంటరి! ఆయనకి టీవీ 9 లో ఉన్నప్పటి అండ దండలు లేవు. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి , అజ్ఞాతవాసం నుండి బయటకు వచ్చి…పోగొట్టుకున్న చోటే నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న అత్యంత కీలక స్థితి లో ఉన్నాడు. ఇపుడు ఏది జరిగినా అన్నిటికీ ఆయనే బాధ్యత వహించాల్సివస్తుంది. ప్రతికూలత వస్తే ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వస్తుంది! పైగా ప్రత్యర్థులు అటు మీడియా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఎక్కువగానే ఉన్నారు. ఇలాంటి అత్యంత కీలక పరిస్థితిలో.. ఇది ఆర్ టీవీ స్టడీ…ఇది నా అంచనా అంటూ సూటిగా సర్వే అంచనాలు ప్రకటించడం సాహసోపేతమైన చర్య గానే భావించాల్సి ఉంటుంది. సొంత మీడియా వేదికపై రవిప్రకాష్ ప్రకటించిన సర్వే అంచనాలు తప్పితే అయన భవితవ్యం తలకిందులవ్వొచ్చు! ప్రత్యర్థులు మరోసారి అస్త్రాలు సందించవచ్చు! పడిలేచిన కెరటంలా పైకి లేచిన ఆర్ఫీ… మరోసారి దమ్ముచూపించి ప్రత్యర్థుల గుండెల్లో దడపుట్టించాలని చూస్తున్నాడు! ఒక విధంగా స్వీయ అగ్నిపరీక్షతోనే ఆర్ఫీ బరిలోకి దిగారని భావించాల్సి ఉంటుంది! చావో రేవో అన్నట్లుగా రవిప్రకాష్ ప్రకటించిన సర్వే అంచనాలు నిజమౌతాయో లేదో తెలియాలంటే మరో నెల రోజుల పాటు వేచిచూడక తప్పదు! ఇక అయన రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రకటించిన సర్వే అంచనాల ప్రకారం తెలంగాణాలో బీజేపీ, కాంగ్రెస్ లు సమ ఉజ్జిగా నిలుస్తాయని, పదేళ్ళపాటు అధికారంలో ఉండి..మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పరాభవాన్ని చవిచూసిన బీఆర్ఎస్ కు మరింత పరాభవం తప్పదని, ఒక్క సీటు కూడా ఆ పార్టీకి దక్కే అవకాశం లేదని తెలుస్తోంది! ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో ఉందని. టీడీపీ నేతృత్వంలోని జనసేన బీజేపీ కూటమి అత్యధిక సీట్లు సాధించే అవకాశమున్నట్లు పాక్షికంగా ప్రకటించిన సర్వే రిపోర్ట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి!

- Advertisement -

జాతీయ పార్టీలదే హవా!
ఆర్ టీవీ సర్వే అంచనాల ప్రకారం తెలంగాణలో రెండు ప్రధాన జాతీయ పార్టీలు సమాన స్థాయిలో సత్తా నిరూపించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్, బీజేపీ లు చెరో ఎనమిది స్థానాలు గెలుచుకుంటాయని, ఎంఐఎం యధావిధిగా పాతబస్తీ స్థానాన్నిమరోసారి నిలబెట్టుకుంటుందని తెలుస్తోంది. అయితే ఎంఐఎం పార్టీ ఈ సరి బీజేపీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటోందని. బీజేపీ ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉన్నట్లుగా సర్వే అంచనాలను ఉన్నాయి. సికింద్రాబాద్ సహా, జహీరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్ గిరి, మెదక్, కరీంనగర్ స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని సర్వే స్పష్టం చేసింది. సంఘ్ పరివార్ సంస్థలు ఈసారి పట్టుదలతో తెలంగాణాలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేస్తున్నాయని. జహీరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ స్థానాల్లో సంఘ్ శ్రేణులు అభ్యర్థుల తరపున కష్టపడుతున్నాయని ఆర్ టీవీ సర్వే స్పష్టం చేసింది! బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో ఆదిలాబాద్ లో ఓడిపోవడం ఖాయమని అక్కడ కాంగ్రెస్ కు బలం పెరిగినట్లుగా తెలుస్తోంది. మిగిలిన మరో మూడు స్థానాల్లో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గెలుపు అంత సులువు కాదని, ఈ స్థానంలో ఘననీయంగా ఉన్న మైనారిటీలు కాంగ్రెస్ కు మద్దతు తెలిపే అవకాశం ఉందని, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి చీల్చే ఓట్లను బట్టి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయని సర్వే రిపోర్ట్ స్పష్టం చేసింది! ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికలలో ఎనమిది చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని సర్వే తేల్చింది. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ స్థానాలు ఇందులో ఉన్నాయి. బీఆర్ఎస్ ఓట్లు చీల్చడం తప్ప గెలిచే అవకాశం లేదని సర్వే తెల్చింది!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు