Monday, April 29, 2024

రాసలీలల మంత్రి నిన్ను మహిళసమాజం..అసహ్యించుకుంటుంది

తప్పక చదవండి
  • తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని భావోద్వేగానికి గురైన
    కరీంనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పురమల్ల శ్రీనివాస్‌

కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌ ) : కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్‌ బుధవారం కరీంనగర్‌ డిసిసి కార్యాలయంలో అత్యవసరంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పురుమల్ల శ్రీనివాస్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నన్ను ఓడిరచేందుకు కుట్రలు చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. రాసలీల మంత్రి గంగుల కమలాకర్‌ నిన్ను మహిళ సమాజం అసహించుకుంటుందని అన్నారు. వక్ఫ్‌ బోర్డ్‌ భూములను ఖబ్జా చేసిన గంగుల కమలాకర్‌ కు ఓట్లు వేయడానికి మైనారిటీ ప్రజలు దూరంగా ఉన్నారన్నారు.తమ భూములను కబ్జా చేసిన మంత్రి గంగుల కమలాకర్ను ఓడిస్తామని ప్రతిజ్ఞ చేసిన ఎంఐఎం నేతలు ఇప్పుడు ఎందుకు అతనికి మద్దతు ఇస్తున్నారని పేద ప్రజలకు చెందిన కాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసే మంత్రి గంగుల అని డబ్బులు పంచుతూ నియోజకవర్గ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నరన్నారు.మూడు పర్యాయాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన గంగుల అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు ఓటమి భయంతో డబ్బులు ఎందుకు పంచుతున్నట్టని అభివృద్ధి పేరుతో నిధులను కాజేసింది గంగుల కాదా ప్రశ్నించారు.రాసలీలల మంత్రిగా రాష్ట్ర మంత్రివర్గంలో గుర్తింపు పొందిన గంగులను మహిళలు అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు.బిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీలకు చెందిన గంగుల కమలాకర్‌, బండి సంజయ్‌ లు ఇద్దరు సర్పంచ్‌ స్థాయి నుండి ప్రజాదరణతో నేడు కరీంనగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే స్థాయికి ఎదిగిన నాపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.ఈ ఎన్నికల్లో బండి సంజయ్‌ ని గెలిపించి బిజెపి పార్టీలోకి పోయి తిరిగి ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో గంగుల కమలాకర్‌ ఉన్నాడని అన్నారు.రైతుబిడ్డగా ఒక వార్డు మెంబర్‌ స్తాయి నుండి నేడు కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసే స్థాయికి ఎదిగిన నన్ను ప్రజలు ఆదరించాలని కోరారు.నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఒక బలహీన వర్గానికి చెందిన నాపై కక్ష పూరితంగా కేసులు పెట్టి 72 రోజులపాటు జైల్లో పెట్టి నా భార్య పిల్లలకు నన్ను దూరం చేసింది గంగుల కమలాకర్‌ అని అన్నారు.మంత్రి గంగుల కమలాకర్‌, అతని అనుచరుల వల్ల నష్టపోయిన ప్రజల ముందుకు చెప్పుకోలేక బాధలు అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారన్నారు.గంగుల కమలాకర్‌, బండి సంజయ్‌ తమ అవసరాల కోసం వాళ్ళ రాజకీయ ఎదుగదల కోసం ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ టి సంతోష్‌ కుమార్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు అబ్దుల్‌ రెహమాన్‌, డిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్‌.కే. సిరాజ్‌ హుస్సేన్‌, మాజీ కార్పొరేటర్‌ ఆరీఫ్‌, నాయకులు పొన్నం మధు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు