Monday, April 29, 2024

ఓటమి భయంతోనే కేసీఆర్ రైతు బంధు

తప్పక చదవండి
  • బీసీ, దళిత, మైనార్టీ బంధులకు కూడా అనుమతి తీసుకోవాలి
  • ఓటర్లను మభ్యపెట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నం
  • కాంగ్రెస్ గెలవాలి… ప్రభుత్వం మారాలి
  • హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్

ప్రజలు ప్రభుత్వం పై విశ్వాసం కోల్పోయారని, అందుకే కాంగ్రెస్ పార్టీ గెలవాలి… ప్రభుత్వం మారాలని అనుకుంటున్నారని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అక్కన్నపేట మండలంలోనీ చౌట పల్లి, అంతక్ పేట్, గుబ్బడి, గొల్ల కుంట, కేష్ నాయక్ తండ, అక్కన్నపేట గ్రామాల్లో ఉన్న ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రైతు బంధు నగదు విడుదల కోసం అనుమతి తీసుకున్న ప్రభుత్వం బీసీ బంధు, దళిత బంధు, మైనార్టీ బంధు, గిరిజన బంధు లకు కూడా అనుమతి తీసుకోవాలి అని అన్నారు. ఐదు సంవత్సరాలుగా రుణమాఫీ అమలు చేయని రైతు వ్యతిరేకి కేసీఆర్. ఎన్నికల కోసమే కేసీఆర్ రైతుబంధు డ్రామాలు ఆడుతున్నాడు. ఏకకాలంలో రుణమాఫీ చేయని కేసీఆర్ సర్కార్ ఎన్నికల కోసం రైతుబంధు ఇవ్వడానికి ఈసీ నుంచి అనుమతి తెచ్చుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి 15 వేల రూపాయలు రైతుబంధు ఇస్తాం. కెసిఆర్ మాదిరిగా కాంగ్రెస్ గాలి కబుర్లు చెప్పదు. గ్యారెంటీగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించడానికి కేసీఆర్, కేటీఆర్‌కు బుద్ధుండాలి. ప్రజల సంపదను ప్రజలకు పంచితే ఇవే కాదు, ఇంకా మరిన్ని పథకాలు ఇవ్వొచ్చు. హామీలన్నీ పక్కనపెట్టి ప్రజల్ని మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలను కోరారు. ప్రజలకు బీఆర్ఎస్ పై పూర్తిగా విశ్వాసం పోయిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే పేదలకు బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూమ్, బీసీ బందు దళిత బంధు, మైనార్టీ బందు వంటి పథకాలు ఇస్తామని ప్రజల్ని బీఆర్ఎస్ మోసం చేసిందని అన్నారు. గృహ లక్ష్మి పథకం కోసం పేదవాళ్ళు వందల రూపాయలు వెచ్చించి ఎదిరి చూశారని, పేద వాళ్ళ కోసం గృహ లక్ష్మి పథకం కోసం కూడా అనుమతి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి తనను గెలిపించాలని పొన్నం కోరారు. ప్రచార కార్యక్రమంలో పొన్నంతో పాటుగా అక్కన్నపేట మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, సీపీఐ జిల్లా పార్టీ కార్యదర్శి మంద పవన్, తో పాటుగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొన్నం అభిమానులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు