Monday, May 6, 2024

ఉప్పల్ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ

తప్పక చదవండి
  • బి ఆర్ ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి.

కాప్రా (ఆదాబ్ హైదరాబాద్) : ఉప్పల్ ప్రజలకు సేవ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని హామీ, కేసీఆర్ ప్రభుత్వంపై పూర్తీ విశ్వాసంతో ప్రజలు ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేసిన బి ఆర్ ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి.
ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లూ తిరుగుతూ స్థానికులతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, చేయబోయే పనులను వివరించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ఇంఛార్జి, TSEWIDC ఛైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారంలో భాగంగా 6 వేల బైక్ లతో భారీ ర్యాలీని నిర్వహించారు. ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ప్రచారానికి చివరిరోజు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏఎస్ రావు నగర్ నుంచి మొదలైన ర్యాలీ ఈసిఐఎల్, కాప్రా, మీర్పేట్ హెచ్ బీ కాలనీ, మల్లాపూర్, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్ వరకు సాగింది. ఈ భారీ బైక్ ర్యాలీ కార్యకర్తల్లో జోష్ నింపింది. ఉప్పల్ నియోజకవర్గం రహదారులన్నీ బీఆర్‌ఎస్‌ జెండాలతో గులాబీమయం అయ్యాయి, జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకు మన ఓటు నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ పార్టీ పాటలతో డిజె సౌండ్ లో పార్టీ శ్రేణులు అంతా కూడా డాన్సులతో సందడి చేశారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి ఉప్పల్ ప్రజలకు సేవ చేస్తా అని, పిలుపు మేర దూరంలో ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ఉప్పల్ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని, ఈనెల 30వ తారీకు జరిగే ఎన్నికలలో ఈవీఎం మిషన్లో మూడో నెంబర్ లో ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. గెలిచిన తర్వాత మీ అందరినీ కంటికి రెప్పల కాపాడుకుంటూ, కడుపులో పెట్టుకుని చూసుకుంటానని నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి లక్ష్మారెడ్డి మాట్లాడారు. టికెట్ అనౌన్స్మెంట్ అయినా రోజు నుండి 40 రోజులుగా పార్టీ శ్రేణులు విశ్రాంతి లేకుండా ప్రజల్లో తిరుగుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రేమ పూర్వకంగా ప్రతి ఓటరును కలుస్తూ కష్టపడుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మరో మూడు రోజులు అదే స్ఫూర్తితో పోలింగ్ రోజు చివరి ఓటు కూడా పడేంతవరకు పార్టీ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ సైనికులై గులాబీ దళం గుబాళింపు ఉప్పల్ నియోజకవర్గం అంతా వ్యాపించే విధంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు. పోలీసుల సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి సమన్వయంతో బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ఎంబిసి మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, బొంతు శ్రీదేవి యాదవ్, శాంతి సాయి జెన్ శేఖర్, పన్నాల దేవేందర్ రెడ్డి మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్ రెడ్డి, పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, గొల్లూరి అంజయ్య డివిజన్ అధ్యక్షులు, సెక్రటరీలు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు