Thursday, May 2, 2024

కంచె చేనును మేస్తే.. కాపాడేదెవరు..?

తప్పక చదవండి
  • కంచె కూడా సిగ్గుపడే అధికారి నవీన్ మిట్టల్ ఐఏఎస్..
  • రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో ఈయన చేసిన అవినీతికి హద్దు లేదు..
  • ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలంటే ఈయనకు లెక్కేలేదు..
  • స్వార్ధ ప్రయోజనాలకోసం బదిలీల ప్రక్రియ చేపట్టిన ఘనాపాటి..
  • జోన్స్ అనే ప్రక్రియను సైతం జోక్స్ గా మార్చేసిన కుసంస్కారి
  • అధికార దుర్వినియోగం చేయడంలో ఈయనకు ఈయనే సాటి..
  • తన సతీమణిని సైతం తన స్వార్ధానికి ఉపయోగించుకోవడం ఈయన స్పెషాలిటీ..
  • సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దృష్టి పెట్టాలంటున్న సామాజిక వేత్తలు..

అధికారం చేతిలో ఉంటే ఇతగాడికి చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు డోంట్ కేర్.. అక్రమ సంపాదన మెక్కామా..? అవినీతికి పరాకాష్టగా మారామా..? ఎవరూ నన్ను ఏమీ చేయలేరు.. అన్న ధోరణిలోనే ఈయనగారి వ్యవహారం కొనసాగింది.. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పేరు వింటేనే అవినీతికి సైతం వణకు పుడుతుంది.. ఐఏఎస్ అంటే ఐతే కానీ.. ఏ మాత్రం సంపాదించాం.. ఎస్ అంటూ సవాలు విసిరి తానో మోనోపాలీ అని నిరూపించుకున్నాడు.. నవీన్ మిట్టల్ అవినీతి భాగోతంలో మరో పేజీని మీముందుకు తీసుకుని వస్తోంది ‘ఆదాబ్ హైదరాబాద్’..

హైదరాబాద్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా, ఇన్స్పెక్టర్ జనరల్ గా నవీన్ మిట్టల్ ఉన్నత హోదాలో విధులు నిర్వహించిన ఈ ఐఏఎస్ అధికారి ప్రభుత్వం ఉత్తర్వులను, చట్టాలను గౌరవించి విధులను నిర్వర్తించాలి. కానీ ఇతగాడు కంచ చేను మేసినట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సైతం భే ఖాతర్ చేస్తూ.. కేవలం తన స్వార్ధ ప్రయోజనాల కోసం అక్రమ బదిలీలు చేపట్టడం జరిగింది. జీవో నెంబర్ 317 ప్రకారం ఏ జోన్ లో విధులు నిర్వర్తిస్తున్న గ్రేడ్ 2 సబ్ రిజిస్టార్లు ఆ జోన్ లోనే విధులను నిర్వహించాలి.. వారు ఎట్టి పరిస్థితుల్లో వేరే జోన్లో తన విధులను కొనసాగించడానికి వీలు ఉండదు.. కానీ నవీన్ మిట్టల్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తోంది.. గజ్వేల్ లో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిని రంగారెడ్డి జిల్లా, గండిపేట్ కు బదిలీ చేయడంలో ఆంతర్యం ఏమిటో నవీన్ మిట్టల్ గారే తెలపాలి. అంతేకాకుండా మహబూబ్ నగర్ నుండి ఒక అధికారిని రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేయడం, జడ్చర్ల నుండి మరో అధికారిని ఆజంపూర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి బదిలీ చేశారంటే.. ఇతగాడి అక్రమ వ్యవహారం ఏ స్థాయిలో కొనసాగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

కాగా ఉమ్మడి రాష్ట్రంగా వున్న అప్పటి ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలని.. అప్పటి ప్రభుత్వాలు ఆలోచించి.. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలే కాకుండా, సేవా దృక్పథంతో పేద ప్రజలకు విద్యను అందించాలన్న ఆలోచన విధానం కలిగిన ఎడ్యుకేషన్ సొసైటీస్ కు ప్రభుత్వమే స్వయంగా ఎకరాలలో భూములను కేటాయించి, కేంద్ర, రాష్ట్ర నిధులతో విద్యార్థులకు సరిపడే ఇన్ ఫాస్ట్రక్చర్ ఏర్పాటుచేసి.. ఎయిడెడ్ కళాశాలలో, పాఠశాలల్లో ఉద్యోగస్తులకు ప్రభుత్వమే వేతనాలు చెలించి, ఎడ్యుకేషన్స్ సొసైటీస్ యాజమాన్యం ఆధ్వర్యంలో నామమాత్రపు ఫీజులు తీసుకొనుటకు అనుమతులు ఇచ్చి, అనేక ఎయిడెడ్ పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో నెలకొల్పడం జరిగింది. ఎయిడెడ్ పాఠశాలలో మంచి నాణ్యమైన విద్యలు అభ్యసించి ఎందరో ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాంటి ఎయిడెడ్ విద్యా వ్యవస్థను కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా విధులు నిర్వహించిన నవీన్ మిట్టల్.. నాటి ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలకు కేటాయించిన స్థలాలను, ప్రైవేట్ ఎడ్యుకేషన్ సొసైటీ యజమాన్యానికి లోపాయ కారి ఒప్పందంతో.. ఎయిడెడ్ కోర్సులను తొలగించి, ప్రభుత్వ భూములను, ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను అప్పనంగా అప్పజెప్పింది వాస్తవం కాదా? సార్.. నవీన్ మిట్టల్ గారూ జవాబు చెప్పండి.. సిగ్గూ ఎగ్గూ లేని మనస్తత్వంతో పేద పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేసిన మిమ్మల్ని ఎలా శిక్షించాలో చెప్పండి.. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ మీలాంటి వారు క్షమార్హులు కాదు.. ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలకు, పాఠశాలలకు కేటాయించిన వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ రికార్డులన్ని పాఠశాల విద్యాశాఖలో, ఉన్నత విద్యాశాఖలో మాయం చేసేశారు.

ఇక మరో వ్యవహారం చూస్తే.. కళ్ళు బైర్లు కమ్ముతాయి.. శైలి ఆశ్రిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్” (రిస్ట్రేషన్ నెంబర్ 032034 తేదీ 25.6.2008) మండి గోబింద్‌గ్రామ్, పంజాబ్ అండ్ పీచ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నవీన్ మిట్టల్ సతీమణి రిఘు బన్సల్ డైరెక్టర్‌గా (డీన్ నంబర్ 02225367) వ్యవహరిస్తున్నారు. ఆదాబ్ హైదరాబాద్ పైన పేర్కొన్న ఆస్తుల సమాచారాన్ని కొంతమేరకు సేకరించగలిగింది. కానీ సీబీఐ, ఈడీ వంటి ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థలు ఈ విషయంపై విచారణ చేస్తే పై అధికారి మోసపూరిత కార్యకలాపాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పటికైనా డిఓపిటి నవీన్ మిట్టల్ అక్రమ వ్యవహారాలపై సమగ్రంగా దర్యాప్తు చేసి వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సామజిక వేత్తలు కోరుతున్నారు.

నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయనగారి వ్యవహారాన్ని పరిశీలించి తగిన చర్యలు గైకొని చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.. నవీన్ మిట్టల్ రెవెన్యూ శాఖలో చేసిన అవినీతి బాగోతం పూర్తి ఆధారాలతో మీ ముందుకు తేనుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు