Sunday, May 5, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు పెద్ద పీట

తప్పక చదవండి
  • ప్రత్యేక తెలంగాణలోనే కష్టాలు పెరిగాయి
  • సబ్బండ వర్గాలకు ఆరు గ్యారంటీలు సమోచిత న్యాయం….
  • కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన యువత చేరిక..
  • ప్రజలతో మమేకమై ప్రచారం నిర్వహిస్తున్నఎంపీఆర్
  • ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాదే..
  • ఎన్నికల ప్రచారంలో మందమల పరమేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం లోనే యువతకు పెద్దపీట వేస్తుందని ఉప్పల్ అభ్యర్థి మందమల పరమేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీకి చెందిన గద్ద క్రాంతి కిషోర్ ఆధ్వర్యంలో యువత భారీగా పరమేశ్వర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతను తాగుబోతులుగా తయారుచేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నోటిఫికేషన్లు వేసిన కల్వకుంట్ల కుటుంబమే లీకులు చేస్తూ యువత జీవితాలతో చెలగాటమాడాలని గుర్తు చేశారు.
పదేళ్లు పాలించిన సిఎం కెసిఆర్‌ ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని, ఏళ్లుగా నిరుద్యోగులు హైదరాబాద్‌ రోడ్లపై తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు రావాలంటే నిరుద్యోగులే కార్యకర్తలు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ జాబు క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పుకోలేని దుస్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారని, పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందకుండగా అనేక వాగ్దానాలు చేసి, కనీసం పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు, రేషన్ కార్డ్స్, పింఛన్లు అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు.

బీఆర్ఎస్ పై యువత నిరుత్సాహ….
కేసీఆర్ ప్రభుత్వం పై యువత నిరుత్సాహంతో ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా నింపారు.

- Advertisement -

గౌడ సంఘాల మద్దతు కోరిన పరమేశ్వర్ రెడ్డి
మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గౌడ సంఘాలను కలిసి మద్దతు ఇవ్వాలని పరమేశ్వర్ రెడ్డి కోరారు. గౌడ కులాలను కేసీఆర్ రాజకీయంగా వాడుకొని వదిలేసాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కళ్లు గీత కార్మికులకు సరైన న్యాయం జరుగుతుందని ఆశ భవం వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు