Sunday, September 8, 2024
spot_img

శిలా శిల్పి

తప్పక చదవండి

భారం కాని భువిలోని
శిలాఫలకాలేనో
చిరస్మరణీయం
చిత్రాలే చెక్కిన శిల్పి కి
నిదర్శనాలన్ని..!!

గృహ లాంటి
గుండె చిత్రమైతే
అందులో దాగిన
బొమ్మలన్నీ వైచిత్రాలు..!!

- Advertisement -

కళాత్మక రూపాతో
నిలబెట్టించిన
మహనీయుల
రాతి శిల్పాలెన్నో..!!

శిలాఫలకం గట్టుదైనా
పాండవ రాజ్యపాననే చిత్రించే
చిత్రకారుడు కే తెలుసు..!!

వొకంటి చూపుతో
చెక్కి చక్క దింపే ఘనత
వీరులెందరో

కౌసల్య కౌగిట్లో దాగిన
బాల రామున్ని భరతమా
వొడిలోకి తెచ్చిన అరుణ్ లాల్
వో చరిత్ర సృష్టించినా..!!

ఊపిరితో ఊపిరందించే
మహనీయుల రాతి శిల్పాతో
పురుడోస్తున్న చిత్రకారుడి
చిత్రబింబాలెన్నో కదా..!!

  • అనిత చరణ్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు