Saturday, April 27, 2024

అదానీని సీఎం కలిస్తే తప్పేంటి?

తప్పక చదవండి
  • పారిశ్రామిక ప్రగతి కోసమే ఒప్పందం
  • ఫ్రస్టేషన్ లో కేటీఆర్, హరీశ్ రావు లు
  • బిజెపితో అంటకాగిన పార్టీ బిఆర్‌ఎస్‌
  • హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి
  • బాగుండదని మేమే వద్దంటున్నాం
  • మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రెండు, మూడు సీట్లకు మించి రావని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారు వస్తానంటే వద్దని అంటామా అని ప్రశ్నించారు. దీనికి బీఆర్‌ఎస్‌ నేతలు వక్రభాష్యాలు పలుకరుతున్నారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చింది. రాష్ట్రం బంగారు ప్లళెం కాదు.. అప్పుల కుప్పగా మార్చారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారు. రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోంది. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్‌ మద్దతు ఇచ్చింది. వారి బంధం ఎలాంటిదో మొన్నటి ఎన్నికల్లో కూడా బయటపడిందన్నారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌ అంటకాగిందే తప్ప కాంగ్రెస్‌ ఎప్పుడూ బీజేపీని దగ్గరకు రానీయలేదన్నారు. ఇరుపార్టీల స్నేహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందువల్లే రూ.వేల కోట్లు కుమ్మరించినా.. శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవలేదన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యున్న మైత్రి ప్రజలందరికీ తెలుసునన్నారు. 2018 ఎన్నికలప్పుడు బీఆర్‌ఎస్‌ చాలా హామీలు ఇచ్చి అమలు చేయలేదు. గతంలో విపక్షాలు బీఆర్‌ఎస్‌ను రెండేళ్ల తర్వాత విమర్శిస్తే.. పసికందును విమర్శిస్తున్నారా అని వాపోయారు. మరి బీఆర్‌ఎస్‌ నేతలు 2 నెలలు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. అప్పుడే విమర్శలు చేస్తూ.. ప్రభుత్వం కూలిపోతుందని శాపనార్థాలు పెడుతున్నది ఎవరని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసింది. మిగతా గ్యారంటీల అమలు కోసమే ’ప్రజాపాలన’ నిర్వహించాం. దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే మిగతావి అమలు చేస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ను వీడటానికి ఇప్పటికే చాలా మంది సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీ ప్రతినిధులే అవిశ్వాసాలు పెడుతున్నారు. గత రెండేళ్లలో కృష్ణా బేసిన్‌లో నిండుగా నీరు ఉన్నప్పటికీ సాగుకు నీళ్లివ్వలేదు. ఈ ఏడాది వర్షాలు లేక నాగార్జునసాగర్‌లో జలాలు అడుగంటిపోయాయి. కృష్ణా బేసిన్‌లో నీరు లేనప్పుడు రెండో పంటకు ఇవ్వడం ఎలా సాధ్యం?‘ అని జూపల్లి అన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు. తమ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చిందని అంటున్నారని బీఆర్‌ఎస్‌ తమతో పోటీపడి మరి హామీలు ఇచ్చిందని మరి వాటిని ఎలా అమలు చేసేవారిని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ కు ప్రజలు బుద్ధి చెప్పి 2 నెలలు కూడా కాలేదు.. అప్పుడే కేటీఆర్‌, హరీష్‌ రావు లు పోటీపడి సమావేశాలు పెడుతున్నారని మంత్రి జూపల్లి విమర్శించారు. లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావడానికి సిద్దంగా ఉన్నా.. తాము వద్దనుకుంటున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ప్రజా పాలన నిర్వహణ ప్రణాళిక రూపొందించాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. దశాబ్దాల పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది సమస్యలు, కష్టాలు తీరుతాయని ఎంతో ఆశతో ఉన్నారన్నారు. ప్రజల సమస్యలను తీర్చి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశ్యంతో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించిందని అన్నారు. అధికారులు ఏదో మొక్కుబడిగా కాకుండా నిర్లక్ష్యాన్ని వీడి, జవాబుదారీ తనంతో అత్యంత పారదర్శంకంగా పని చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించి ఆ డాటాను డిజిటలైజ్‌ చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు