Monday, April 29, 2024

రాహుల్‌, ప్రియాంకల రాకతో జన సందోహమైన మల్కాజ్‌గిరి..

తప్పక చదవండి
  • ఢిల్లీ లో నేను ప్రియాంక మీ సేవకులం : రాహుల్‌ గాంధీ
  • దొరల పాలన కావాలా ప్రజాపాలన కావాలా : ప్రియాంక గాంధీ
  • బాయ్‌ బాయ్‌ కేసీఆర్‌ : రేవంత్‌రెడ్డి
  • మల్కాజిగిరి ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా : మైనంపల్లి హనుమంతరావు

మల్కాజిగిరి : ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మల్కాజిగిరి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో వేలాదిమందితో భారీ రోడ్‌ షోను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాహుల్‌ గాంధీ,ప్రియాంక గాంధీ, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు.డప్పు, దరువులతో, బతుకమ్మ, బోనాలు, వివిధ సాంస్కృత నృత్యాలతో వేలాదిమంది ప్రజలతో ఆనంద్‌ బాగ్‌ చౌరస్తా నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేస్తే, కెసిఆర్‌ కుటుంబం తెలంగాణ ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటూ బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని కెసిఆర్‌ పై విరుచుకుపడ్డారు.

పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్‌ కుటుంబం తప్ప ప్రజలు బాగుపడలేదని ఎద్దేవా చేశారు. దొరల పాలన కావాలా,ప్రజల పాలన కావాలా అని ప్రియాంక గాంధీ అన్నారు. రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఢిల్లీలో ఉన్న మేము పాలకులము కాదు ప్రజల సేవకులమని అన్నారు. కెసిఆర్‌ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు అన్నిటిలో 30 శాతం కమిషన్‌ తీసుకున్న గణిత కేసీఆర్‌ కుటుంబానికి దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు పథకాలను, కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడిన మొదటి సమావేశంలోనే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎలక్షన్స్‌ లో కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్‌ తెలంగాణకు చేసినదేం లేదని, ప్రజలను మోసం చేస్తూ తన సొంత ఆస్తులను పెంచుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ ను తెలంగాణ నుంచి పంపడం ఎంతో అవసరమని అన్నారు. మల్కాజ్గిరి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ,మల్కాజిగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని, మల్కాజ్గిరి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రజలకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు