Monday, April 29, 2024

కేసీఆర్‌ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు…

తప్పక చదవండి
  • తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్సే
  • జమ్మూ కాశ్మీర్‌ పిసిసి అధ్యక్షుడు వికార్‌ రసూల్‌ వార్ని

మిర్యాలగూడ : పదేళ్లుగా తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన బి.ఆర్‌.ఎస్‌ సర్కార్‌ ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి కుటుంబ పాలన అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని జమ్మూ కాశ్మీర్‌ పీసీసీ అధ్యక్షుడు వికార్‌ రసూల్‌ వార్ని అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం రాజీవ్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పాటు అయ్యేది తెలంగాణ ప్రభుత్వమేనని, పదేళ్లుగా కేసీఆర్‌ అవినీతి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, పేద ప్రజలను ఆదుకునే కాంగ్రెస్‌ వైపు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అమలు కావటం లేదంటూ తప్పుడు ప్రచారాలు బి ఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్నారని అన్నారు. పదేళ్లపాటు మాటలతో కాలం వెళ్ళబుచ్చిన బి ఆర్‌ఎస్‌ సర్కార్‌ కాంగ్రెస్‌ ప్రకటించిన మేనిఫెస్టో చూసి తాము అమలు చేస్తామంటూ తెలపటం విడ్డూరంగా ఉందన్నారు. పేదలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తుందన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో ఉన్న బి ఆర్‌ ఎస్‌, ఎంఐఎం పార్టీలన్నీ ఒకటేనని, లోపాయి కారి ఒప్పందాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజాసేవ చేస్తున్న మిర్యాలగూడ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బిఎల్‌ఆర్‌ (బత్తుల లక్ష్మారెడ్డి )పేరు జమ్మూకాశ్మీర్‌ వరకు వినిపిస్తుందని మిర్యాలగూడలో బి ఎల్‌ఆర్‌ గెలుపు తద్యమని తెలిపారు.ప్రజలు ఆలోచించి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో బి ఎల్‌ ఆర్‌,రాష్ట్ర నాయకులు స్కైలాబ్‌ నాయక్‌,పట్టణ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్‌ రెడ్డి,నూకల వేణుగోపాల్‌ రెడ్డి,ఎం ఏ సలీం,ముదిరెడ్డి నర్సిరెడ్డి, చిలుకూరు బాలు, సలీం, ఇమ్రాన్‌ ఖాన్‌, ఆహజార్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు