Saturday, April 27, 2024

అనంతమైన భూయజమాని హక్కులు..

తప్పక చదవండి
  • అసలు నిజాలు తెలియని అమాయకులు
  • రెవెన్యూ చట్టం పట్ల అవగాహనా రాహిత్యం
  • దీని ఆసరాగా మోసాలకు గురౌతున్న వైనం
  • ధరణి రాకతో అయోమయంలో భూ యజమానులు జీవితాలు
  • నిషేధిత కాలాన్ని ధరణిలో జొప్పించి కుట్ర పూరిత చర్యలు
  • భూ హక్కుల గురించి, ధరణిలోకి మోసపూరిత వ్యవహారాలపై
    ` ఆదాబ్‌ హైదరాబాద్‌ అందిస్తున్న కళ్ళు చెదిరే నిజాలు

భూములకు సంబంధించి ఎటువంటి హక్కులుంటాయి.. ఒకప్పుడు అంటే భూములను కొలిసి రికార్డులు తయారు చేసినప్పుడు తెలంగాణలో అయితే 1940 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ లో అయితే 1910 సంవత్సరంలో భూములను సర్వే చేసి రికార్డులు తయారు చేయడం జరిగింది.. అప్పుడు తయారు చేసిన రికార్డుల ప్రకారం రెండు రకాల భూములు ఉన్నాయి..ఒక్కటి ప్రభుత్వ భూమి..మరొక్కటి ఇనాం భూమి..అంటే గవర్నమెంట్‌ ఇనాం.. సర్కారీ ఇనాం గా కూడా పిలుస్తారు ..భూములలో ఈ రెండు క్లాసిఫికేషన్‌ లు మాత్రమే ఉంటాయి..పట్టా భూమి అనే క్లాసిఫికేషన్‌ కూడా రెవెన్యూ రికార్డులో ఉండదు.. సర్కారి భూమి అని రాసి ఉండి పక్కనే ఎవరైనా వ్యక్తి పేరు పట్టాదారునిగా ఉంటే అది.. పట్టా భూమి అని రెవిన్యూ చట్టం చెపుతోంది..

హైదరాబాద్‌ ( ఆదాబ్‌ హైదరాబాద్‌ ) :
రెవెన్యూ వ్యవహారాలు రకరకాలుగా మార్పులు చోటుచేసుకోవడం జరిగిందిదే.. కాలం గడిచేకొద్దీ భూముల రకాలను ప్రభుత్వం పది రకాల భూములుగా పెంచడం జరిగింది.. ..ప్రస్తుతం దాదాపుగా పదిరకాల కీలకమైన భూముల రకాలు రెవిన్యూ రికార్డుల ప్రకారం ఉన్నాయి..

- Advertisement -

సర్కారీ భూమి :
రెవెన్యూ రికార్డుల ప్రకారం గతంలో ఉన్న ప్రభుత్వ భూమి.. ప్రభుత్వ ఆధీనంలోని గవర్నమెంట్‌ కి చెందిన భూమి అని ఆ భూమినే సర్కారీ భూమిగా రెవిన్యూ చట్టం,రెవిన్యూ రికార్డులు తెలుపుతున్నాయి ..

ఇనాం భూమి :
ఇనాం భూమి అంటే .. ఇనాం భూములను క్రమబద్ధీకరిణ చేసి అట్టి రైతులకు రైత్వారీ పట్టా లేక ఆక్యుపెన్సీ రైట్‌ సర్టిఫికెట్‌ అంటే ఓఆర్సిని రైతుకు ఇచ్చి ప్రభుత్వం పట్టాభూమూలుగా మార్చితే అప్పుడు అట్టి భూములు ఆ రైతులకు సంబందించిన పట్టా భూములుగా రెవెన్యూ రికార్డులలో అప్డేట్‌ చేయడం జరుగుతుంది.. కానీ ఏవైతే ఇనాం భూములకు రైత్వారి పట్టా కానీ ఓఆర్‌ సి జారీ చేయకుండా ఉన్నాయో అట్టి భూములు మొత్తం నేటికీ ఇనాం భూములుగానే రికార్డులలో పొంద పరచడం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ..ఇప్పటికి అట్టి భూములు ఇనాం భూములు గానే రెవెన్యూ రికార్డులో వస్తున్నాయి..

పట్టాభూమి :
ఇక పట్టా భూమి.. ఏదైనా వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్‌ ల్యాండ్‌ గా పేర్కొనవచ్చు.. అట్టి వ్యక్తి యొక్క జీరాయితీ పట్టా అని కూడా పిలుస్తారు.. ..అట్టి భూమి ప్రైవేట్‌ ల్యాండ్‌ కాబట్టి ఆ యొక్క భూమికి అన్ని హక్కులు ఏ వ్యక్తి పేరైతే పట్టా లో పేరు ఉందో ఆ రైతుకు లేదా వ్యక్తికి సంబంధించిన పట్టా భూమిగా పేర్కొనవచ్చు..అట్టి రైతుకు ఆ యొక్క భూమి పై సర్వ హక్కులు ఉంటాయని రెవెన్యూ చట్టం చెపుతోంది..

అసైన్డ్‌ భూమి :
ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని.. ఏదైనా వ్యక్తికి ఇల్లు కట్టుకోవడానికి,వ్యవసాయం చేసుకోవడం కోసం భూమిలేని నీరు పేదలకు ఇవ్వటం జరుగుతుంది.. అలా ప్రభుత్వం నీరు పేద రైతులకు ఇచ్చిన భూమిని అసైన్మెంట్‌ పట్టా భూమిగా, డి ఫామ్‌ పట్టా భూమి గా,లావోని పట్టా భూమి అని,లేదా డీకేటీ పట్టా భూమి అని చట్టాలు,రెవిన్యూ రికార్డులు తెలుపుతున్నాయి.. గతంలో దాదాపు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలలో కలుపుకొని సుమారు 50 లక్షల ఎకరాలపైగా అసైన్మెంట్‌ భూమి ఉండేది.. రెవెన్యూ రికార్డులు క్లాసిఫికేషన్‌ అసైన్డ్‌ భూమి అని రెవిన్యూ రికార్డులలో పొంద పరిచారు.. అట్టి భూములు అసైన్డ్‌ భూములుగా పిలుస్తారు..

భూదాన్‌ భూమి :
తెలంగాణ రాష్ట్రంలో 1950 సంవత్సర లో ఆచార్య వినోబా బావే భూదాన యజ్ఞాన్ని ప్రారంభించారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమంగా చేశారు.. ఆ ఉద్యమం లో భాగంగా చాలామంది ఎక్కువగా భూమి ఉన్న భూ స్వాములు,యజమానులు వారి భూములను చాలామంది వ్యక్తులకు భూమి దానం చేశారు.. ఆ భూములనే పేదలకు పంచి ఇవ్వడం జరిగింది.. అట్టి భూములనే భూదాన్‌ భూమి అని పేర్కొంటారు..

సీలింగ్‌ భూమి:
సీలింగ్‌ భూమి అంటే అన్ని రాష్ట్రాలలో ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి పేరు పైన ఎంత వ్యవసాయ భూమి ఉండాలని చట్టాలు చేశారు.. ప్రభుత్వం చూపించిన భూమి కంటే ఎక్కువ భూమి ఉంటె అట్టి భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని సీలింగ్‌ చట్టం చెపుతోంది.. ఎక్కువ భూమి ఉన్న భూ స్వాములు వారికీ ప్రభుత్వం సూచించిన భూమి కంటే ఎక్కువ భూమి ఉంటే వారే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలి.. లేదా ప్రభుత్వమే వారి దగ్గర నుండి తీసుకుంటుంది.. వ్యవసాయ భూ పరిమితి చట్టంలోని నిబంధనల ప్రకారం క్లాసిఫికేషన్స్‌ బట్టి ఏడు ఎకరాల నుండి యాభై నాలుగు ఎకరాల వరకు మాత్రమే ఆ కుటుంబానికి భూమి ఉండాలనేది చట్టం చేశారు.. ఇలా యాభై నాలుగు ఎకరాల పై బడిన భూములను సీలింగ్‌ మిగులు భూములు అని లేదా సీలింగ్‌ సర్ఫ్‌ లెస్‌ భూములు అని పిలుస్తారు..ఇట్టి భూములను పేదలకు ప్రభుత్వం పంచి ఇవ్వడం జరుగుతుంది..

ఫారెస్ట్‌ భూమి లేదా అటవి భూమి :
అటవీ శాఖకు సంబంధించిన భూములకు సంబంధించి రెవిన్యూ రికార్డులలో మహా సురాణి,మైసురాణి గా పెర్లు వ్రాసి ఉండే భూమి అటవీ భూమిగా పేర్కొనవచ్చు.. ఏ భూమినైనా అంటే ప్రభుత్వ లేదా ప్రయివేటు భూమినైనా అటవీ భూమిగా మార్చే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది.. అందుకు గాను ప్రభుత్వం చట్టాలు చేసింది..ఒక్కసారి ప్రభుత్వం అటవీ భూమిగా మారిస్తే అట్టి భూమి అటవీ భూమిగా రెవిన్యూ రికార్డులలో వస్తుంది.. ఆ అటవీ భూములకు సంబంధించి అటవీ హక్కుల చట్టము లోని నిబంధనల ప్రకారం అటవీ హక్కు పత్రం ఏదైనా వ్యక్తి పొందినట్లయితే ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌ పట్టా అని లేదా ఫారెస్ట్‌ రైట్‌ పట్టా అని, అటవీ పట్టా అని రెవెన్యూ రికార్డులలో క్లాసీ ఫికేషన్‌ లో వ్రాయడం జరుగుతుంది..

దేవుడి మాన్యం,లేదా దేవుడి భూమి లేదా ఎండోమెంట్‌ ల్యాండ్‌ :
ఈ భూమికి సంబంధించి దేవాలయాల కోసం కేటాయించే భూములు, దేవాలయాలకు మాన్యంగా ఇచ్చిన భూముల వివరాలు మొత్తం రెవిన్యూ రికార్డులలో పొంద పరుస్తారు.. ఆ యొక్క రెవిన్యూ రికార్డులలో క్లాసీ ఫికేషన్‌ కు సంబంధించిన కాలంలో ఎండోమెంట్‌ ల్యాండ్‌ గా రికార్డులలో నమోదు చేస్తారు..ఇట్టి భూములు కూడా ప్రభుత్వ అధీనంలో ఉండే భూములు..ఇట్టి భూముల పై ప్రయివేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులు ఉండవు..ఇట్టి భూములు ఎండోమెంట్‌ అధికారుల పర్యవేక్షణలో ఉంటాయి..

వక్ఫ్‌ భూమి:
వక్ఫ్‌ కు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన భూములను వక్ఫ్‌ భూములుగా పేర్కొంటారు.. ఇట్టి భూములను రెవిన్యూ రికార్డులలో క్లాసీ ఫికేషన్‌ సంబంధించిన కాలంలో వక్ఫ్‌ ల్యాండ్‌ అని నమోదు చేస్తారు..ఇట్టి భూములు వక్ఫ్‌ బోర్డు పరిధిలో ఉంటాయి..

స్థూలంగా ఎన్ని రకాల భూములు వున్నాయి.. వాటి యాజమాన్యం పరిస్థితి ఏమిటి అన్నది తెలుసుకున్నాం.. అయితే తెలంగాణాలో బీ ఆర్‌ ఎస్‌ ప్రభుత్వం వున్నప్పుడు ధరణి అనే పోర్టల్‌ ని తీసుకుని వచ్చింది.. దాని ద్వారా సమస్యలు తొలుగుతాయి అనుకుంటే సమస్యలు పెరిగాయి.. ధరణిలో నిషేధిత జాబితా కి సంబంధించిన కాలం ఉంది .. అసలు ఆ కాలంలో లెక్కగట్టిన భూములు ఎక్కడ..? ఎవరి ఆధీనంలో వున్నాయి..? అన్నది తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.. నిజంగా ఆ లెక్కలు తెలుసుకోగలిగితే ఆ భూములమీద వచ్చే ఆదాయంతో కనీసం ఒక్క సంవత్సరం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడపవచ్చు అన్నది అక్షర సత్యం.. ఆ దిశగా నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా..? లేదా అన్నది చూడాలి.. ఇక అసలు ధరణిలో దాగున్న అసలు గుట్టు ఏమిటి..? ఎన్ని లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి..? అసలు ఏమి జరుగుతోంది..? ఇప్పటివరకు ఏమి జరిగింది..? అన్న విషయాలు ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్‌ హైదరాబాద్‌ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు