Monday, April 29, 2024

అసైన్డ్‌ భూములపై అసత్య ప్రచారాలు

తప్పక చదవండి
  • భూములు గుంజుకుంటామంటూ దుష్ప్రచారం
  • అధికారంలోకి రాగానే వాటికి పట్టాలు ఇస్తాం
  • దుబ్బాకతో నాది ప్రత్యేక అనుబంధం
  • కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట మునుగుతాం
  • కత్తుల సంస్కృతి ఎప్పుడైనా చూసామా
  • దుబ్బాక ప్రచారంలో సీఎం కేసీఆర్‌

దుబ్బాక : అసైన్డ్‌ భూములు గుంజుకుంటామని బీజేపోడు ప్రచారం చేస్తున్నాడని.. బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఎవరివైనా భూములు గుంజుకున్నదా? రైతులకు మేలు చేయడం తప్పా గుంజు కుంటదా? అంటూ ముఖ్యమంత్రి కుల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. అసైన్డ్‌ భూముల రైతుల సోదరులకు పట్టాలని ఇవ్వాలని నిర్ణయించామని యావత్‌ తెలంగాణకు దుబ్బాక గడ్డ నుంచి తెలియజేస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం దుబ్బాకలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభాకర్‌రెడ్డి పదేళ్ల నుంచి ఎంపీగా ఉన్నడు. చీమకు, దోమకు అన్యాయం చేసిన వ్యక్తి కాదు. పదేళ్లు ఎంపీగా పని చేస్తే ఎన్నడూ గర్వం చూపెట్టలేదు. ఏ ఒక్కరోజు గర్వపడలేదు. దర్పం చూపట్టలేదు. ప్రజల్లో కలిసిపోయి అయినంత వరకు మంచిచేసిండు తప్పా చీమకు అపకారం చేసిన వ్యక్తి కాదు. దుబ్బాక నేను హైస్కూల్‌లో చదువుకున్నప్పటికీ నుంచి ఇదే ప్రాంతంలో ఉన్నా. ఎప్పుడన్నా కత్తిపోట్లు చూసినమా? ఆ సంస్కారం ఉందా? కత్తులు పట్టుకొని రావాలంటే.. మనకు దొరుకయా కత్తులు. వాడికన్నా పొడువు కత్తులు తేగలుగుతాం కదా..? కానీ, పద్ధతి కాదని.. మర్యాద పాటించాం. ఎంత కోపం వచ్చినా అణచివేసుకున్నాం. హరీశ్‌రావు గిట్ల ఉరికి ఆయనను హాస్పిటల్‌లో అడ్మిన్‌ చేశారు. కడుపులో బ్లీడిరగ్‌ అయితే చెడు రక్తం తీసేసి.. ఆయన పేగును 15ఇంచులు డాక్టర్లు కట్‌ చేశారు. నేను కూడా పర్యటన ముగించుకొని ఉరికి పరామర్శించాను. భగవంతుడి దయతో ఆయన బయపడ్డాడు. మన అందరి అదృష్టం, భగవంతుడి దయ.. ప్రభాకర్‌ అదృష్టం అన్నారు. అప్పుడు రామలింగారెడ్డి చనిపోతే ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో నేను ప్రచారానికి రాలేదు. నేను వస్తే ఒడిసేపోవు కథా. ఆ ఎన్నికల్లో ప్రచారానికి రాకపోతే ఏం జరిగింది ఇక్కడ ? ఆయన వాగ్దానాలంటే చెప్పరాదు. తిన్నోనికే ఇస్తరాకు.. నాగళ్లు.. ఎడ్లు.. గీసినోడికే గుండు.. నోటికి వచ్చిన వాగ్దానం చేసిండు. ఒక్క ఏకాన పని జరిగిందా ? ఇటువంటి మోసకారులు గెలిచారు. నేను ఇంకొక మాట చెబుతున్నా. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇవాళ 157 మెడికల్‌ కాలేజీ పెట్టింది. ఒక్కటంటే ఒక్కటి తెలంగాణకు ఇవ్వలేదు. వంద ఉత్తరాలు రాసినా ఇవ్వలేదు. నవోదయ పాఠశాల జిల్లాకు ఒకటి ఇవ్వాలని పార్లమెంట్‌లో చట్టం ఉన్నది. మోదీకి వంద ఉత్తరాలు రాస్తే ఒక్కటంటే ఒక్కటి నవోదయ పాఠశాల ఇవ్వలేదు. ఒక్క మెడికల్‌ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీ పార్టీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి? బీజేపోడికి ఓటు వేస్తే మోరిల పాడేసినట్లవుతుందని అన్నారు. అదే బీజేపోడు పచ్చి అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నడు. బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ వస్తే అసైన్డ్‌ భూములు గుంజుకుంటరని చెబుతున్నడు. బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఎవరివైనా భూములు గుంజుకున్నదా? రైతులకు మేలు చేయడం తప్పా గుంజుకుంటదా? నేను దుబ్బాక నియోజకవర్గానికి కాదు.. యావత్‌ తెలంగాణ అసైన్డ్‌ భూముల రైతు సోదరులకు దుబ్బాక నుంచి చెబుతున్నా.. మొన్ననే నిర్ణయం చేశాం. అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇస్తే అందరిలాగే వాళ్లు ఉంటారని మొన్ననే నిర్ణయం చేశాం. భూములు గుంజుకుంటమనేది పచ్చి అబద్ధం.. వారందరికీ పట్టాలు ఇచ్చేస్తమని మనవి చేస్తున్నా. ఈ విధంగా జూటమాటలు చెబుతరు. అనేక బాధలు అనుభవించి.. మొన్ననే విముక్తి జరిగి.. కొద్దిగా ఇప్పుడిప్పుడే తెల్లవడుతున్నాం. దీన్ని మళ్లి చెడగొట్టుకోవాల్నా మనం ? దయచేసి నేను చెప్పిన విషయాలు, మీరు గమనించిన వాస్తవాలు.. అన్నింటిపై చర్చించి నిర్ణయం చేయండి’ అని పిలుపునిచ్చారు.
ప్రాజెక్టుల నుంచి నదుల్లోకి నీళ్లు ఇడుస్తరా? తెలంగాణ బాధ మనకు తెలుసు. పండెటోనికి ఎరుక గూనివాటం.. మన రైతులకు అవసరం కాబట్టి.. హల్దివాగులో గానీ.. కూడవెల్లి వాగులోకి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదులుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రభాకర్‌రెడ్డి నాకు సన్నిహితుడు. ప్రభాకర్‌రెడ్డి యోగ్యత ఉన్న వ్యక్తి. అతను దుబ్బాకలో నిలుబడత అని అడుగలేదు. ఆయన ఎంపీగా ఉన్నడు. మళ్లీ ఎంపీగా గెలుస్తడు. ఆయనకు నేనే చెప్పినా.. దుబ్బాకను కాపాడే అవసరం ఉంది.. ప్రభాకర్‌ అక్కడ పోటీకి రావాలని నేను కోరినా. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే. ఇక్కడ ఆర్డీవో ఆఫీసు కావాలని ప్రభాకర్‌రెడ్డి కోరిండు. ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి.. నెల రోజుల్లోనే ఆర్డీవో ఆఫీసు తెచ్చి పెట్టే బాధ్యత నాది అని చెబుతున్నాను. రెండుమూడు కాలేజీలు కావాలని కోరారు. మల్లన్నసాగర్‌ను తెచ్చుకున్నాం. మన నెత్తిమీద కుండలా ఉన్నది. దుబ్బాక నియోజకవర్గం మొత్తానికి 1.75లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. కాలువల పనులు జరుగుతున్నయ్‌. కూడవెల్లి వాగు మునుపు ఎట్లుండే. ఎండిపోయి నెత్తిమీద నీళ్లు చల్లుకుందామనుకున్నా లేకుండే. ఇవాళ కూడవెల్లి వాగు ఎండకాలంలో కూడా మత్తళ్లు దుంకుతున్నది’ అన్నారు. మల్లన్నసాగర్‌ పుణ్యమాని గోదావరి నీళ్లు కూడవెల్లి వాగులోకి వచ్చి ఎండాకాలంలో మత్తళ్లు దుంకుతున్నయ్‌. రైతుల పంటలు పండుతున్నయ్‌. ప్రాజెక్టుల నుంచి నదుల్లోకి నీళ్లు ఇడుస్తరా? తెలంగాణ బాధ మనకు తెలుసు. పండెటోనికి ఎరుక గూనివాటం.. మన రైతులకు అవసరం కాబట్టి.. హల్దివాగులో గానీ.. కూడవెల్లి వాగులోకి ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదులుకుంటున్నాం. భూగర్భ జలాలు పైకి వచ్చి పంటలు పండుతున్నయ్‌. ఇంకా బాగా అభివృద్ధి కావాలి.. ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. యోగ్యత కలిగిన వ్యక్తి ప్రభాకర్‌రెడ్డి. కూడెల్లి దేవుడి ఆలయాన్ని, రేగులకుంట మల్లన్న జాతరకు వెళ్లాను. ఆలయాలన్నీ బాగు చేసుకుందాం.. దుబ్బాక ఇంకా అభివృద్ధి కావాలి. దుబ్బాక మీద నాకు ప్రేమ ఉంటది. దుబ్బాక నాది. ఈ విషయం నాకు తెలుసు. దుబ్బాక రింగ్‌ రోడ్‌ కావాలని ప్రభాకర్‌రెడ్డి అంటున్నడు. వెంటనే సర్వే చేయించి.. దాన్ని కూడా మంజూరు చేయిస్తామని హామీ ఇస్తున్నాను. రాబోయే రోజుల్లో పట్టణం పెరుగుతుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయ్యింది. రూ.200కోట్లతో అభివృద్ధి చేసుకుందాం. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే తప్పకుండా దుబ్బాక సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నాది’ అన్నారు. దుబ్బాకతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పాఠశాల పెట్టిన భిక్షేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. దుబ్బాకలో ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరీయసి’. పుట్టిన గడ్డకంటే.. చదువుకున్న గడ్డకంటే గొప్పది ఏదీ ఉండదు అని చరిత్రలో చెప్పారు. దుబ్బాకలోనే నా హైస్కూల్‌ చదవంతా చదువుకున్నాను. దుబ్బాకతోని నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్న అంటే.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన అంటే.. దుబ్బాక పాఠశాల పెట్టిన ఆ చదువు భిక్షనే కారణం అని మనవి చేస్తున్నానని అన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్య పక్రియ ఉన్నప్పటికీ అందులో రావాల్సినంతగా రాలేదు. వచ్చిన దేశాలు బాగా ముందుకు దూసుకొని వెళ్తున్నాయి. నేను చెప్పే నాలుగు విషయాలను విని మీ గ్రామాల్లో చర్చ పెట్టాలని కోరుతున్నా. ఎన్నికల్లో అభ్యర్థుల మంచీచెడుతో పాటు వారి వెనుక ఉన్న పార్టీల చరిత్ర, నడవడికను చూడాలి. ఎన్నికలు వచ్చాయంటే అన్ని అబద్దాలు, అభండాలు.. తిమ్మిని బమ్మి చేయడం.. పచ్చి అబద్దాలు ప్రచారం చేయడం.. పచ్చి దుర్మార్గాలు జరుగుతుంటయ్‌. ఆ పరిస్థితి నుంచి దేశం బయటపడాలి. అప్పుడు చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. మంచి జరుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం ఓటు. మన ఐదు సంవత్సరాల రాష్ట్ర చరిత్ర, మన తలరాతను మారుస్తుంది. వేయాల్సిన వారికి కాకుండా వేరే వ్యక్తులకు ఆగమై ఓట్లు వేస్తే.. చెడ్డ ప్రభుత్వం వస్తే మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నేను చెప్పే నాలుగు మాటలు విని నిజానిజాలు తేల్చాలి. బీఆర్‌ఎస్‌ పోరాటం చేసి తెలంగాణ సాధించింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. హైదరాబాద్‌ స్టేట్‌ పేరుతో బాగుండేది. దాన్ని ఊడగొట్టి ఆంధ్రాలో కలుపడంతో 58 సంవత్సరాలు గోసపడ్డాం. 2014 సంవత్సరంలో తెలంగాణ వచ్చిన నాడు మన పరిస్థితి ఏంటీ ? మంచినీళ్లు లేవు.. సాగునీరు లేదు.. చేనేత కార్మికుల ఆకలిచావులు.. రైతుల ఆత్మహత్యలు, వలసలు ఇలా ఎన్నో బాధలు. అంత కాంగ్రెస్‌ మనల్ని బాధపెట్టింది. మన రాష్ట్రం మనకే ఉంటే బ్రహ్మాండంగా ఇవాళ ఎక్కడో ఉందుము’ అన్నారు. కాంగ్రెస్‌కు తమాషా.. మనకు జీవన్మరణ సమస్య. రైతుల భూముల బాధలు నాకు తెలుసు. మూడు సంవత్సరాలు తండ్లాడి ధరణిని తీసుకువచ్చాం. ఇంతకు ముందు రైతు భూమిపై హక్కులు రైతుల దగ్గర ఉండేవి కావు. ఏ రాత్రి ఎవడు కిందమీద రాసినా భూమి మారిపోయేది. ఎల్లయ్య భూమి మల్లయ్యకు.. మల్లయ్యది పుల్లయ్యకు రాస్తురు. ఆ బాధ పోవాలని ప్రభుత్వంలో ఉండే అధికారాన్ని తీసివేసి మీ బొటనవేలికి ఇచ్చాం. మీ బయోమెట్రిక్‌ లేకుండా భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ కూడా మాట్లాడుతున్నడు. రాహుల్‌కు ఎద్దు, ఎవుసం తెలుసో తెల్వదో నాకు తెల్వుదు. కాంగ్రెస్‌ వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తమని అంటున్నడు. దాని స్థానంలో భూమాత పెడుతరట. అది భూమాతనా? భూమేతనా? అంటూ ప్రశ్నించారు. ఇవాళ భూములు రిజిస్టేష్రన్లు ఈజీగా అవుతున్నయ్‌. లంచాల బాధ తప్పింది. మేం రైతుబంధు పంపిస్తే ఎంత మంచిగ వస్తున్నయ్‌. మీరు తీసుకొని పెట్టుబడికి వాడుకుంటున్నరు. ధరణిని తీసివేస్తే రైతుబంధు డబ్బులు ఎట్ల వస్తయ్‌. మళ్లీ పాత కథనే కదా? ఇవాళ ఇంట్ల కుసుంటనే డబ్బులు వస్తున్నయ్‌. రేపు అట్ల రావు. పటేల్‌ పట్వారీలను తెచ్చి.. కౌలుదార్‌ కాలమ్‌ పెట్టి చేస్తే ఏమవుతుంది.. మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగాలి. దరఖాస్తులు పట్టుకొని వెళ్తే రూ.30వేలు ఇవ్వమంటడు. మళ్లీ మొదటికే వస్తుది. పదేళ్ల నుంచి నేను పడ్డ పాట్లు.. కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. నేను చెప్పిన ప్రజాస్వామ్య పరిణితిపై ఆలోచన చేయాలి. ఈ విషయాలపై కేసీఆర్‌ కార్యకర్తలు చర్చ పెట్టాలి. వాటిపై మంచో చెడో తేలుద్దాం’ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు