Friday, May 3, 2024

2 నెలల్లో హైదరాబాద్‌లోడ్రగ్స్‌ నిర్మూలన

తప్పక చదవండి
  • నగర పోలీసులకు దిశనిర్దేశనం చేసిన కొత్త సీపీ
  • పబ్బులను సమయానికి మూసేయాలని ఆదేశం
  • డ్రగ్స్‌ మాట వినిపించకూడదని వార్నింగ్‌
  • ఒకరికి శిక్ష పడితే.. ఆ 100మందిలో భయం వస్తుంది
  • డెడ్‌లైన్‌ పెట్టిన హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌
    ` డ్రగ్స్‌ పై 87126 71111కు సమాచారం ఇవ్వండి: సందీప్‌ శాండిల్య

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి.. కీలక ఆదేశాలను జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ టవర్‌లో గల కార్యాలయంలో ఛార్జ్‌ తీసుకున్నప్పుడే తన ఉద్దేశం ఏమిటో తెలియజేశారాయన. తన ప్రాధాన్యతల గురించి వివరించారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు తాజా ఆదేశాలు విడుదలయ్యాయి. డ్రగ్స్‌ రహిత నగరాన్ని తీర్చిదిద్దుతామంటూ ఇచ్చిన హామీని కార్యాచరణలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక నేరస్థుడికి శిక్ష పడితే.. నేరం చేయాలనుకునే 100 మందిలో వణుకుపుడుతుందని అన్నారు. పోలీస్‌ స్టేషన్‌లకు వచ్చి ఫిర్యాదు చేసే వారిపట్ల గౌరవంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరపాలని తెలిపారు నగరంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూడాలని, ఇందుకోసం అవసరమైన ప్రణాళిలకు సిద్ధం చేయాలని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నగరంలోకి డ్రగ్స్‌ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్‌ నేరాల దర్యాప్తులో దేశంలోనే హైదరాబాద్‌ తొలి స్థానంలో ఉందన్నారు. ఇప్పటికే మన దగ్గర ఉన్న వ్యవస్థను వినియోగించుకుని కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని సీపీ పేర్కొన్నారు. రికవరీ రేటును మరింత పెంచాలని సీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అలాగే, పబ్‌లు నిర్దేశిత సమాయానికి మూసేయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని పబ్‌ నిర్వాహకులను హెచ్చరించారు. సమయానికి మించి ఏమాత్రం పబ్‌లు నడిపినా చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. పబ్‌లలో డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, నగర పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. పబ్‌లపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ అనేది కనపడకుండా చేయాలని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని, వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు, డ్రగ్స్‌ రహిత తెలంగాణే ధ్యేయంగా టీఎస్‌ న్యాబ్‌ పనిచేస్తుందని ఆ సంస్థ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య ఉద్ఘాటించారు. టీఎస్‌ న్యాబ్‌, దాని పనితీరుపై ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘డిసెంబరు 12న టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యాను. ముఖ్యమంత్రి వద్ద రెండు గంటలపాటు న్యాబ్‌ వ్యవస్థ, డ్రగ్స్‌ నియంత్రణకు చేసిన కృషిని వివరించాం.. టీఎస్‌ న్యాబ్‌.. గ్రే హౌండ్స్‌, అక్టోపస్‌ తరహా సంస్థలా మారాలి. ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులకు ప్రభుత్వం ప్రోత్సాకాలను అందిస్తామని హామీ ఇచ్చింది’ అని సందీప్‌ శాండిల్య తెలిపారు.

డ్రగ్స్‌ పై 87126 71111కు సమాచారం ఇవ్వండి: సందీప్‌ శాండిల్య

- Advertisement -

డ్రగ్స్‌ రహిత తెలంగాణే ధ్యేయంగా టీఎస్‌ న్యాబ్‌ పనిచేస్తుందని డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య పేర్కొన్నారు. టీఎస్‌ న్యాబ్‌ వ్యవస్థ, పనితీరుపై ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘ఈ నెల 12న టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్గా నియమితులయ్యాను. ముఖ్యమంత్రి వద్ద రెండు గంటపాటు టీఎస్‌ న్యాబ్‌ వ్యవస్థ, డ్రగ్స్‌ నియంత్రణకు చేసిన కృషిపై వివరించాం. టీఎస్‌ న్యాబ్‌.. గ్రే హౌండ్స్‌, అక్టోపస్‌ తరహా సంస్థలా మారాలి. డ్రగ్స్‌ నివారణకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలి. పిల్లలు డ్రగ్స్‌ బారిన పడకుండా తల్లిదండ్రులు చూడాలి. విద్యాసంస్థలు, ఐటీ, ఫిల్మ్‌ ఇండస్ట్రీ, బార్లు, పబ్లు, రేవ్‌ పార్టీలు, రిసార్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. డ్రగ్పై సమాచారం ఉంటే 8712671111 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి’’ అని శాండిల్య సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు