Tuesday, October 15, 2024
spot_img

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రవీ ఎన్నిక

తప్పక చదవండి
  • సాదరంగా ఆహ్వానించి సీట్లో కూర్చోబెట్టిన సభ్యులు
  • ప్రజా సమస్యలపై చర్చకు స్పీకర్‌ ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్ష
  • అభినందిస్తూ సిఎం రేవంత్‌, భట్టి, శ్రీధర్‌ బాబు, కెటిఆర్‌ల ప్రసంగం

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయన స్పీకర్‌ స్థానంలో ఆశీనులయ్యారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి , మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టారు. అనంతరం అభినందనలు తెలిపారు. అనంతరం వరుసగా ఎమ్మెల్యేలు స్పీకర్‌ చైర్‌ వద్దకు వచ్చి ప్రసాద్‌ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. అనంతరం స్పీకర్‌కు ధన్యవాదాల తీర్మానంపై సభ్యులు మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన్ను సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతిగా ఎన్నికైన తొలి దళిత నేతగా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చరిత్ర సృష్టించారు. స్పీకర్‌ పదవికి ప్రసాద్‌ కుమార్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ సహా మజ్లిస్‌, సీపీఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.అంతకుముందు పలువురు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, పద్మారావు, పాడి కౌశిక్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి ప్రమాణం చేశారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్‌ ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్‌ ఎన్నిక అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. స్పీకర్‌ ఎన్నిక విషయంలో సానుకూలంగా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే సంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. తనది, స్పీకర్‌ ది సొంత జిల్లా వికారాబాద్‌ అని అన్నారు. గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రసాద్‌ సేవలందించారని కొనియాడారు. సభలో చర్చ జరిగి సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు సంబంధించిన చర్చలు సాగాలని, వికారాబాద్‌ అందుకు గడ్డం ప్రసాద్‌ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గొప్ప వ్యక్తి సభకు స్పీకర్‌ అయ్యారని ప్రశంసించారు. అలాగే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు, బీర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పీకర్‌ ను ఉద్దేశించి ప్రసంగించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. పేద వాళ్ళ సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్రంలోని సమస్యలను పెద్ద ఎత్తున చర్చించేందుకు సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. శాసనసభలో చర్చలు అర్థవంతంగా నడుపుతారని విశ్వసిస్తున్నానన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు అభినందనలు తెలిపారు. శాసనసభలో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తారని స్పీకర్‌ పై పూర్తి నమ్మకం ఉందన్నారు. స్పీకర్‌కు మద్దతు తెలిపినందుకు విపక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌ నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తన తండ్రి శ్రీపాద రావు కూడా ఇదే శాసనసభలో పని చేసి ఆ చైర్‌కు ఔన్నత్యాన్ని తీసుకొచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. స్పీకర్‌ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశించారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. స్పీకర్‌ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ… మధుసూదనాచారి,పోచారం శ్రీనివాస్‌ రెడ్డి లాగే సభా హక్కులను కాపాడాలని కోరుతున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలు సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు. తెలంగాణ ఉధ్యమ సమయంలో సిరిసిల్లకు రావాలని తాను గడ్డం ప్రసాద్‌ను ఆహ్వానించానని.. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన రాలేనని అన్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. అయితే తన ప్రోద్బలంతో వచ్చి అక్కడి చేనేత కార్మికుల సమస్యలకు తనవంతు పరిష్కారం చూపారని గుర్తు చేసుకున్నారు. ఎంపిటిసి నుంచి స్పీకర్‌గా ఎదిగిన గడ్డం జీవితం స్ఫూర్తిదాయకమని కెటిఆర్‌ ప్రశంసించారు. బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు గాయాలు కావడంతో సభకు రాలేకపోయారని కెటిఆర్‌ వెల్లడిరచారు. ఇకపోతే మంత్రులు సీతక్క,కొండా సురేఖలు కూడా అభినందిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. ఈ శీతాకాల సమావేశాలను సుమారు 10 రోజుల పాటు నిర్వహించాలని ప్రభత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో రేపు ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణ రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. శాసనసభ, మండలి ఒకేచోట ఉండేలా పార్లమెంట్‌ తరహా కలిపించేలా మార్పులు చేర్పులు చేయబోతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి పూర్తిగా మార్చే యాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌… పెండిరగ్‌ పనులు పూర్తి చేయాలని సమస్యలు పరిష్కారించాలని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు