Monday, April 29, 2024

గులాబీ బాస్‌ కు మొదలైన గుబులు

తప్పక చదవండి

పీకే సర్వే తో తలలు పట్టుకుంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు

  • మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు డబ్బులు పంచండి
  • మంత్రులు మేల్కోండి…! ఓడిపోయారో గోవిందా .!!
  • ఏదోవిధంగా సంచలనాలు క్రియేట్‌ చేయండి
  • డబ్బులు కాదు ముఖ్యం.. గెలుపే లక్ష్యం
  • అధికార యంత్రాంగాన్ని కంట్రోల్‌ లో పెట్టుకోండి
  • పోల్‌ మేనేజ్మెంట్‌ సక్సెస్‌ చేయండి
  • సీఎం కేసీఆర్‌ తమ అభ్యర్థులకు ఆదేశాలు
  • ఓటమి అంచుల్లో మంత్రి కేటీఆర్‌.. దిద్దుబాటు చర్యలు షురూ…
  • సీనియర్‌ జర్నలిస్ట్‌ కొండం అశోక్‌ రెడ్డి

హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికలు తరుము కొస్తున్న నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో గుబులు ప్రారంభమైంది. రాష్ట్రంలో వీస్తున్న కాంగ్రెస్‌ గాలికి తట్టుకోలేక అధికార పార్టీ కొట్టుకుపోతుంది… తాజాగా ప్రముఖ సిఫాలజిస్ట్‌, ఐ ప్యాక్‌ సర్వే సంస్థ అధినేత (పీకే ) ప్రశాంత్‌ కిషోర్‌ తాజాగా బి ఆర్‌ ఎస్‌ కి ఇచ్చిన సర్వే రిపోర్ట్‌ లో పార్టీ ఆగాధంలో పడిపోతుందని చెప్పడంతో సీఎం కేసీఆర్‌ లో గుబులు ప్రారంభమైంది.. వెనువెంటనే దిద్దుబాటు చర్యలను చేపట్టేందుకు సీఎం కేసీఆర్‌ ఆగమేఘాల మీద అభ్యర్థులందరికీ కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ‘‘డబ్బులు వెదజళ్ళండి- ఓట్లు రాబట్టండి’’ అంటూ హుంకరించారు. ప్రధానంగా మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో పోల్‌ మేనేజ్మెంట్‌ లపై దృష్టి సారించి అధికారులను మచ్చిక చేసుకోవాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత ఖర్చు చేసైనా ఓటర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకుని , గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. డబ్బులతో పాటు స్థానికంగా ఏవైనా సంచలనాలు క్రియేట్‌ చేసి, ఓటర్ల సానుభూతిని పొందేందుకు పథకం ప్రకారం ముందుకు సాగాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.. ప్రధానంగా మంత్రులారా మేలుకోండి..! ఓడిపోయారో గోవిందా ..!! అంటూ సీఎం ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. ప్రధానంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, నిరంజన్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి , జగదీశ్వర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి , గంగుల కమలాకర్‌, మల్లారెడ్డి తమ తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ హవాకు తట్టుకోలేక పోతున్నారు.

- Advertisement -

ఓటమి అంచుల్లో మంత్రులు:

ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులంతా ఓటమి అంచుల్లో ఉన్నట్లు పీకే రిపోర్టుతో ఒక్కసారిగా పార్టీ అధినేత కేసిఆర్‌ షాక్‌ కు గురైనట్లు ప్రగతి భవన్‌ వర్గాల బోగట్టా.. అందరు మంత్రుల ఓటమి ఏమో కానీ, సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లలో ఎదురీదుతున్నట్లు పీకే ఇచ్చిన రిపోర్టులో వెళ్లడైంది. దీనికి విరుగుడుగా, మంత్రి కేటీఆర్‌ స్థానిక సర్పంచులతోపాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ లతో ఫోన్‌ సంభాషణలు చేస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అర్థించే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు.. గతంలో ఎన్నడూ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా, మంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరించారు.. ఇకనుంచి సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో ఉంటానని, వారంలో రెండు రోజులు మీతో గడుపుతానని బతిమిలాడుకుంటున్నారు. పైగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారని, మన పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారని, ఇది మంచిది కాదని మంత్రి కేటీఆర్‌ వారికి విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఇలా మంత్రి కేటీఆర్‌ మేడపైనుంచి దిగి, నేల మీదికి వచ్చినట్లు కనబడుతోంది.

సిద్దిపేటలో సరైన లీడర్‌ లేకనే:

సిద్దిపేటలో కూడా తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉంది.. అయితే, అక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నుంచి సరైన లీడర్‌ లేకపోవడం వల్ల సిద్దిపేటలో టిఆర్‌ఎస్‌ మెరుగైన ఫలితాన్ని సాధించనుంది. ఇక్కడ కూడా హరీష్‌ రావు కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.. గతంలో లక్ష పైచిలుకు మెజార్టీ వస్తే , ఈసారి 20 నుంచి 30 వేలకు పడిపోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. ఇప్పటివరకు 16 మంది మంత్రుల్లో సిరిసిల్ల నుంచి కేటీఆర్‌ , సిద్దిపేట నుంచి హరీష్‌ రావు మాత్రమే గెలుస్తారని ప్రచారంలో ఉండేది.. తాజాగా పీకే రిపోర్టులో ఈ రెండు నియోజకవర్గాల తాజా పరిస్థితిని తెలియజేయడం వల్ల కెసిఆర్‌ మరింత షాక్‌ కు గురైనట్లు తెలుస్తోంది..

కామారెడ్డిలో సీఎం ఎదురీత:

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు కూడా శృంగభంగం తప్పడం లేదు. ఈ రెండు స్థానాల్లో కూడా ఓటర్లు అంతగా పాజిటివ్‌ గా స్పందించడం లేదు.. గజ్వేల్లో ఓటర్లు సీఎం కేసీఆర్‌ పై కొంత గురుతర బాధ్యతతో ఓట్లు వేస్తామనుకుంటున్నా, కామారెడ్డి లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ప్రభావానికి ఎదురీత తప్పడం లేదు.. ఎందుకంటే కామారెడ్డి లో ఉన్న మైనార్టీ వర్గాలు, రైతులు, పెన్షన్‌ దారులు ,మహిళలు గంపగుత్తగా కాంగ్రెస్‌ వైపు ఓట్లు వేసేందుకు సిద్ధమయ్యారని రిపోర్టు పేర్కోవడం. అలాగే, స్వయంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పోటీ చేస్తుండడం వల్ల స్థానికంగా ప్రజలు తీవ్ర ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీస్తుంటే, నియోజకవర్గంలో పోటీ చేస్తున్న రేవంత్‌ సీఎం అభ్యర్థిగా భావిస్తుండడం వల్ల అంతర్గతంగా ఓటర్లంతా ఆయననే గెలిపించేందుకు సిద్ధమవుతున్నట్లు స్థానిక గ్రౌండ్‌ రిపోర్ట్‌ ను బట్టి తెలుస్తోంది .. ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం వల్ల స్థానికంగా ఓడిస్తే, రేపు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ,కామారెడ్డి జిల్లా పరిస్థితి ఏంటి..? అనే విధంగా ఆలోచన చేస్తున్నట్లు స్పష్టమవుతుంది … ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ కామారెడ్డి లో గెలిచేందుకు మంత్రి కేటీఆర్‌ తో పాటు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ లపై ఆధారపడి ఉన్నారు. కేటీఆర్‌ రోడ్‌ షోలు మాత్రమే చేస్తూ, ప్రజలకు అభివాదం తెలిపే ‘‘హవ భావాలు’’ నచ్చడం లేదు.. గెలవక ముందే ఇలా ఉంటే , గెలిచిన తర్వాత ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. కామారెడ్డిలో స్వయంగా సీఎం కేసీఆర్‌ సభ కూడా స్థానిక ప్రజల మైండ్‌ సెట్‌ ను మార్చలేకపోయింది..

పోల్‌ మేనేజ్మెంట్‌ చేయండి :

తాజాగా పీకే ఇచ్చిన రిపోర్టులో బీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయిలో వెనుకబడిపోయిందని, ప్రస్తుతం, ఇక చేసేది ఏమీ లేదని చేతులెత్తేసినట్లు సమాచారం.. అయితే, పోలింగ్‌ కు తక్కువ సమయం ఉండటం వల్ల, పోల్‌ మేనేజ్మెంట్‌ ద్వారా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు స్థానిక పోలీస్‌, ఎన్నికల అధికారులను మేనేజ్‌ చేస్తూ ముందుకు వెళ్లడమే మిగిలిందని పేర్కొన్నట్లు సమాచారం.. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత ఖర్చు చేసైనా లక్ష్యం సాధించాలని అంతర్గత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. అవసరమైతే పోటీలో ఉన్న మంత్రులు రూ. 500 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడిరదని వారికి గట్టిగా చెప్పినట్లు ప్రగతి భవన్‌ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.. అయినా కూడా ఇప్పటికిప్పుడు, ఓటర్లను బీఆర్‌ఎస్‌ వైపు తిప్పుకోవాలంటే, స్థానికంగా కొన్ని సంచలనాలు క్రియేట్‌ చేసి, ఓటర్ల సానుభూతిని పొందేందుకు ప్రయత్నించాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.. .ఈ రెండు అంశాలను పకడ్బందీగా నిర్వహించినట్లయితే కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, పీకే , సీఎం కేసీఆర్‌ కు సూచనలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం .. ఏది ఏమైనప్పటికీ, బీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పూర్తిస్థాయిలో పాతాళానికి పడిపోయినట్లు పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.. పీకే సూచనల మేరకు ఎన్నికల వాతావరణం మరింతగా వేడెక్కనుంది. డబ్బుల సంచులు ఓటర్ల ముందు మోకరిల్లనున్నాయి. దీనిపై ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టి సారించి, ప్రలోభాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాల్సి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు