Saturday, May 18, 2024

ఏళ్లుగా ‘నకిలీ డాక్టర్‌’ లీలలు

తప్పక చదవండి
  • నేటి శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌
  • నాటి మెదక్‌ డీఎంహెచ్‌ఓ చందునాయక్‌ అక్రమ దందా
  • ప్రభుత్వ కొలువుచేస్తూ క్లీనిక్‌ల ద్వారా కోట్లలో ఆస్తులు
  • వైద్యం పేరుతో యధేచ్చగా డబ్బు సంపాదన
  • చదివింది ఎంబీబీఎస్‌, ట్యాగ్‌ లైన్‌ మాత్రం డీసీహెచ్‌
  • జడ్చర్ల, షాద్‌నగర్‌, కొత్తకోటలో దుక్నాలు
  • డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ సపోర్ట్‌
  • ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోని వైనం
  • హెల్త్‌ మినిస్టర్‌కు త్వరలోనే కంప్లైంట్‌ ఇవ్వనున్న పలువురు..

దేవుడు కరుణిస్తే.. తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యులు పున:ర్జన్మ ఇస్తారు… అందుకే మన పూర్వికులు ‘వైద్యో నారాయణో హరి’ అనేవారు. తన రోగాలు నయం చేయాలని దేవునీ కాడికి వెళ్లలేక డాక్టర్‌ దగ్గరకు వెళ్తే.. తనకున్న ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలు వదిలి వ్యాధి నయం చేసే గొప్ప వ్యక్తులుంటారు. ‘ఆపదలో మొక్కులు.. సంపదలో మరపులు’ అన్నట్టు పైసలకోసం వైద్యవృత్తి చేసేటోళ్లు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు. జయంత్‌ సి పరాంజీ డైరెక్షన్‌ లో మెగాస్టార్‌ చిరంజీవి, సోనాలిబింద్రే హీరో హీరోయిన్లుగా ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ 2004లో వచ్చిన సినిమాలో చిరు గూండాగా సెటిల్మెంట్లు చేస్తుంటాడు. ఎలాంటి అర్హతలు లేకున్నా తల్లిదండ్రుల కోరిక మేరకు అక్రమదారిలో ఓ మెడికల్‌ కాలేజ్‌లో సీటు దక్కించుకోని ఎంబీబీఎస్‌ చదువుతుంటాడు. చివరకు తన గురించి అందరికీ తెలిసి అవాక్కవుతారు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే నేటి చందు నాయక్‌ ఎంబీబీఎస్‌ గురించి విన్నాక అదే గుర్తొస్తుంది…

వివరాల్లోకి వెళితే.. అతను పేరుకు ఎంబీబీఎస్‌ డాక్టర్‌. కానీ డీసీహెచ్‌ (డిప్లోమా ఇన్‌ చైల్డ్‌ స్పెషలిస్ట్‌) ట్యాగ్‌ లైన్‌ పెట్టుకోని వైద్యం చేస్తున్నాడు. 2001లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన చందు నాయక్‌ 2005లో ప్రభుత్వ వైద్యుడిగా కొలువులో చేరాడు. ఆ సినిమాలో చిరంజీవి డాక్టర్‌గా చెలామణి అవుతూ హాస్పిటల్‌ స్టాఫ్‌ను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. అయితే అంతలా కాకున్నా.. ఎంబీబీఎస్‌ చదివినప్పటికీ అంతకన్న ఎక్కువే చెప్పుకుంటూ ట్రీట్మెంట్‌ చేస్తూ అమాయక పిల్లల ప్రాణాలను బలిగొంటున్నాడు. అయితే నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ వైద్యుడు కూడా సర్కారు దవాఖానాలో తప్ప మరే క్లీనిక్‌, ఆస్పత్రుల్లో పనిచేయరాదు. కానీ ఈ నకిలీ డీసీహెచ్‌ మాత్రం అన్నట్టు గవర్నమెంట్‌ ఆస్పత్రిలో డ్యూటీ చేసుడు వదిలి ప్రైవేటు క్లీనిక్‌లలో ఎక్కువ టైం కేటాయిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అసలు ఈ వైద్యుడికి ఎలాంటి డీసీహెచ్‌ పట్టా లేకున్నా తన పేరు మార్చి బీఎన్‌ చందు అనే పేరుతో జడ్చర్ల, షాద్‌నగర్‌, కొత్తకోటలో మధు చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ దుక్నాలు తెరిచాడు.
నకిలీ డాక్టర్‌ అవతారం ఎత్తి ఏళ్లుగా ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కోట్లు కొల్లగొట్టాడు. అర్హత లేని డీసీహెచ్‌ ట్యాగ్‌ లైన్‌ను తగిలించుకొని వైద్యారోగ్య శాఖలో ఓ అవినీతి జలగ రాజ్యమేలుతున్నాడు. ఆ డిపార్ట్‌మెంట్‌ బాస్‌ అండదండలతో విచ్చలవిడి కరప్షన్‌కు పాల్పడడం విస్మయం కల్గిస్తోంది. అప్పటి మెదక్‌ డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న డా.చందునాయక్‌ ఎంబీబీఎస్‌ ఇక ప్రభుత్వం ద్వారా అందజేసే డిగ్రీపై డీసీహెచ్‌ చదివినట్లు ముద్రించుకున్నాడు. ఆ తర్వాత గతంలో వైద్యారోగ్యశాఖ బాస్‌ అయిన గడల శ్రీనివాస్‌ అండదండలతో డిపార్ట్‌మెంట్‌లో విచ్చలవిడిగా రెచ్చిపోయాడు. షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా ఉద్యోగంలో చేరిన చందునాయక్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ గడల అండదండలతో ఏకంగా వనపర్తి, గద్వాల 2 జిల్లాల వైద్యాధికారి అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఓ రాజకీయ నాయకుడిని లంచం అడిగి విమర్శల పాలైనట్లు తెలుస్తోంది. ఇదే విషయమై మీడియాలో పుంకాను పుంకాలుగా అప్పట్లో కథనాలు సైతం వచ్చాయి. అయితే డిపార్ట్‌మెంట్‌లో గడల అండదండలు ఈయనకు పుష్కలంగా ఉండడంతో.. మళ్లీ మెదక్‌ డీఎంహెచ్‌ఓగా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు.

- Advertisement -

అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చందునాయక్‌ వైఖరిలో మార్పు రాకపోవడం విశేషం. ఏ మాత్రం తన బుద్ధిని మార్చుకోకుండా ఉద్యోగులను తాజాగా వేధిస్తుండడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇలా ఉద్యోగుల నుంచి అక్రమంగా వసూల్‌ చేసిన అమ్యామ్యాలతోనే కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. చందు నాయక్‌ వ్యవహారంపై తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ శాఖపరమైన చర్యలకు డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌కు లేఖ రాసిన ఈరోజు వరకు చందు నాయక్‌ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఈ మొత్తం వ్యవహారంపై స్పందించి విచారణ చేయిస్తే చందునాయక్‌కు సంబంధించిన అవినీతి చిట్టా మొత్తం బయటకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.ఇదీలా ఉండగా నకిలీ డీసీహెచ్‌గా చలామణి అవుతున్న చందునాయక్‌ పై చర్యలు తీసుకోకపోవడంతో ప్రజారోగ్య, కుటుంబసంక్షేమ శాఖ డైరెక్టర్‌పై.. ఆదాబ్‌ హైదరాబాద్‌ రాష్ట్ర వైద్యారోగ్య శాఖమంత్రి దామోదర్‌ రాజనర్సింహా ఫిర్యాదు చేయనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు