Friday, May 17, 2024

మీరు బ్రతికున్నా చంపేస్తారు..

తప్పక చదవండి
  • డెత్‌ సర్టిఫికేట్‌ సృష్టించి నకిలీ పత్రాలు తయారీ..
  • అమీన్‌పూర్‌లో బయటపడుతున్న కళ్ళు బైర్లుకమ్మే నిజాలు..
  • నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను కాజేసే ముఠాను జైలుకు పంపిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్‌..
  • విలేఖరుల సమావేశంలో ముఠా గుట్టు రట్టు చేసిన ఎస్‌.పీ.
  • మీకు అమీన్‌పూర్‌లో ఖాళీ ప్లాట్‌ ఉందా..? అయితే జాగ్రత్త పడండి..
  • లేకపోతే మీ జాగా మాయమైపోతుంది హెచ్చరించిన ఎస్‌.పీ. రూపేష్‌..

అమీన్‌ పూర్‌ మున్సిపాలిటీలో రోజు రోజుకూ వింత వింత మోసాలు బయటపడుతున్నాయి.. మీకు ఖాళీ జాగా ఉంటే చాలు.. దుర్మార్గులు ఆ జాగా మీద కన్నేస్తారు.. మీరు బ్రతికి ఉండగానే చనిపోయినట్లు డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టిస్తారు.. దానితో మీ ఆధార్‌ కార్డు నెంబరుపై ఇంకొకరి పేరు ముద్రిస్తారు.. దాని ఆధారంగా ఆ జాగాను ఇంకొకరికి అమ్మి సొమ్ము చేసుకుంటారు.. ఆధార్‌ కార్డును సైతం నకిలీగా తయారు చేస్తుంటే.. ఇక రక్షణ ఎక్కడుంటుంది..? దాంతో మీ వివరాలు బట్టబయలు అవుతాయి.. మీ బ్యాంకు బాలెన్సులు సైతం ఖాళీ అయ్యే ప్రమాదం వుంది.. ఇది పక్కన బెడితే మీరు చెమటోడ్చి సంపాదించుకున్న స్థలాలు మీకు తెలియకుండానే వేరొకరికి అమ్మబడతాయి.. ఆతరువాత మీరు లబోదిబోమన్నా మిమ్మల్ని రక్షించేవారు ఎవరూ ఉండరు.. అమీన్‌ పూర్‌ మున్సిపాలిటీలో మీకు స్థలం ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్లి చూసుకోండి.. మీ పేరుమీద ఒక బోర్డును అక్కడ పాతేయండి.. లేకపోతే దుర్మార్గపు ముఠా వారి జండా పాతేస్తారు.. అయితే ఈ ముఠాను పట్టుకున్న జిల్లా ఎస్‌ పీ రూపేష్‌ వారిని అదుపులోకి తీసుకోవడం ముదావహం.. ఆయన చూపిన తెగువపై సర్వత్రా ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి.. విలేఖరుల సమావేశంలో ఆయన ఎన్నో విషయాలు వెల్లడిరచారు..

నకిలీ ఆధార్‌, నకిలీ పత్రాలు, నకిలీ ఓనర్‌, నకిలీ వంశస్తులను సృష్టించి కోట్ల విలువ చేసే ఫ్లాట్లను కొల్లగొడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు సి.సి. యస్‌ పోలీసులు. సుమారు టూ. 15 కోట్ల విలువ చేసే ప్లాట్‌ లను కాచేసినట్లు గుర్తించారు పోలీసులు.. దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ మీడియాకు తెలియజేశారు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ ఐ.పి.యస్‌. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌ నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువలు పెరగడంతో అక్రమార్కులు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని నకిలీ ఆధార్‌, నకిలీ పత్రాలను, నకిలీ ఓనర్లను, నకిలీ వంశస్తులను సృష్టిస్తూ అమాయక ప్రజల స్థలాలను కాజేస్తూ ఇబ్బందులకు గురిచేస్తూ.. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నారు. నకిలీ పత్రాలు, నకిలీ ఓనర్లను సృష్టించి ప్లాట్‌ లను కాజేసిన విషయమై గత నెల 20 వ తేదీన అరెస్ట్‌ కాబడిన నిందితులు దుర్గా ప్రసాద్‌, సుబ్బరావు, రవిగౌడ్‌ లను పోలీసు కస్టడీకి తీసుకొని విచారించగా 1) దుర్గా ప్రసాద్‌, 2) సుబ్బరావు, 3) రవిగౌడ్‌, ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలో అమీన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అమీన్పూర్‌, రామేశ్వరం బండా ప్రాంతంలో గల, గత 20-25 సంవత్సరాలుగా ఖాళీగా వున్న ప్లాట్‌ లను గుర్తించి, అట్టి ప్లాట్‌ యొక్క అసలు యజమాని వివరాలు తెలుకుని, రెండు మార్గాలలో.. 1) నకిలీ యజమానిని సృష్టించి అసలు యజమాని పేరు మీదుగా నకిలీ ఆధార్‌ కార్డు, నకిలీ సెల్‌ డీడ్‌, లింక్‌ డాక్యుమెంట్లను తయారు చేసి ప్లాట్లను అమ్మడం. 2) నకిలీ వంశస్తులను సృష్టించి ప్లాట్లను అమ్మడం.

- Advertisement -

అందుకోసం బండి దుర్గాప్రసాద్‌, రవిగౌడ్‌ లు చాలా కాలంగా అంటే దాదాపు గత 20-25 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నా ప్లాట్లను గుర్తించి, ఆ ప్లాట్‌ యజమానికి సరిపడిన వయస్సు గల వ్యక్తి లేదా మహిళ కావాలి అని సుబ్బారావుతో చెబుతాడు.. సుబ్బారావు అమాయక ప్రజలను ఎంచుకొని, వారికి రెండు, మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి, వారు చెప్పిన రోజు రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ కు వచ్చి సంతకాలు చేయవలసిందిగా ఒప్పందం చేసుకొని, అసలు యజమాని పేరు మీద నకిలీ ఆధార్‌ కార్డ్‌ ను తయారు చేసి, ప్లాట్లను అతని నుండి వేరే వ్యక్తికి, అతని నుండి మరో వ్యక్తి కి ఇలా ఇద్దరు ముగ్గురు పేర్ల మీదికి మార్చి, వేరే వ్యక్తులకు అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేవారు. మరొక మార్గంలో నకిలీ వంశస్తులను సృష్టించి అసలు యజమాని మరణించినట్లుగా ఎఫ్‌ ఎం సి మరణధ్రువీకరణ పత్రం సృష్టించి, అతని వంశస్తులైన, కూతురు ఉన్నట్లుగా వేరే మహిళలను సృష్టించి ప్లాట్లను అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేవారు. ఇక ఈ ముఠా నకిలీ ఆధార్‌, నకిలీ పత్రాలు, నకిలీ వంశస్తులను సృష్టించి, ఇప్పటి వరకు 15 నుంచి 20 ప్లాట్లను అమ్మారని, ఈ ప్లాట్ల విలువ సుమారు రూ. 15 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఈ ముఠా ఈవిధంగా నకిలీ ఆధార్‌, నకిలీ పత్రాలు, నకిలీ వంశస్తులను సృష్టించి అమాయక ప్రజల ప్లాట్‌ లను కాజేయడంలో రిజిస్టర్‌ కార్యాలయం వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినటట్లుగా కనిపిస్తుందని, వారిపై కూడా చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

అసలు ఈ ముఠాకు అసలు బ్యాక్‌ బోన్‌ ఎవరు..? ఈ వ్యవహారం వెనుక ఎంతెంత పైకం చేతులు మారుతున్నాయి.. చట్టం కోర్టులు ఉన్నా ఇంతకు బరితెగించడానికి ఎవరు సహకరిస్తున్నారు.. ఆధార్‌ కార్డులను సైతం నకిలీ తయారుచేస్తూ.. బ్రతికున్న వారిని చంపేస్తూ.. మూడో కంటికి తెలియకుండా ఇదంతా ఎలా జరిగింది.. అన్న విస్తుపోయే వాస్తవాలను వరుస కథనాలతో వెలుగులోకి తీసుకుని రానుంది ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు