Tuesday, April 30, 2024

ప్రజారంజక పాలనందిస్తాం

తప్పక చదవండి
  • ప్రజాదర్బార్‌ వినతులను పరిష్కరిస్తాం
  • బీఆర్‌ఎస్‌ నాయకుల అరాచకాలను బయటకు తీస్తాం
  • అవినీతికి సహకరించిన అధికారుల భరతం పడతాం
  • కేసీఆర్‌ పాలన గుర్తుకొస్తే ఒళ్ళు జలదరిస్తుంది
  • కేసీఆర్‌ తొమ్మిదిన్నర ఏళ్ల పాలన అస్తవ్యస్తం
  • పదేళ్లుగా నరకయాతన అనుభవించిన ప్రజలు
  • ప్రజాపాలన దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు
  • ప్రజలు కోరుకునే పాలనను అందిస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన అందిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగులు వేస్తోంది. ప్రజలు కోరుకునే ప్రజా రంజక పాలన కాంగ్రెస్‌ తోటే సాధ్యమని నమ్మిన తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చి అధికారంలోకి తీసుకువచ్చారు. ప్రజలకు వారు కోరుకునే పాలనను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతోపాటు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు. మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజా దర్బార్లను ఏర్పాటు చేశామని, ప్రజల వద్దకే పాలన దిశగా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఆ దిశగా అధికారులకు సూచనలు చేశారు. ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా వారి సమస్యలను దగ్గరుండి పరిష్కరించాలని ఆదేశించారు. పాలన వ్యవస్థను గ్రామాలకు తీసుకెళ్లి ప్రజలకు పాలన పరంగా ఉన్న సమస్యలను తీరుస్తామని అన్నారు. అధికారులు స్థానికంగా ఉండే పని చేస్తారని, సమస్యలు ఉన్న ప్రజలు గందరగోళానికి గురి కాకుండా అధికారులకు చెప్పుకోవాలని, ఎక్కడి సమస్యను అక్కడే అప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

కేసీఆర్‌ పాలన గుర్తొస్తే ఒళ్ళు జలదరిస్తుంది
కేసీఆర్‌ పాలనలో మెజార్టీ ప్రజలు ఎన్నో రకాలుగా అవస్థలు పడ్డారు. తమ గోడు చెప్పుకుందామంటే వినే నాయకుడే లేడని వాపోయారు. పాదయాత్ర సమయంలో ప్రజలను కలుస్తున్నప్పుడు వారు చెప్పే ఇబ్బందులు సమస్యలు వింటుంటే మనసు చలించేది ప్రజలను ఎవర్ని పలకరించిన ఆయన పాలన గురించి చెప్తు కేసీఆర్‌ పాలనంటే ఒళ్ళు జలదరిస్తుందని అంటూ ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకునేవారు. పాదయాత్ర చేస్తూ ప్రజల బాధలను వింటుంటే కన్నీళ్లు వచ్చేవని అన్నారు. ప్రజలే చేత కన్నీరు పెట్టించే ఏ నాయకుడైనా కాలగర్భంలో కలిసి పోవాల్సిందేనని, అలాంటి పరిస్థితులు గత ప్రభుత్వానికి ఏర్పడి పతనమైపోయిందని పేర్కొన్నారు. ఎక్కడైతే అహంకారం, అహం, దౌర్జన్యం దాస్టికాలు పెరిగిపోతే వినాశనానికేనని, అవి నేడు తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వానికి చవి చూపించాయని అన్నారు. నాయకుడు అనేవాడు ప్రజల దీవెనలు పొందాలి కానీ, వారి ఉసురు పుచ్చుకోదని తెలిపారు. గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్‌ నాయకుల అవినీతి, అరాచకాలు, ప్రజలను రకరకాలుగా హింసించిన నాయకులను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదని అన్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకుల అవినీతిపై విచారణ జరిపిస్తామని అన్నారు. ఎంత పెద్ద నాయకుడు ఉన్న వదిలిపెట్టేది లేదని వాళ్ళ అవినీతి అరాచకాలను బయటపెట్టి చట్ట పరిధిలో శిక్షలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

గత ప్రభుత్వ అవినీతికి సహకరించిన అధికారుల భరతం పడతాం
కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వంత పాడారని, అలాంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా రెవెన్యూ, ధరణికి సంబంధించిన భూవివాదాల్లో తల దూర్చి ఇష్టానుసారంగా వ్యవహరించి, బీఆర్‌ఎస్‌ నాయకులకు అనుకూలంగా పనులు చేసి పెట్టారని, అలాంటి వారందరి చిట్టా మా దగ్గర ఉందని, వారెవ్వరిని కూడా వదిలిపెట్టబోమని అన్నారు. ఇదే అదునుగా కొంతమంది అధికారులు సమస్య లేకుండా సమస్య సృష్టించి దాని ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని, సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదని అన్నారు. భూ సమస్యలు పరిష్కారం కానీ వారు ఎవరున్నా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ధరణి వ్యవస్థను ప్రక్షాళన చేసి రైతులకు ఏర్పడిన భూ వివాద సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. గతంలో జరిగిన భూ లావాదేవీలపై విచారణ చేపడతామని అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని అన్నారు.

కేసీఆర్‌ తొమ్మిదేళ్ల పాలన అస్తవస్తం..
కేసీఆర్‌ చేసిన తొమ్మిదిన్నర ఏళ్ల పాలన అస్తవ్యస్తంగా కొనసాగింది.. ఆయన పాలనలో ప్రజలు నరకయాతన అనుభవించారు. రాష్ట్రంలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, అవినీతి, సొంత పార్టీ నేతల అరాచకాలు, దాడులు జరిగాయని వీటితో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని కొన్ని సందర్భాల్లో నరకయాతన అనుభవించారని, ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పిల్చుకుంటున్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు, పేపర్‌ లీకేజ్‌ అయినా కూడా పట్టించుకోని కేసీఆర్‌ ప్రభుత్వం, చిన్నారులపై లైంగిక దాడులు జరిగితే పట్టించుకోని కేసీఆర్‌ సర్కార్‌, ఇసుక మాఫియా, డ్రగ్స్‌ మాఫియా పేట్రేగిపోతున్న నిలువరించకపోవడంతో ప్రజలు కేసీఆర్‌ పైన, బీఆర్‌ఎస్‌ నాయకులపైన ఆయన ప్రభుత్వం పైన విసిగి వేసారి పోయారు. వద్దు రా బాబు ఇలాంటి దుర్మార్గుడి పాలన అని ప్రజలు ఓట్ల రూపంలో తమ అసహనాన్ని, కోపాన్ని కేసీఆర్‌ ప్రభుత్వంపై చూపించి గద్దె దింపారు. కేసీఆర్‌ ప్రభుత్వంలోని లోపాలను రాష్ట్రంలో ప్రజలు పలు మీడియాల్లో సోషల్‌ మీడియాలో కోడై కూస్తున్నప్పటికిని, అవేవీ వారికి వినబడనట్టు వ్యవహరించారు. ఇవన్నీ గమనించిన ప్రజలు ఎలాగైనా కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఓటు ద్వారా చెప్పి, ఇంట్లో కూర్చోబెట్టారు. ఏ నాయకుడైన విర్రవీగితే ఆ నాయకులకు ఇదే గతి పడుతుందని ప్రజలు గుర్తు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు