Monday, May 20, 2024

కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేను కలిసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

తప్పక చదవండి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేను కలిశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని ఆయన కోరారు. ఉప ముఖ్యమంత్రి పదవిని బీసీలకు దక్కేలా చేయాలని ఆయన కోరారు. బీసీల రిజర్వేషన్ల పెంపు అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ ను జాతీయ బీసీ దళ్ స్వాగతిస్తూ ఉందని.. వీలైనంత త్వరగా అమలు చేయాలని.. అలా జరిగితే పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని అన్నారు దుండ్ర కుమార స్వామి. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం కూడా అభినందనీయమని అన్నారు.

బీసీ సబ్ ప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హెూదాతో మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు దుండ్ర కుమారస్వామి. ఇది అమలు అయ్యేలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సూచించాలని మాణిక్ రావు ఠాక్రేకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి గుర్తు చేశారు. ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా కాంగ్రెస్ పార్టీ పాలన ముందుకు సాగితే బీసీలు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు దుండ్ర కుమారస్వామి. బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పిందని.. ఇవి ఇచ్చి బీసీల బాగు కోసం కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని.. బీసీల నమ్మకాన్ని చూరగొనాలంటే అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేను కోరారు దుండ్ర కుమారస్వామి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు