Thursday, May 2, 2024

ఆరుకోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణం

తప్పక చదవండి
  • 80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌ : ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం ద్వారా 6 కోట్ల మహిళలు ప్రయాణిం చారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడం, కార్మికుల సంక్షేమం తమ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. నగరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద 80 కొత్త బస్సులనుమంత్రి పొన్నం ప్రభాకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని సంచలన నిర్ణయం తీసుకున్నామున్నారు. అన్ని బకాయిలు విడతాలవారిగా చెల్లిస్తామన్నారు. 100 శాతం ఆక్యుపెన్సీ దాటిందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తా మన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగకుండా మహిళలకు రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ నష్టాలను తొలగించేందుకు తాను చొరవ తీసుకుంటానని.. త్వరలో సీఎం రేవంత్‌ రెడ్డి 1000 ఎలెక్టిక్ర్‌ బస్సులు ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడిరచారు. ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మీ పథకానికి మంచి రెస్పాన్స్‌ వస్తోందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్‌ఆర్టీసీ కృషి చేస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్‌ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఇందులో 400 ఎక్స్‌ ప్రెస్‌, 512 ప్లలె వెలుగు, 92 లహరి స్లీపర్‌ కమ్‌ సీటర్‌, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయన్నారు. పర్యావరణ హితమైన ఎలక్టిక్ర్‌ వాహనాలను హైదరాబాద్‌ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తెస్తోందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడిరచారు.ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, సీపీ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు