Friday, July 26, 2024

కౌన్‌ బనేగా చేవెళ్ల కా షహెన్‌ షా

తప్పక చదవండి
  • అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా
  • గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు
  • మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్‌ ధీమా
  • సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా
  • ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీలు మారుతున్నాడంటూ రంజిత్‌ రెడ్డి పై విమర్శలు
  • ఇద్దరు రెడ్లు ఒక బిసి.. పట్టం ఎవరికి కడతారో
  • చేవెళ్ల లోక్‌ సభలో భిన్న ప్రాంతాల విభిన్న రాజకీయం

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం భిన్న ప్రాంతాల విభిన్న రాజకీయాలకు కేంద్రం ఈ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి ఇందులో పరిగి, తాండూర్‌, వికారాబాద్‌, వెనుకబడిన ప్రాంతాలు ఇక్కడ ప్రజల జీవన విధానం కొంత విభిన్నంగా ఉంటుంది ముఖ్యంగా తాండూర్‌ పరిగి నియోజకవర్గాలను తీసుకుంటే ఇవి కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు నియోజకవర్గాలు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా రైతు కూలీలు అదేవిధంగా చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాలు కొంతమేర అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఇక్కడి ప్రజల జీవన విధానం ఆర్థిక స్థితిగతులు మెరిగేనని చెప్పవచ్చు ఇంకోపక్క చూస్తే రాజేంద్రనగర్‌, శేర్లింగంపల్లి నియోజకవర్గాలు పూర్తిగా ఫైనాన్స్‌ స్టేటస్‌ కలిగినవి. ఇది హైదరాబాద్‌ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడి రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. అంతేకాకుండా హైదరాబాద్‌ సరిహద్దు ప్రాంతం కావడంతో రాజేంద్రనగర్‌, శేర్లింగంపల్లి ప్రజలు విభిన్న మతాలకు చెందిన వారు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. హిందూ ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజలు కూడా ఎక్కువే ఇలాంటి చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో మూడు పార్టీలు కూడా బిజెపి, కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పోటాపోటీగా బలమైన అభ్యర్థులను నిలబెట్టారు. ఒకరేమో అధికార పార్టీ గెలిపిస్తే అభివృద్ధి చేస్తామంటూ మాతోనే సామాజిక న్యాయం జరుగుతుందని కులగణన ప్రస్తావన తీసుకొస్తూ అన్ని వర్గాలను కలుపుకుపోయే పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని అంటున్నారు. ఇంకొకరేమో హిందుత్వం మోడీ చరిష్మా దేశ అభివృద్ధి మా తోటి సాధ్యమంటూ మాట్లాడుతున్నారు. మరొకరేమో మాది ఉద్యమం పార్టీ తెలంగాణ సాధనలో తమ పార్టీ ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని తెలంగాణను సాధించామని అదేవిధంగా తెచ్చుకున్న తెలంగాణలో పది సంవత్సరాలు పాలన కొనసాగించి అభివృద్ధి చేశామంటూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి వాతావరణం లో కౌన్‌ బనేగా చేవెళ్లకా షహేన్షా అంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

సామాజిక న్యాయం బిజెపి తోనే సాధ్యం కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి
కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి స్వతహాగా మంచి వ్యక్తిత్వం గల నాయకుడు ముక్కుసూటి మనిషి న్యాయం వైపు నిలబడే వ్యక్తి తన సొంత జిల్లా ప్రజలకు ఏదో రకంగా సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన గొప్ప సంపన్నుడు ఆయనకు రాజకీయాల అవసరం లేదు ఉన్నత విద్యావంతుడు గొప్ప ఇంజనీర్‌ విదేశాల్లోనే ఎన్నో ప్రశంసలు అందుకున్న వ్యక్తి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఆయనను బిజెపి ప్రభుత్వం చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించింది దాంతో ఆయన ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలు పడుతున్నారు. పరోక్షంగా కూడా సీఎం రేవంత్‌ రెడ్డి వ్యక్తిగతంగా నాకు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి శత్రుత్వం లేదని ఆయన మంచి మనిషి అని ఆయన వ్యక్తిత్వం గురించి పోవడం ప్రజల్లో ఆయనపై కొంత పాజిటివ్‌ కూడా పెరిగింది అనడంలో ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా దేశంలోని 500 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అప్పుడే ఆయన ప్రస్తావించారు ఎలక్షన్‌ కమిషన్‌ కూడా ఆయన ఏది దాయకుండా ఉన్నది ఉన్నట్టు అఫిడబిట్‌ ని సమర్పించారు. ఇది చాలదా ఆయన గెలిస్తే ప్రజలకు సేవ చేస్తానని అనడంలో అభ్యంతరమే లేదని అక్కడ ఓటర్లు భావిస్తున్నారు. కాకుండా గతంలో ఆయన పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్నప్పుడు బయో టాయిలెట్స్‌ గురించి పార్లమెంట్లో వస్తావని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అది అమల ఏవిధంగా చేశాడు అప్పుడు ఆయన పార్లమెంట్‌ కమిటీ సభ్యుడుగా కూడా కొనసాగారు. పార్లమెంట్లో ఆయన మాట్లాడిన విధానం ప్రజల స్థితిగతులపై అంచనా తమపై నమ్మకంతో ఓట్లు వేసి పార్లమెంట్కు పంపిన ప్రజల రుణం తీసుకోవాలన్న ఆయన వ్యక్తిత్వాన్ని బిజెపి పార్టీ గుర్తించింది అందుకే ఆయనను పార్టీలోకి ఆహ్వానించుకొని టికెట్‌ ఇచ్చారు. అదేవిధంగా ఆయన కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవలు చేస్తారనే టాక్‌ కూడా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -

చేవెళ్ల ప్రజలను రంజింపజేయని రంజిత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ
ఒకరకంగా చెప్పాలంటే పార్లమెంట్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రంజిత్‌ రెడ్డి పై సొంత పార్టీ నేతలే అంటి ముట్టనట్టు ఉంటున్నారు. ఇదే కాకుండా పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన బిఆర్‌ఎస్‌ పార్టీలో ఎంపిక కొనసాగుతూ టిఆర్‌ఎస్‌ అధికారం కోల్పోగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరి టికెట్‌ పొందడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇవే కాకుండా ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు భూ బకాసురుడు అనే ముద్ర కూడా వేస్తున్నారు. మరి ఇలాంటి వ్యక్తికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఎలా ఇచ్చింది ఎందుకు ఇతని పార్టీలోకి ఆహ్వానించింది కార్యకర్తలకి అర్థం కాకుండా ఉంది ఈయనపై హైటెక్‌ సిటీ జూబ్లీహిల్స్‌ కోకాపేట్‌ లాంటి అత్యంత ఖరీదైన ప్రాంతాలలో భూములను కొల్లగొట్టాడని ఆక్రమణలు చేశాడని 14 ఎకరాల ఆంజనేయ స్వామి గుడి భూమిని కాజేశాడు అనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన ఒక పౌల్ట్రీ వ్యాపారి అయినా రంజిత్‌ రెడ్డి వ్యాపార పరంగా అప్పట్లో బి ఆర్‌ ఎస్‌ లో ఉన్న ఈటల రాజేందర్‌ తో ఉన్న సన్నితం మేరకు టిఆర్‌ఎస్‌ లో చేరాడని చేవెళ్ల ఎంపీ టిక్కెట్‌ కోసం అప్పట్లోనే కోట్ల రూపాయలు పార్టీకి ఇచ్చాడని ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈయన గెలుపు అవకాశాలు 50, 50 ఉన్నాయి. ప్రజలు ఏ రకంగా చూస్తారు ఒకపక్క అధికార పార్టీ అభ్యర్థిగానా లేక ప్రయోజనాల కోసం పార్టీలు మారే జంపు జిలాని గాన ఎలా చూస్తారో వేచి చూడాలి.

గులాబీని వికసింపగలడా బిఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌
గులాబీని కాసాని జ్ఞానేశ్వర్‌ వికసింప చేయగలడా అంటే ఆయనపై చాలామంది విశ్వాసం కనబరుస్తున్నారు. ఎందుకంటే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అధికారం కోల్పోయినప్పుడు పార్టీలు వీడే నాయకులను మనం చూస్తున్నాం కానీ కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అలాంటి పార్టీ నే ఎంచుకున్నారు. బీసీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే అది బీఆర్‌ఎస్‌ ద్వారానే సాధ్యమని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఒక దిక్కు పార్టీ అండదండలు మరో దిక్కు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన గెలుపుకు సహకరిస్తాయని అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు పలు పార్టీలో ఎన్నో పదవులను ఆయన చేపట్టి సమర్థవంతంగా పార్టీలకి పనిచేసిన ఘనత అయినది. ఆయనతోపాటు కాసాని వీరేష్‌ ముదిరాజ్‌ కూడా ఎంతోమంది నిరుపేదలకు అప్పన్న హస్తాన్ని అందిస్తూ సేవలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా యూత్‌ లో మంచి పట్టున్న నాయకుడు శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, నియోజకవర్గాల్లో యూత్‌ ఫాలోయింగ్‌ లో కాసాని వీరేష్‌ ది అందే వేసిన చెయ్యి చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం లో ఎక్కువ శాతం బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్నారని వారు తప్పకుండా ఆదరిస్తారని ఆయన బీమా వ్యక్తం చేశారు. ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గ నాయకుల తో పోరాటం చేయడం మామూలు విషయం కాదు అయినా కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా అధికారం కోల్పోయిన టిఆర్‌ఎస్‌ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల బరిలో దిగి ప్రచారంలో కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఎంతోమందికి తన సొంత భూములను కూడా దానం చేసిన వ్యక్తి కాసాని నిరుపేదలంటే ఆయనకు ప్రాణం వారికి ఏదో రకంగా సేవ చేయాలన్నదే ఆయన అభిమతం. గతంలో కూడా రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండలి చైర్మన్గా( ఎమ్మెల్సీ) గా సేవలందించారు. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా గతంలో పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ లో తనదైన దూకుడు ప్రదర్శించి గెలుస్తాడని నమ్మకంతోనే టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఆయనకు టికెట్‌ కేటాయించారు. మరి ప్రజల మనిషి అయిన కాసాని జ్ఞానేశ్వర్‌ ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపిస్తారని గట్టి నమ్మకం ఉందంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు కూడా ఒకింత ఆయన మీద నమ్మకం గాని ఉన్నట్టు కనపడుతోంది. చూడాలి మరి చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలు కానీ జ్ఞానేశ్వర్‌ ఏ విధంగా ఆశీర్వదిస్తారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు