Monday, April 29, 2024

ఉప్పల్ లో బీజేపీ అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ గెలుపు ఖాయం

తప్పక చదవండి
  • ఉప్పల్సం ఎంబిసి చైర్మన్గి శెట్టి రవీందర్ సాగర్
  • కెసిఆర్ పాలన లో అంత దోపిడీ
  • కెసిఆర్ తెలంగాణ ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు సిద్ధం
  • కెసిఆర్ పాలనలో అన్ని స్కాంలే
  • ప్రజల ఖజానా ఖాళీ కెసిఆర్ ఖజానా నిండే

కాప్రా (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ శాసనసభ ఎలక్షన్ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం 5వ డివిజన్ మల్లాపూర్ లో ఎంబీసీ చైర్మన్ సంగిశెట్టి రవీంద్రసాగర్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ, బిజెపి పార్టీ మేనిఫెస్టో ప్రజానీకానికి తెలియజేస్తూ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ కి ఓటు వేయాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర రావు అవినీతి పరిపాలన గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్తూ ఇప్పటికే ఐదు లక్షల 60 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి కాలేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి అవి కుంగిపోవడానికి కారణమైన అవినీతి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర రావుకి ఇప్పటికైనా ఓటుతో బుద్ధి చెప్పాలని హైదరాబాదులో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నట్టుగా రోడ్లు డ్యామేజ్ అయిన డ్రైనేజీలు పొంగిన సీట్ లైట్స్ రాకపోయినా పట్టించుకునే నాధుడు లేడు రోడ్స్ గురించి ప్రజలు అధికారులను అడిగితే డ్రైనేజ్ గురించి డ్రైనేజీ కవర్స్ గురించి బస్తీలో జరిగే డెవలప్మెంట్ గురించి అధికారులను అడిగితే హైదరాబాద్ తో పనిలేదు మాకు ఊర్లలో ఓట్లు వస్తే చాలు హైదరాబాదులో ఏడు స్థానాల్లో గెలిస్తే చాలు అంటున్నారు. జి హిచ్. యం. సి.మోరి తీసినంక పది రోజులైనా ఆ మోరి సిల్ట్ అనేది ఎత్తకుండా అక్కడే పడేయడం జరుగుతుంది. స్ట్రీట్ లైట్లు నెలరోజులు రాకపోయినా అటువైపు కూడా తిరిగి చూసే అవకాశం లేదు రోడ్లు ఇండ్లు గట్టి 20 సంవత్సరాలు అయినా కనీసం రోడ్డు వేయకుండా ప్రజలను ననా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ధనిక రాష్ట్రం అయినా తెలంగాణ అన్నారు మరి ఈ రోజు చిన్నచిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా డెవలప్మెంట్ పనులు చేయకుండా బిల్లులు ఇచ్చినట్లయితే కాంట్రాక్టర్లు పనులు చేస్తారని వారి బిల్లును కొన్ని సంవత్సరాల పూర్త ఆపడం జరుగుతుంద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే విషయమై మెయింటెనెన్స్ ఇంజనీర్లకు మాన్యువల్ మెయింటెనెన్స్ ఉన్నప్పుడు వాళ్లు రోజువారీగా మెయింటినెన్స్ చూసుకుని పని చేస్తు ఉంటారని ఆయన అన్నారు. హైదరాబాదులో పబ్లిక్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారని వర్కులకు సంబంధించి, టేకప్ చేయడానికి, వాటర్ వర్క్స్ సంస్థకు అప్ప చెప్పడం జరిగిందని అన్నారు. ఈ రకంగా పబ్లిక్కు వ్యవస్థనే చిన్న బిన్నం చేసేందుకు చంద్రశేఖర రావు పిట్ట కథలు చెప్పి ఎలక్షన్లలో ఐదు వేలు పడేసి ఓటు కొనడం ఐదు సంవత్సరాలు మళ్లి మన ఆదాయం దోచుకోవడం ఆదాయం దోచుకోవడానికి ఈ 5000 ఇచ్చి కూర్చోబెట్టి పిట్టకథలు చెప్పి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఇవన్నీ అలవాటైనాయని ప్రతి ఇంటింటికీ కూడా ప్రజానీకానికి తెలియజేస్తూ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పోతా గాని గోపాల్ గౌడ్, ఎక్స్ కౌన్సిలర్ కె ఆంజనేయులు, రవి గంగాధర్, ఎన్ రామచందర్, నరసింహ, గణేష్, మధు యాదవ్, వేముల శ్రీనివాస్ గారు ముఖేష్ సాగర్ పాల్గొనడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు