Monday, May 6, 2024

ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చాలి

తప్పక చదవండి
  • ప్రజాభవన్‌ను స్కిల్‌ సెంటర్‌గా మారుస్తామన్నారు
  • హామీల అమలుకు పోరాడుతామన్న బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే హామలు వెంటనే అమలు చేస్తామని ప్రకటించినందున అందుకు తాము డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రగతి భవన్‌ను స్టడీ సర్కిల్‌గా మారుస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌గా మారుస్తామని చెప్పిందీ వారే..ఇప్పుడు డిప్యూటి సిఎంకు కేటాయించిందీ వారునని గుర్తు చేశారు. ఇకపోతే రైతు బంధులో కోత విదించడం సరైంది కాదన్నారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజసింగ్‌ మాట్లాడుతూ.. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ముందు ప్రమాణం చేయమని ముందే చెప్పామని, ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ముందు ప్రమాణం చేశామన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటిలతో అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. రాష్టాన్న్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారన్నారు. ఇచ్చిన గ్యారెనీటీలను కాంగ్రెస్‌ పార్టీ ఏ విధంగా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు నిధులు కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌ నుంచి తెస్తారా? లేక ఇటలీ నుంచి తెస్తారా…? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని.. ఆ పార్టీపై తమ యుద్ధం మొదలైందని రాజసింగ్‌ పేర్కొన్నారు. ఇదిలావుంటే ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ముందు ప్రమాణ స్వీకారానికి నిరాకరించడంతో తెలంగాణ అసెంబ్లీలో రాజా సింగ్‌, కొత్తగా ఎన్నికైన మరో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎదుట ప్రమాణం చేశారు. స్పీకర్‌గా ప్రసాద్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు సభకు హాజరై ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ఒవైసీని నియమిం చడాన్ని నిరసిస్తూ రాజా సింగ్‌తో పాటు మరో ఏడుగురు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు డిసెంబర్‌ 9న సభా కార్యక్రమాలను బహిష్కరించారు. ఒవైసీ కంటే సీనియర్‌ సభ్యులు ఉన్నందున నిబంధనలను ఉల్లంఘించి ప్రొటెం స్పీకర్‌గా నియమించారని కాషాయ పార్టీ ఆరోపించింది. ఆయన నియామకంపై బిజెపి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల ముసుగులో కొన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టడానికి ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించిందని ఒక మెమోరాండంలో ఆరోపించింది. ప్రొటెం స్పీకర్‌గా ఒవైసీ నామినేషన్‌ను పక్కన పెట్టాలని, కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీకి పూర్తిస్థాయి స్పీకర్‌ను ఎన్నుకునే పక్రియను నిలిపివేయాలని గవర్నర్‌ను కోరింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు