Tuesday, October 15, 2024
spot_img

ప్రాణహిత – చేవెళ్ల నిర్మిస్తాం..

తప్పక చదవండి
  • కాళేశ్వరం కంటే ప్రాణహిత – చేవెళ్ల ఉత్తమం
  • కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ. 95 వేల కోట్ల ఖర్చు..
  • వార్షిక నిర్వహణ వ్యయం 13 వేల కోట్లు
  • సీడబ్ల్యూసీ అప్రూవ్‌ చేసింది 80 వేల కోట్లు
  • రిపేర్లు అయ్యే సరికి రూ. 1.50 లక్షల కోట్లకు..
  • మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగడం బాధాకరం
  • కుంగినప్పటి నుంచి కేసీఆర్‌ స్పందించలేదు
  • ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేపడతాం
  • డ్యామేజీపై జ్యుడీషయల్‌ ఎంక్వయిరీ
  • కాళేశ్వరానికి జాతీయ హోదా అడగలేదు
  • నీటిపారుదుల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
  • మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించిన మంత్రులు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై జ్యుడిషియల్‌ ఎంక్వైరీ చేయిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి శాసన మండలిలో ప్రకటించారని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో సైట్‌ మీద ఒక సారి వాస్తవాలు తెలుసుకుందామని మేడిగడ్డ విజిట్‌ కోసం వచ్చామని తెలిపారు. ఇక్కడి నుంచి కన్నేపల్లి పంప్‌ హస్‌, అన్నారం బ్యారేజీలను పరిశీలించి హైదరాబాద్‌ వెళతామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌ : కాళేశ్వరం కంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఉత్తమమైనది అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్‌ సందర్శనకు తెలంగాణ మంత్రులు వెళ్లారు. ఈ సందర్భంగా నీటిపారుదుల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నీరందించేలా డిజైన్‌ చేశామని అన్నారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, కోటమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి కేసీఆర్‌ స్పందించలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగడం బాధాకరమని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేపడతామని అసెంబ్లీలో ప్రకటించిన సంగతిని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని 80 వేల కోట్ల నుంచి లక్షా యాభై వేల కోట్లకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెంచిందని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కాళేశ్వరంపై కాంగ్రెస్‌ పార్టీ ఒకే విధానంతో ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గతంలో రూ.38 వేల కోట్ల వ్యయంతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి 16.40 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి నిర్ణయించామన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు వ్యయంతో 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి నిర్ణయించిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంజినీర్ల సలహాలు కేసీఆర్‌ తీసుకున్నారా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంజినీర్లుగా సలహాలు ఇవ్వాలి.. వినకపోతే సెలవు పెట్టి పోవాలని స్పష్టం చేశారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ఎప్పుడూ నిండుగా ఉంటుందన్నారు. ఫామ్‌హౌస్‌కు తప్ప ఇతర పొలాలకు నీరు పోదన్నారు.ఇంత ఖర్చు చేసినా ఎంత ఆయకట్టుకు నీరు వెళ్తోందని కోమటిరెడ్డి నిలదీశారు. కాళేశ్వరం కోసం ఎంత విద్యుత్‌ వాడారు? అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగినప్పుడు గత ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోయిందన్నారు. రైతులకు స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని టీఎంసీల నీరు ఎత్తిపోశారు? అని మంత్రి శ్రీధర్‌బాబు నిలదీశారు. తిరిగి గోదావరిలోకి ఎంత నీటిని వదిలారు? అని ప్రశ్నించారు. ఆదాయం ఎక్కువ చూపారు, రూపాయికి 52 పైసలు మాత్రమే ప్రయోజనం కలిగేలా ఉందన్నారు. కాళేశ్వరం కింద ఎకరాకు నీరు ఇచ్చేందుకు అయ్యే ఖర్చు రూ.46 వేలు అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ 90 శాతం ఎత్తిపోతలకే పోతోందన్నారు. మల్లన్న సాగర్‌ కోసం భూకంప అధ్యయనం చేశారా? అని మంత్రి శ్రీధర్‌బాబు అడిగారు. బాహుబలి పంపుల నాణ్యత, ధరల గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. నిర్మాణంలో చూపిన అత్యుత్సాహం.. నిర్వహణలో ఎందుకు చూపలేదు? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్రకు కూడా లబ్ధి చేకూర్చేలా 148 మీటర్ల ఒప్పందం చేశామన్నారని.. డయా ఫ్రామ్‌ వాల్‌ ఆర్‌సీసీతో కట్టి ఉంటే ప్రమాదం జరిగేదా? అని నిలదీశారు. సీకెండ్‌ ఫైల్‌ ఫెయిల్‌ అయినందుకే రోజు రోజుకు కుంగి పోయిందని వివరించారు. ప్రొటెక్షన్‌ పనులు ఒక్క వరదకే పోతే ఎలాంటి పనులు చేసినట్లు అని నిలదీశారు. ప్రమాదం ఉందని 2022లోనే ఈఈపై అధికారులు లేఖ రాశారని వెల్లడిరచారు. నిర్మాణ సంస్థకు రాసిన లేఖలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని గట్టిగా నిలదీశారు. కాళేశ్వరం అంచనా వ్యయం రూ.1,27,872 కోట్లు కాగా.. కాళేశ్వరం నిర్మాణానికి ఇప్పటి వరకు.. రూ.93,872 కోట్లు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.71,565 కోట్లు అప్పుగా తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులో ఇంకా చెల్లించాల్సిన అసలు రూ.66,868 కోట్లు. డిస్కంలకు చెల్లించాల్సిన పెండిరగ్‌ బిల్లులు రూ.3,192 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు వాడిన విద్యుత్‌ 6,918 మిలియన్‌ యూనిట్లు కాగా ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా 1,054 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు