Friday, May 17, 2024

బీఆర్ఎస్ లీడర్ల చెరలో పీర్జాదిగూడ చెరువుల కథనానికి ఆదాబ్ హైదరాబాద్ ఎఫెక్ట్…

తప్పక చదవండి
  • పీర్జాదిగూడ మున్సిపల్ లో… బీఆర్ఎస్ నాయకుల కబ్జాలు ధ్వంసం
  • పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
  • రెవిన్యూ, ఇరిగేషన్ మున్సిపల్ అధికారుల సహకారం తోనే బి ఆర్ ఎస్ నాయకుల కబ్జాలు.

హైదరాబాద్ : పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని పెద్దచెరువు జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను ఆదాబ్ హైదరాబాద్ లో వచ్చిన బి ఆర్ ఎస్ లీడర్ల చెరలో పీర్జాదిగూడ చెరువులు కథనానికి స్పందించిన రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేసారు.

ఇవేకాక మున్సిపల్ పరిధిలో ఇప్పటికే పెద్దచెరువు చుట్టు ప్రక్కల కూడా బి ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరిపి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. ఇట్టి అక్రమాలకు రెవిన్యూ సహకారం, ఇరిగేషన్ అధికారుల నో ఆబ్జాక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు మున్సిపల్ వారు అనుమతులిస్తూ లంచాలు మింగుతూ, ప్రభుత్వ ఆదాయానికి భారీగా కొడుతూ వస్తున్నారు.

- Advertisement -

మున్సిపల్ పరిధిలో జరిగే అక్రమాలకు రాష్ట్ర మాజీ ఓ మంత్రి సహాయ సహకారాలతోనే పాల్పడ్డారని విపక్షాలు బహటంగానే చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం మారినా కూడా బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల అక్రమాలు ఇలాగే కొనసాగుతాయా… లేక ఇంతటితో ఆపేస్తారా వేచి చూడాల్సిందేనని మున్సిపల్ ప్రజలు అనుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు