Tuesday, May 14, 2024

తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తప్పక చదవండి

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి తీవ్ర విపరీతంగా పెరిగింది. మరో మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. తర్వాత రెండుమూడు రోజుల వ్యవధిలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతుందని అంటున్నారు. చలిగాలులు కూడా వీటికి జతకలిసే ఛాన్స్‌ ఉందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటోంది. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత దిగువకు పడిపోయాయి. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మెదక్‌, పటాన్‌చెరు, ఆదిలాబాద్‌, రామగుండంలో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రిజిస్టర్‌ అవుతున్నాయి. నిజామాబాద్‌, హైదరాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, భద్రాచలంలో 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు