Monday, April 29, 2024

తెలంగాణ పరిస్థితి కూడా ఇంతేనా

తప్పక చదవండి
  • హామీలు గుప్పించి మోసం చేస్తారా
  • కర్నాటక సిఎం వ్యాఖ్యలపై కెటిఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ యుద్దానికి దిగుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో అప్పులు ఉన్నాయంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సాకులు చెబుతున్నారంటూ గులాబీ నేతలు ఇప్పటికే విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌. రేవంత్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఎన్నికల హామీల అమలుకు డబ్బు లేదని కర్ణాటక సీఎం అన్నారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఇదే జరుగుతుందా? విపరీతమైన ప్రకటనలు హామీలు ఇచ్చేముందు మీకు కనీసం ఆర్థిక పరిస్థతిపై పరిశోధన ప్రణాళిక ఉండదా? అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో పేర్కొన్న వీడియోను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ ఇవాళ రీట్వీట్‌ చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవని కర్నాటక సీఎం అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పారు. ఆ ప్రసంగానికి చెందిన వీడియోను ఉత్తరాంధ్ర నౌ అనే సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. ఆ పోస్టును ఎమ్మెల్యే కేటీఆర్‌ రీట్వీట్‌ చేస్తూ కొన్ని ప్రశలు లేవనెత్తారు. ఎన్నికల వాగ్దానాలను, గ్యారెంటీలను నెరవేర్చేందుకు డబ్బు లేదని కర్నాటక సీఎం అంటున్నారని కేటీఆర్‌ తన ఎక్స్‌ పోస్టులో విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉండబోతుందా అని కూడా ఆయన ప్రశ్నించారు. కపట వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసినట్లు ఆయన ఆరోపించారు. ఏమాత్రం పరిశోధన చేయకుండా మోసపూరిత వాగ్దానాలను ఎలా ఇస్తారని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎటువంటి ఎª`లానింగ్‌ లేకుండానే విపరీతమైన ప్రకటనలు ఎలా చేస్తారని ఆయన తన ఎక్స్‌ పోస్టులో నిలదీశారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని, ఎన్నికల్లో వాగ్దానం చేసింది కరెక్టే అని, కానీ అన్ని వాగ్దానాలను పూర్తి చేయలేమని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు