Friday, May 17, 2024

హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నయా.. దందా

తప్పక చదవండి
  • మేడ్చల్ జిల్లాలో అనుమతి.. హైదరాబాద్ జిల్లాలో నిర్వహణ
  • ఉస్మానియా గుర్తింపు లేకుండానే మూడు సంవత్సరాలుగా దందా
  • ఆడిట్ సెల్ సిబ్బందితో యాజమాన్యాల కుమ్మక్కు
  • రెండు లక్షల జరిమానా, కళాశాలను రద్దు చేయాలి
  • సీజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్

వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఓయూ అధికారుల కళ్ళు కప్పి ఆడిట్ సెల్ సిబ్బందితో ప్రైవేట్ యాజమాన్యాలు కుమ్మక్కై నయా దందాలకు పాల్పడుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గుర్తింపు పొందినటువంటి శ్రీ మేధావి డిగ్రీ కళాశాల హబ్సిగూడలోని రెండు రకాల సెక్షన్లను నిర్వహిస్తుంది. సాధారణ స్థాయిలో డిగ్రీ తరగతులను నిర్వహిస్తూ యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి ఫీజులను కొనసాగిస్తూ ఉంది. ఇది ఇలా ఉండగా హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పేరుతో బంజారాహిల్స్ లో హంగు ఆర్భాటాలతో, ప్రీమియం ఫర్నిచర్లతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ అదనంగా బీబీఏ, పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నారు.

నిజానికి హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ బంజారాహిల్స్ లో చదువుతున్న విద్యార్థులకు అక్కడ ఎలాంటి పర్మిషన్ లేదన్న సంగతి వారికి తెలియదు. విచిత్ర ఏమిటంటే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 గౌరీ శంకర్ నగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా ఎంబీఏ కళాశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇంత తతంగం నడుస్తున్న ఉస్మానియా యూనివ‌ర్సిటీ అధికారులు మాత్రం సైలెంట్ మోడ్ లో ఉన్నారు. యూనివ‌ర్సిటీ అధికారులు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యాజ‌మాన్యంతో లోపాయ‌కారి ఒప్పందం చేసుకొని ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించినటువంటి హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కళాశాల యాజమాన్యాల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి, రెండు లక్షల రూపాయల జరిమానా విధించి తక్షణమే కళాశాలను రద్దు చేయాలని క్రైస్తవ జన సమితి పక్షాన మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

యూనివ‌ర్సిటీ నిబంధనలకు తూట్లు..
ఉస్మానియా యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఎక్కడైనా ఒక కళాశాల గుర్తింపు తీసుకుంటే గుర్తింపు ఇచ్చినటువంటి ప్రాంతంలోనే కళాశాలలను నిర్వహించాలి. అనుమతి తీసుకునేటప్పుడు కళాశాల యాజమాన్యాలు లీజు డిడి, ప్లే గ్రౌండ్ , తరగతుల విస్తీర్ణం, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలు ఓకే అడ్రస్ లో ఉన్నందున డిగ్రీ కళాశాలకు అనుమతిని ఇస్తారు. గతంలో షైన్ ఇండియా, ఎస్ పి ఆర్ లాంటి డిగ్రీ కళాశాలలకు 2 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు