Friday, June 14, 2024

సల్లావుద్ధీన్ రాసలీలలు

తప్పక చదవండి
  • ప్ర‌జా ఆరోగ్య మ‌రియు కుటుంబ సంక్షేమ సంచాల‌కుల కార్యాల‌యంలో కామ‌పిశాచి
  • మహిళలను టార్చర్ పెడుతున్న సూపరిండెంట్
  • ఉద్యోగినీలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సల్లావుద్ధీన్
  • లైంగిక వేదింపులు తట్టుకోలేక 2023లో ఓ నర్సు సూసైడ్
  • సరూర్ నగర్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు
  • 2నెలలు డ్యూటీకి రాకుండా.. మెడికల్ లీవ్ కింద సెలవులు
  • ఆరోగ్య శాఖ ప్లానింగ్ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న కీచ‌కుడు
  • అప్పటి డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్‌ హెల్త్ నుంచి నేటి పై స్థాయి అధికారుల స‌పోర్ట్‌
  • చిత్రహింసలు భరించలేక ప్రభుత్వానికి లేఖ రాసిన మ‌హిళ ఉద్యోగిని
  • డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్‌ హెల్త్ లో కీచకుడి ఆగడాలపై చర్యలకు డిమాండ్

‘మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లు’ ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ కీచకుడు మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. తోటి ఉద్యోగినీలను భ‌య‌పెట్టించి అక్రమ సంబంధాలు, శారీరకంగా వాడుకుంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడు. రాష్ట్ర ఆరోగ్యశాఖ కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి మహిళా ఉద్యోగినీలను లైంగికంగా వేధిస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే.. డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్‌ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెలిఫేర్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్ సల్లావుద్దీన్ అనే కామపిశాచి రాసలీలు అన్నీ ఇన్నీ కావు. ఏ స్త్రీ పైనా అతగాడి చూపుపడితే చాలు వాళ్లను శారీరకంగా లోబర్చుకునే వరకు వదిలిపెట్టడు. ‘ఉండేందుకు స్థలం ఇస్తే పడుకోవటానికి మంచం అడిగినట్లు’ పెద్ద సారు కొలువు చేస్తున్న ఈయన.. తనకింద పనిచేసేటోళ్లు తప్పు చేస్తే సరిచేయాల్సిందిపోయి ఇతగాడే గాడితప్పాడు. హెల్త్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే స్టాప్ నర్సు, నర్స్, ఇతర మెడికల్, కిందిస్థాయి సిబ్బందిపై పెత్తనం చలాయించే ఆఫీసర్… వాళ్ల ఫోన్ నెంబర్లు తీసుకొని టార్చర్ పెట్టడం అలవాటు. ఇతగాడి లైంగిక వేధింపులు తట్టుకోలేక 2023, జూలైలో ఓ స్టాప్ నర్సు బలవన్మరణానికి పాల్పడింది. డెంటల్ ఆస్పత్రిలో పనిచేసే స్టాప్ నర్సు జాయ్ మెర్సీ… సల్లావుద్దీన్ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుంది. అప్పట్లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో పెద్ద రచ్చ అయింది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ పీఎస్ లో సూపరింటెండెంట్ మహ్మద్ సల్లావుద్దీన్ పై ఎఫ్ఐఆర్ (నెం. 600/2023) కూడా నమోదు అయింది. రెండు నెల‌ల పాటు విధులకు రాకుండా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో ఉన్నత ఉద్యోగుల అండతో దొంగ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఆ రోజులను మెడికల్ లీవ్ కింద పరిగణించేలా చేశాడు.

- Advertisement -

2018 నుంచి ఓ మహిళ ఉద్యోగినీపట్ల మాటలు కలిపి దగ్గరయ్యాడు. అప్పట్లో ఆమెకు విడాకులు కావడంతో ఈ నేపథ్యంలో పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఫోటోలు, వీడియోలు తీయడం, బూతు బొమ్మలు చూపించడం వంటివి చేసి వాళ్లిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీశాడు. తర్వాత ఆమెను శారీరకంగా వాడుకుని వదిలేశాడు. పెళ్లి మాట వచ్చినప్పుడు దాటవేస్తూ వచ్చాడు. సల్లావుద్దీన్ శారీరక, మానసిక వేధింపులు తట్టుకోలేక 2 సార్లు ఈమె ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. పెద్దసారు చేతిలో మోసపోయానని తెలిసిన సదరు మహిళ ఆయనను దూరం పెట్టింది. 2022లో రెండో వివాహాం చేసుకొని భర్తతో ఆనందంగా గడుపుతోంది. కొన్నాళ్లకు ఆమె నెంబర్ తీసుకొని మళ్లీ ఆమెకు పదే పదే ఫోన్లు చేస్తూ కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. తాను అతడ్ని ఎదురించలేక, పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేయలేక ఇన్నాళ్లు కుమిలిపోతున్నాను. సూపరిటెండెంట్ లైగింక వేధింపులు, ఆయన అరాచకాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నందున ప్రభుత్వం స్పందించి ఉన్నతాధికారులతో విచారణ జరిపించి అతడిపై చర్యలకు ఉపక్రమించాలని తాను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కు ఉద్యోగినీ లేఖ రాసింది. మరోవైపు ఆరోగ్యశాఖ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న తోటి ఉద్యోగినీలు ఎందరో ఇతని బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో ఉద్యోగినీలను అర్రాస్ చేస్తున్న కీచక సల్లావుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు.

మహ్మద్ సల్లావుద్దీన్ ద్వారా లైంగిక వేదింపులు ఎదుర్కొన్న బాధిత మ‌హిళ‌ ఉద్యోగులు ఎవ‌రైనా ఆదాబ్ కార్యాల‌యంలో స‌ప్ర‌దించ‌గ‌ల‌రు.. వారి వివ‌రాలు పూర్తిగా గోప్యంగా ఉంచ‌బ‌డును…

కీచ‌క ఉద్యోగి మహ్మద్ సల్లావుద్దీన్ మ‌హిళా ఉద్యోగినిల‌పై జ‌రిపిన లైంగిక వేదింపులు, అవినీతి బాగోతాలు, స‌హ‌క‌రించిన ఉన్న‌త అధికారులపై పూర్తి ఆదారాల‌తో మ‌రో క‌థ‌నం ద్వారా వెలుగులోకి తేనుంది.. ఆదాబ్ హైద‌రాబాద్. మా అక్ష‌రం.. అవినీతిపై అస్త్రం…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు