Thursday, May 2, 2024

అన్నిట్లో ఎక్కువే..

తప్పక చదవండి
  • రాష్ట్రంలో 8.97 శాతం పెరిగిన నేరాలు
  • ఈ ఏడాది మొత్తం 2,13,121 కేసులు నమోదు
  • సైబర్‌ నేరాలు 17.59 శాతం పెరిగినట్లు వెల్లడి
  • డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ కేసులే ఎక్కువ
  • డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టం
  • తెలంగాణ డీజీపీ రవి గుప్తా వెల్లడి
  • రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ రవి గుప్తా వెల్లడిరచారు. గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. సమాజంలో డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ ఎక్కువ అయ్యాయని ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ గా ఉందన్నారు. విద్యాసంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు డ్రగ్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టమని హెచ్చరించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. 41 శాతం కోర్టు శిక్షలు పెరిగాయని డీజీపీ పేర్కొన్నారు. 175 మంది నేరగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించామన్నారు. సోషల్‌ మీడియా ద్వారా 1 లక్షా 38 వేల ఫిర్యాదులు అందాయన్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టమ్‌ విజయవంతగా నడుస్తోందన్నారు. రాష్ట్రంలో 100, 112 కు 16 లక్షల ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని.. 7 నిమిషాల్లో రెస్పాండ్‌ అయ్యామని డీజీపీ వెల్లడిరచారు.
గతేడాది కంటే 2023లో క్రైం రేటు పెరిగిందని.. గతేడాదితో పోలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 8.97 శాతం క్రైమ్‌ రేట్‌ పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది మొత్తంగా 2,13,121 కేసులు నమోదు చేశామని డీజీపీ పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్‌ క్రైం నేరాలు భారీగా పెరిగాయని డీజీపీ తెలిపారు. 2022తో పోలిస్తే 17. 59 శాతం మేర సైబర్‌ క్రైం నేరాలు పెరిగాయని.. ఈ ఏడాది మొత్తంగా 16339 సైబర్‌ క్రైం కేసులు నమోదు చేసినట్టు డీజీపీ వెల్లడిరచారు. ఈ ఏడాది 1108 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని.. ఐపీసీ సెక్షన్‌ కింద 1,38,312 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. మొత్తం 73 అత్యాచార కేసుల్లో 84 మంది దోషులకు జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని వివరించారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1,360 డ్రగ్‌ కేసులు ఎన్డీపీఎస్‌ కింద నమోదు చేశామని.. ఇవి గతేడాదితో పొలిస్తే 15.6 శాతం ఎక్కువ అని తెలిపారు. 2,52,60 కేజీల గంజాయి, 1240 గంజాయి మొక్కలను సీజ్‌ చేశామని.. 2583 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ద్వారా 59 కేసులు నమోదు చేసి, 182 మందిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపిన డీజీపీ.. 7.99 కోట్లు సీజ్‌ చేసినట్టు వివరించారు. 175 మంది రిపీటెడ్‌ డ్రగ్‌ ఫెడ్లర్స్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేశామని, 12 మంది ఫారెన్‌ అఫెండర్స్‌ను అరెస్ట్‌ చేసినట్టు తెలిపిన డీజీపీ.. 536 మంది డ్రగ్స్‌ కంజూమర్స్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చామని వివరించారు.
మరోవైపు.. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కేసులు 1877 నమోదు చేశామని డీజీపీ వివరించారు. మహిళలపై వేధింపుల విషయంలో.. 19013 కేసులు నమోదైనట్టు డీజీపీ వివరించారు. ఇందులో 2284 అత్యాచారం కేసులుండగా.. 33 వరకట్న హత్యలు, 132 వరకట్న మరణాలు, 9458 వరకట్న వేధింపుల కేసులు, మహిళలు హత్యలు 213, 884 మహిళ కిడ్నాప్‌ కేసులు నమోదైనట్టు వివరించారు. ఈ ఏడాది 2426 పొక్సో కేసులు నమోదు కాగా.. ఒక నిందితుడికి మరణ శిక్ష, 104 మందికి జీవిత ఖైదీ శిక్షలు విధించినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 20,699 కేసులు నమోదు కాగా.. 6788 మంది మృతి చెందగా.. 19,137 మంది గాయాలబారిన పడినట్టు తెలిపారు డీజీపీ. 287 హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసులు నమైదు కాగా.. 557 మంది భాదితులను రెస్క్యూ చేసి.. 364 మంది ట్రాఫికర్స్‌ను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. గ్రే హౌండ్స్‌ అండ్‌ ఆక్టోపస్‌ ద్వారా 132 జరగ్గా.. అందులో124 తెలంగాణలో, మరో 8 అంతర్రాష్ట్రాల్లో ఆపరేషన్‌లు నిర్వయించినట్టు డీజీపీ రవి గుప్తా తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు