Tuesday, May 21, 2024

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణం

తప్పక చదవండి

చరిత్రలోనే మొదటిసారిగా సికింద్రాబాద్లో నాలుగు రోజులు వరుసగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మొదటిరోజు శ్రీశైలం పుణ్యక్షేత్ర పురోహితులచే కళ్యాణం జరగగా, 2వ రోజు మురమళ్ళ, ౩వ రోజు బొంతపల్లి పుణ్యక్షేత్రం నుండి స్వామివారి పూజా మహోత్సవాలు నిర్వహించారు. స్వామి వారి కళ్యాణం తో పాటు, అమ్మవారి చండీ హోమాలు, భక్త హోమాలు తదితర దైవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాలకు గరికపాటి నరసింహారావు ప్రవచనం మరింత శోభని తెచ్చాయి.

సాంస్కృతిక పాటల పోటీలో రాణించిన చిన్నారులకు ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడైన ప్రఖ్యాత గాయకులు ఎస్పీ చరణ్, పార్థసారథి మరియు మల్లికార్జున్ చేతుల మీదుగా బహుమతులు అందించారు. కంచి నుండి విచ్చేసిన మాత వల్లభానందమాయి ఆధ్వర్యంలో దత్త హోమాలు జరగడం విశేషం. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర ఆరాధ్య జన సేవా వాహిని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అధ్యక్షుడు తాడికొండ విజయ్ కుమార్ సారథ్యంలో ట్రస్టీలు సుధాకర్ గుప్తా, శశిధర్, శశి భూషణ్, కైలాష్, మల్లికార్జున్ శర్మ, నందిత కపూర్, ప్రసాద్, మడ్డి పద్మ , మధుసూదన్ రెడ్డి, శివ తాడికొండ మరియు యమునా పాఠక్ ముఖ్యపాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి మరియు సైకాలజిస్ట్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యమున పాఠక్ మధ్య జరిగిన ఇష్టా గోష్టి సబికులను ఆకర్షించింది. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి చే ఆట కదరా శివ వాక్యానం, ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ ప్రవచనం, ఎం సింహాచల శాస్త్రి చే దక్షయజ్ఞ హరికథ, ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ ప్రవచనం సభను ఎంతగానో ఆకట్టుకుంది అని దైవజ్ఞ శర్మ , విశ్రాంత ఐఏఎస్ ముక్తేశ్వర రావు, ఐ ఫోకస్ వాసుదేవ శర్మ ప్రశంసించారు. సామవేదం షణ్ముఖ శర్మ రచించిన వీరభద్ర స్వామి పాటకు పార్థసారథి సంగీత దర్శకత్వం వహించారు. 3000 మంది మహిళల చే సామూహిక సౌందర్య లహరి పారాయణం, ఆ తరువాత సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఎంతో శుభసూచకం. ఈ భగవత్ కార్యాలకు హంపి పీఠాధిపతి విద్యారణ్యస్వామి విచ్చేసి తమ ఆశీర్వచనాలు అందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు