Wednesday, May 15, 2024

బీజేపీతోనే సౌభాగ్య తెలంగాణ

తప్పక చదవండి
  • అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌
  • పదేళ్ల తెలంగాణ పాలన మొత్తం అవినీతిమయం
  • కేసీఆర్‌ కుటుంబ పాలనతో నెరవేరని ఆకాంక్షలు
  • ఓటమి భయంతో కేసీఆర్‌ రెండుచోట్లా పోటీ
  • హుజూరాబాద్‌, దుబ్బాకలు ట్రైలర్లు మాత్రమే
  • తూప్రాన్‌, నిర్మల్‌ ప్రచార సభల్లో ప్రధాని మోడీ

హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోడీ అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటేనని, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా రాష్ట్రంలో కుటుంబ పాలనే నడుస్తోందని, రాష్ట్రంలో రూ.కోట్లల్లో ఇరిగేషన్‌ స్కాం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్‌ తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచి స్తారని, ప్రజల భవిష్యత్‌ గురించి చింత లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం తూఫ్రాన్‌, నిర్మల్‌ లోని సకల జనుల సంకల్పం పేరుతో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. నిర్మల్‌ లో బొమ్మల పరిశ్రమను బీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అంటే పేదలకు గ్యారెంటీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని, అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని పునరుద్ఘాటించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ’ధరణి’ ద్వారా భూ మాఫియాకు పాల్పడిరదని ప్రధాని ఆరోపించారు. సర్కార్‌ స్టీరింగ్‌ ను కేసీఆర్‌ వేరే పార్టీ చేతుల్లో పెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందన్న ఆయన, ప్రజలను కలవని, ఫామ్‌ హౌజ్‌ కు మాత్రమే పరిమితమయ్యే సీఎం మనకు అవసరమా.? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ సర్కార్‌ పేదల వ్యతిరేక ప్రభుత్వమని, ఇక్కడి ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రపంచం మొత్తం మేక్‌ ఇన్‌ ఇండియా గురించి మాట్లాడుతోందని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ ఆ విషయమే ప్రస్తావించవని ధ్వజమెత్తారు. మతం పేరిట ఐటీ పార్కులు చేపడతామని కాంగ్రెస్‌ చెబుతోందని, ఓట్ల కోసమే ఈ పార్కులు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారని, బీజేపీ హయాంలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని గుర్తు చేశారు. బీజేపీతోనే సకల జనుల సౌభాగ్య తెలంగాణ సాధ్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ’పదేళ్లలో 4 కోట్ల పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించాం. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే నిజామాబాద్‌ ను పసుపు నగరంగా ప్రకటిస్తాం. అలాగే ఆర్మూర్‌ పసుపు పంటకు జీఐ ట్యాగ్‌ వచ్చేలా కృషి చేస్తాం. పెట్రోల్‌, డీజిల్‌ పై వ్యాట్‌ తగ్గిస్తాం.’ అని వివరించారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందని, బీసీలకు బీజేపీతోనే ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఈటలకు భయపడే సీఎం కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాక, హుజూరాబాద్‌ లో ట్రైలర్‌ చూశారని, ఇకపై సినిమా చూస్తారని చెప్పారు. తూప్రాన్‌ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్‌ గెలవలేకే.. ఓటమి భయంతో వేరే చోట పోటీ చేస్తున్నారని ప్రధాని మోడీ విమర్శించారు. గతంలో రాహుల్‌ గాంధీ కూడా ఇలానే పోటీ చేశారని, ప్రజలకు కలవని ముఖ్యమంత్రి మనకి అవసరమా, ఫామ్‌ హౌస్‌ లో పడుకునే ముఖ్యమంత్రి మనకి అవసరమా అని, ఫామ్‌ హౌస్‌ నుంచి పాలన సాగించిన కేసీఆర్‌ని ఫామ్‌ హౌస్‌కే పరిమితం చేయాలని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు. సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా అని, సీఎం కేసీఆర్‌పై రైతులు కోపంగా ఉన్నారని, మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కట్టి పేద రైతులను రోడ్డు మీద వదిలేశారని విమర్శించారు. కేసీఆర్‌వి అన్ని అబద్ధపు హామీలని, ఆయన్ని దేవుడు కూడా క్షమించడని, కేసీఆర్‌ దళిత సీఎం అని మోసం చేశారన్నారు. దళిత బంధు అంటూ దళితులని మోసం చేశారని, తెలంగాణ నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక స్కీముల పేరు చెప్పి స్కాముల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని మోడీ ఆరోపించారు. నవంబర్‌ 26 ఘటనాలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చేతకాని, అసమర్థ నాయకులు దేశాన్ని పాలిస్తే ఇలానే ఉంటుంది. ఎందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ పోటీ చేస్తే ఓటమి భయంతో కేసీఆర్‌ వేరే చోటికి వెళ్లారు. గతంలో రాహుల్‌ గాంధీ కూడా ఇలానే పోటీ చేశారు. ప్రజలకు కలవని ముఖ్యమంత్రి మనకి అవసరమా. ఫామ్‌ హౌస్‌ లో పడుకునే ముఖ్యమంత్రి మనకి అవసరమా. సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా. సీఎం కేసీఆర్‌పై రైతులు కోపంగా ఉన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కట్టి పేద రైతులను రోడ్డు మీద వదిలేశారు. కేసీఆర్‌ వి అన్ని అబద్ధపు హామీలు…ఆయన్ని దేవుడు కూడా క్షమించడు. కేసీఆర్‌ దళిత సీఎం అని మోసం చేశారని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు అంటూ దళితులని మోసం చేశారు. తెలంగాణ నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారు. అనేక స్కీముల పేరు చెప్పి స్కాముల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌. తెలంగాణ ప్రజలకు ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి కావాలా. ఫామ్‌ హౌస్‌ నుంచి పాలన సాగించిన కేసీఆర్‌ ని ఫామ్‌ హౌస్‌ కే పరిమితం చేయాలన్నారు. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు రెండు ఒక్కటే. ఈ రెండు పార్టీలు కార్బన్‌ కాగితాలు లాంటివి. బీజీపీతోనే తెలంగాణ గౌరవం పెరుగుతుంది. కాంగ్రెస్‌, కేసీఆర్‌ ఒక్కటే..ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి కాంగ్రెస్‌ పాలనలో ఎంతమంది సీఎంలు అయ్యారు. తెలంగాణ వచ్చాక బీసీల్లో ఎవరైనా సీఎం అయ్యారా. తెలంగాణలో బీసీని సీఎం చేసేది బీజేపీ పార్టీనే. సామాజిక న్యాయం కేవలం బీజేపీతోనే సాధ్యం. తెలంగాణలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ గుర్తించింది. ఒక కమిటీ వేసి మాదిగ సోదరులకు న్యాయం చేస్తాం. కాంగ్రెస్‌, ఃఖా పార్టీలకు పెద్ద తేడా లేదు. కాంగ్రెస్‌ సుల్తాన్‌ లను పెంచి పోషించారు. తెలంగాణలో కేసీఆర్‌ నిజాం వారసుల్ని పెంచి పోషిస్తున్నారని ప్రధాని మోడీ విమర్శించారు. ’తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పనికి 30 శాతం కమిషన్‌ తీసుకుంటున్నారు. కేసీఆర్‌ అవినీతిపై విచారణ కొనసాగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ ఏర్పడిరది. బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు కుంభకోణాల్లో పోటీ పడుతున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వంలో నీళ్లు తనకి ఆదాయంగా మార్చుకోవడానికి ప్రాజెక్టు కట్టి నీళ్లను మళ్లించారు. నిధుల విషయంలో దుబారా పెంచి తెలంగాణ ప్రజలపై అప్పు వేసింది. నియామకాల విషయంలో నిరుద్యోగులు తెలంగాణ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. కేసీఆర్‌ తెలంగాణని లూటీ చేసి దేశాన్ని దోచుకోవడానికి దేశ్‌ కి నేత అంటున్నారు. ఢల్లీిలో ఉన్న అవినీతి పార్టీతో చేయి కలిపి కోట్ల రూపాయల లిక్కర్‌ కుంభకోణం చేశారు. ఈ కేసులో కొంతమంది జైల్లో ఉన్నారు, బెయిల్‌ పై బయటికి వచ్చారు. ఈ కేసులో ఎవ్వరిని వదళం, కొంతమంది ఫోన్లు మార్చి డబ్బులు పంపించారు. ఈ కేసులో ఎవ్వరిని వదళం.. ఇది మోడీ గ్యారెంటీ. కేసీఆర్‌ అయినా, కాంగ్రెస్‌ అయినా ఇద్దరు కలిసి రైతుల్ని ముంచారు. రైతుల కోసం ఆలోచించింది బీజేపీ పార్టీనే. తెలంగాణలో బీజేపీని గెలిపించండి. బీసీని సీఎం చేస్తాం. మంత్రి మండలిలో అన్ని వర్గాలకు ప్రధాన్యం కల్పిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు