Friday, May 17, 2024

భాగ్యనగరం గడ్డ.. నా అడ్డ అంటున్న లేడీసింగం

తప్పక చదవండి
  • అన్ని వర్గాల ప్రజలను భాష యాసలతో ఆకట్టుకుంటు ప్రచారం
  • అసద్‌కు, అక్బర్‌కు ముచ్చేచెమటలు పట్టిస్తున్న వీరనారి
  • ప్రత్యర్థులకు అర్థం కాని విధంగా బిజెపి స్టాటజీ
  • ఓటమి ఎరుగని ఎంఐఎంకు మాధవీ లత సవాల్‌
  • అంతుచిక్కని వ్యూహాలతో పాతబస్తీలో బిజెపి పాగా..!
  • బిజెపి దెబ్బకు తొలిసారి ప్రచారం చేస్తున్న ఎంఐఎం

భాగ్యనగర్‌ గడ్డ నా అడ్డా అంటూ లోక్‌ సభ ఎన్నికల బరిలోకి దింపిన బిజెపి,అసద్‌ పై బీజేపీ అస్త్రం ఏ మాధవీలత – ఎవరీమె, ఎంపిక వెనుక.!! కేంద్రంలోని మోదీ సర్కార్‌ వ్యూహం ఏంటి హైదరాబాద్‌ లో హ్యాట్రిక్‌ విజయం పైన కన్నేసిందా!ఈ సారి 400 సీట్లలో గెలుపు లక్ష్యంగా బరిలో దిగిన బిజెపి హైదరాబాద్‌ గడ్డపై ఈ మహిళా అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసిందా ! తొలి విడత అభ్యర్థులు ఎంపిక అందులో తెలంగాణ నుంచి 9 మందిని ఖరారు చేసింది. అనూహ్యంగా హైదరాబాద్‌ ఎంపీ స్థానం నుంచి మహిళా అభ్యర్ది మాధవీ లతను ప్రకటించింది. ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్‌లో అసద్‌ లాంటి బలమైన నేతపైన మధవీ లతను బీజేపీ ఎంపిక చేయటం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

మాధవీలత పేరు ఖరారు: మే 13న జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానంలో మజ్లిస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు విరించి ఆస్పత్రి, లతా,మా ఫౌండేషన్‌ల చైర్‌పర్సన్‌ మాధవీలతకు టికెట్‌ ఖరారు చేసింది. తొలుత హైదరాబాద్‌ స్థానంలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బరిలో నిలపాలని భావించినా మాధవీ లత వైపు పార్టీ మొగ్గు చూపింది కూడా ఆమె కూడా అన్ని వర్గాలను కలుపుకుపోతూ వారి భాషకు తగ్గ యాసను జోడిరచి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో విభిన్న మతాల, జాతుల ప్రజలు ఉన్నారు. ఎవర్ని ఏరకంగా తన వైపు తిప్పుకోవాలో ఆమెకు వెన్న తో పెట్టిన విద్య, ప్రజల మనసెరిగి మాట్లాడడం ఆమె నైజం ఇవన్నీ చూస్తుంటే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అటు కాంగ్రెస్‌ మాత్రం చేతులెత్తేసిన విధంగానే కనపడుతుంది. ఇన్‌ డైరెక్ట్‌ గా కాంగ్రెస్‌, ఎంపీటీ పార్టీలు, ఎంఐఎం పార్టీ అభ్యర్థి అసదుద్దీన్‌ ఓవైసీ కే మద్దతు తెలుపుతున్నాయి అనడంలో సందేహమే లేదు.40 ఏళ్లుగా పాతబస్తిని ఏలుతూ ప్రజలను పట్టించుకోకుండా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కుల మతాల మధ్యన చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటున్న ఎంఐఎం కు బస్తీమే సవాలంటూ సవాల్‌ విసురుతున్నారు. ప్రత్యర్థులకు అంతు పట్టని విధంగా బిజెపి వ్యూహాలు రచిస్తుందా అంటే అవునన్నా సమాధానమే వస్తుంది. పాతబస్తీ అభివృద్ధి చెందాలంటే అసదుద్దీన్‌ ఓవైసీ ఓడిరచాలని అప్పుడే పాత బస్తి ప్రజలకు స్వతంత్రం వస్తుందని ఆమె అన్నారు. ఆమె చేస్తున్న ప్రచారాన్ని చూసి మొదటిసారిగా ఎంఐఎం పాతబస్తీలో ప్రచారాన్ని ప్రారంభించింది అంటే వారిలో ఓటమి భయం మొదలైందా అన్న అనుమానాలు కూడా కలగక మానవు.

- Advertisement -

పాతబస్తీలో మాధవీ లత వర్సెస్‌ అసద్‌..
హైదరాబాద్‌లో టఫ్‌గా పొలిటికల్‌ ఫైట్‌..

మాధవి లత ఎంట్రీతో.. పాతబస్తీలో బస్తీ మే సవాల్‌ అన్నట్లు పోరు సాగుతోంది. డైలీ సీరియల్లో లాగా, డైలీ కాంట్రోవర్సీలతో కాక రేగుతోంది. అయితే ఈమధ్య దర్గాలో మాధవీలత చేసిన ప్రార్థనలతో కొత్త దుమారం రేగింది. హైదరాబాద్‌ను పొలిటికల్‌గా మరింత హీటెక్కిస్తోంది. దీంతో మాధవీ లత.. మజాకా! అంటున్నారు జనం. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎంట్రీతో పాతబస్తీలో ప్రచారం తీరే మారిపోయింది. ఎన్నడూ లేనివిధంగా అసదుద్దీన్‌ తో ఢీ అంటే ఢీ అంటున్న మాధవి లత ఎంట్రీతో.. పాతబస్తీలో బస్తీ మే సవాల్‌ అన్నట్లు పోరు సాగుతోంది. ఇప్పుడు దర్గాకు వెళ్లి ప్రార్ధనలు చేయడం మరో వివాదంగా మారింది. ప్రచారం సందర్భంగా పాతబస్తీలోని ఓ దర్గాకు వెళ్లిన మాధవీలత, అక్కడ చాదర్‌ సమర్పించారు. దువా చేయాలని విజ్ఞప్తి చేస్తే, ఆమె సమాధిపై చాదర్‌ సమర్పించి దండం పెట్టుకొని తన గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె దర్గాలో చాదర్‌ సమర్పించడంపై ముస్లిం మత పెద్దలు మండిపడడంతో ఇదో వివాదంగా మారింది. ఇక ఎంఊఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ కూడా పాతబస్తీలో ఎలక్షన్‌ హీట్‌ పెంచుతున్నారు. ప్రచారం సందర్భంగా అక్కడే ఉన్న స్థానికులతో ముచ్చటించారు. మరోవైపు కార్యకర్తలు పెద్దకూర తింటాం.. ఒవైసీని గెలిపిస్తామంటూ నినాదాలు చేస్తూ హల్చల్‌ చేశారు. ఇది కూడా మరో కాంట్రోవర్సీకి దారితీసింది. ఇక హైదరాబాద్‌ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమీర్‌ మాత్రం.. బీజేపీ, ఎంఐఎం రెండూ కలిసి మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

అసద్‌ భాయ్‌.. నేనొస్తున్నా..
హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు తాను పార్టీలో లేనని, తనపై వస్తున్న కామెంట్స్‌ను తాను పట్టించుకోబోనని, సొంత ఇంటివారు చేసే వ్యాఖ్యలు నాకేమీ ఇబ్బందికరం కావని హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. తాను సంఫ్‌ు నుంచి వచ్చానని, తాను చేసిన సేవే తనకు టికెట్‌ వచ్చేలా చేసిందని వ్యాఖ్యానించారు. ధర్మం, న్యాయం తెలిసినదాన్ని ప్రజల కోసం పని చేస్తానని ఆమె పేర్కొన్నారు. అసద్‌ భాయ్‌.. తానొస్తున్నానంటూ ఆమె వ్యాఖ్యా నించారు.చట్టవ్యతిరేకమైన పనులు చేస్తే ఇక ఊరుకునేదే లేదని వార్నింగ్‌ ఇచ్చారు. అసదుద్దీన్‌ మైనారిటీలకు, హిందువులకు ఎవరికీ న్యాయం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్యాయంగా యువకులను జైల్లో వేయిస్తున్నారని ఫైరయ్యారు. హైదరాబాద్‌ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈసారి మార్పు తథ్యమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాధవీలత చెప్పారు. 40 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో మార్పు రాబోతోందని, అసదుద్దీన్‌ను ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తంచేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు