Friday, September 20, 2024
spot_img

దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ’ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 6 నుంచి 25 వరకు మొదటి ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ ఉండనుంది. రూ.200 రుసుంతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. మే 15 నుంచి 27 వరకు ‘దోస్త్‌’ వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్‌ 3న మొదటి దశ సీట్ల కేటాయింపు.. జూన్‌ 4 నుంచి 10 లోపు సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం కల్పించారు. రూ.400 రుసుంతో జూన్‌ 4 నుంచి 13 వరకు సెకండ్‌ ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 4 నుంచి 14 వరకు సెకండ్‌ ఫేజ్‌ వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి. జూన్‌ 18న రెండో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూన్‌ 19 నుంచి 24 వరకు సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం కల్పించారు. జూన్‌ 19 నుంచి 25 వరకు ‘దోస్త్‌’ మూడో దశ రిజిస్ట్రేషన్‌ ఉండనుంది. రూ.400 రుసుంతో మూడో విడత రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. జూన్‌ 19 నుంచి 25 వరకు మూడో దశ వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి. జూన్‌ 29న మూడో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జులై 8 నుంచి డిగ్రీ కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు