Thursday, May 16, 2024

బీఆర్‌ఎస్‌ అంటే స్కీంలు..కాంగ్రెస్‌ అంటే స్కాంలు…

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ను నమ్మితే కరెంట్‌ ఖతమే..
  • దామోదర్‌ రెడ్డి పాలనలో మూడు కొట్లాటలు ఆరుకేసులు..
  • 60 ఏళ్లలో జరుగని అభివృద్ధిని పదేళ్లలోనే చేశా..
  • మూసీ మురికి నీరు, కరెంటు కోతలు ఆకలి దారిద్య్రాలనులను పారద్రోలింది కారు గుర్తే..
  • ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్‌ రెడ్డి..

సూర్యాపేట : బీఆర్‌ఎస్‌ అంటే స్కీంలు..కాంగ్రెస్‌ అంటే స్కాంలు అని మంత్రి, బిఆర్‌ఎస్‌ సూర్యాపేట అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని బడి తండా, మున్యా నాయక్‌ తండ,పాండ్య నాయక్‌ తండ, చివ్వెంల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.తమ గ్రామంలోకి వచ్చిన అభివృద్ధి ప్రదాత ను పూలవర్షంతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వచ్చిన వేలాదిమంది ప్రజలతో మాట్లాడిన మంత్రి కాంగ్రెస్‌ను నమ్మితే కరెంట్‌ ఖతమే అన్నారు.దామోదర్‌ రెడ్డి పాలనలో మూడు కొట్లాటలు ఆరుకేసులు తప్పా.. గ్రామాలు, పట్టణంలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు.ఆఖరి సారి అంటూ కొంగ జపం చేస్తున్న వారికి ఓటేస్తే భవిష్యత్తు నాశనమే అన్నారు. జగదీష్‌ రెడ్డి ఏమీ చెయలేదు అంటున్న దామోదర్‌ రెడ్డి వారి పాలనలో మా బిఆర్‌ఎస్‌ పాలనలో సూర్యాపేట జరిగిన అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.అరగంటసేపు మాట్లాడ లేని, నిలబడలేని నాయకులతో అయ్యేదేం లేదన్నారు.మనం వేసే ఓటు మనకి ఏం తెస్తదో ఆలోచించి వేయాలి అని పేర్కోన్నారు. పదవులు,సొంతలాభం చూసుకునే కాంగ్రెస్‌ నాయకులు ప్రజలకు మేలు చేయలేరని అన్నారు.మూడవ సారి అధికారం లొకి రాగానే,ప్రతి గ్రామం లో అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని, ప్రజలు కోరిన సమస్యలను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పరిషరిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఆసరా పింఛన్‌ను పెంచుకుందామని, విడతలవారీగా రూ.5016 చేస్తామన్నారు. ఇంటింటికీ కేసీఆర్‌ బీమా కింద పేదలందరికీ రూ.5లక్షల కేసీఆర్‌ బీమా అందజేస్తామన్నారు. ఇంకా రేషన దుకాణాల ద్వారా సన్న బియ్యం అందజేస్తామన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం పేద మహిళలకు నెలకు రూ.3వేల జీవన భృతి అందిస్తామని, రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌, మహిళా సమైక్య సంఘాలకు సొంత భవనాలను నిర్మిస్తామన్నారు. సూర్యాపేటలో మూడవసారి నన్ను ఆశీర్వదిస్తే 25 వేల వు మంది యువతీ యువకులకు ఉపాధి కల్పన లక్ష్యంగా , డ్రై పోర్ట్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఐటీ పరిశ్రమ ను కూడా 3000 ఉద్యోగులకు విస్తరిస్తానని అన్నారు. డ్రై పోర్ట్‌ నిర్మాణంతో సూర్యాపేట రూపురేఖలే మారిపోతాయని అన్నారు. మీ బిడ్డగా మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కోరారు.మంత్రి ప్రచార కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్‌ బిజెపిలకు చెందిన పలువురు నేతలు కార్యకర్తలు ఆయన సమక్షంలో బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా కండువాలు కప్పి సాధారణంగా స్వాగతం పలికారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు